మేలుకొలుపు

అవును..

నేను మేల్కొన్నాను..

నా ఉనికిని కాపాడుకుంటూ

నన్ను నేను నిలబెట్టుకుంటాను

శక్తిస్వరూపిణినై ముందుకు సాగుతాను..

అన్యాయాన్ని ప్రశ్నిస్తూ

అక్రమాలను ఖండిస్తూ

జీవిస్తాను..

అనాధలను ఆదుకుంటాను

అసహాయులకు ఆసరానవుతాను

నిస్సహాయులకు నీడనవుతాను..

కులం, మతం, వర్గవైషమ్యాలను

రూపుమాపుతూ..

సమసమాజాన్ని నిర్మిస్తాను

సమానత్వాన్ని సాధిస్తాను..

బూజుపట్టిన సిద్దాంత కుడ్యాల

దుమ్మును దునుమాడి దులిపేస్తాను..

మూఢనమ్మకాల జాడ్యాలను

జాడలేకుండా తరిమి

ఆ తుప్పును వదిలిస్తాను..

మంచిని ప్రేమిస్తా

చెడును ఖండిస్తా

కుట్రలనూ, కుతంత్రాలనూ..

ఛేదిస్తా…

స్వార్థపరులతో విభేదించి

వారి భరతం పడతా..

నను వేధించే, సాధించే

మృగాళ్ళ పాలిట సింహ స్వప్నమవుతా..

కామాంధుల కుత్తుకలను

అడ్డంగా తెగనరికే

అపర కాళికనై అవతరిస్తా..

సాయుధురాలినై

ఈ అవనిపై ధాటిగా చరిస్తా..

కొత్త చరితను సృష్టిస్తా..!!

లలిత చిట్టే

This post was created with our nice and easy submission form. Create your post!

Written by lalitha chitti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వితంతువులపై వివక్ష

Till it happens to you-నీకు జరిగే దాకా…