అడవి…

అడవిలో అరుణోదయం

ప్రకృతి ఆనంద నిలయం

జలజల పారే జలపాతం

మనసును తాకే దృశ్యా నందం

చెట్టు చేమ కొండ కోన

పురుగు పుట్ట చిత్తడి నేల

మొగ్గ పూలు కాయ పండు

పరవశాల కవితోదయం

వికసించిన అందాల నాట్యాల నడుమన

ఉరుములు మెరుపులు

వర్షపు చినుకులు పులకరింతలు నడుమ

ఆనందంతో కొమ్మ వంగెను

ఆకు ఆకు గుసగుసలాడే ను

నీటి బొట్టు ఆకును ముద్దాడి ప్రేమను పంచి పలకరించెను

కానలు మృగాల కాలవాల మాయెను

పక్షుల రెక్కల టపటపలో

సరిగమపదనిస స్వరసంగతులే

సంగీత సాహిత్య సమ్మేళనం గా

కిలకిరావములే

చెట్టు పై గూడు

చెట్టు కింద పుట్ట

పిట్ట పాముల సంచారాలు

లయబద్ద జీవనవికాసాలు

వన్యమృగాల సందళ్ళే

వనమంతా ఉషస్సు ప్రకాశాలు

మునుల  ధ్యానానికి నెలవు

భగవత్సాక్షాత్కారానికి కొలువు

అరుణ కిరణాల వెలుగులలో

మెరుపుల జిలుగుల బంగారం

అడివి నేల అద్దుకున్న

పసుపు పచ్చదనం

ప్రశాంత పర్యావరణం

హృదయానందం

అడవులు వర్షాల నెలవులు

ప్రతి పల్లెకు తీరేను కష్టాలు

జీవనమనుగడకు

గడియ గడియ నా గుండెను

తడుపుతున్న అడవులను

పరిరక్షించుకుందామా

ప్రాణహానితెచ్చుకుందామా

అందం ఆహ్లాదం కలిగిన

అడవులను కాపాడుకుందామా

కొట్టేసుకుందామా..!

మనసు అల్లకల్లోల ప్రశ్నల గది

అడవి అది మన ఆహ్లాదాల విడిది

This post was created with our nice and easy submission form. Create your post!

Written by Chakilam Manjula

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విజయ శిఖరం

దాంపత్య పరిమళం