“మేము బతికితే, స్వేచ్ఛా జీవులుగానే బతుకుతాము”
అంటూ నినదిస్తూ బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన
వీర యోధురాలు రాణీ చెన్నమ్మ.
ఆమె ధైర్యసాహసాలు భారతదేశ ప్రజలు గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉండాలన్న ఆలోచనతో
రాణి కిత్తూరు చెన్నమ్మ విగ్రహం పార్లమెంటు ప్రాంగణములో 2007 సెప్టెంబరు 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఆవిష్కరించారు
అంతేకాదు కిత్తూరు రాణి చెన్నమ్మ విగ్రహాలు బెంగళూరు, కిత్తూరు నగరాలలో కూడా ప్రతిష్ఠించారు.
స్మారక తపాలా బిళ్ళ 1977 అక్టోబరు 23న విడుదల చేశారు.
కిత్తూరు రాణి చెన్నమ్మ జీవిత చరిత్ర ఆధారంగా కన్నడలో 1962లో కిత్తూరు చెన్నమ్మ సినిమా వచ్చింది.
ఆమె పేరు మీద తీర రక్షణ నౌక 1983 లో భారతీయ నౌకాదళములో ప్రవేశపెట్టారు.
కిత్తూరు చెన్నమ్మ పేరుమీద జానపద గేయాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఇంతకు రాణీ చెన్నమ్మ ఎవ్వరూ…ఆమె ధైర్యసాహసాలు ఏమిటో భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుందాం. చెన్నమ్మ కర్ణాటక లోని బెల్గాంకు 5 కి.మీ.దూరంలో ఉన్న కిత్తూరు రాజ్యంలో జన్మించారు. చెన్నమ్మ చిన్నతనముననే గుర్రపుస్వారి, విలువిద్యలలో శిక్షణపొంది, యుద్ధవిద్యలలో ఆరితేరారు. చెన్నమ్మ తండ్రి కాకతీయ దేశాయి కుంటుంబానికి చెందివారు.
చెన్నమ్మకు కిత్తూరు పాలకుడయిన మల్ల సర్జన తో పెండ్లి కావడం తో ఆమె కిత్తూరు రాజ్య రాణి అయ్యారు.
హైదరుఅలితో జరిగిన యుద్ధంలో మల్లసర్జన బంధించబడ్డాడు. మూడేళ్ల జైలు శిక్ష తర్వాత 1816లో విడుదలై కోటకు తిరిగి వస్తూ దారిలో చనిపోతారు.
1824వ సంవత్సరం…కిత్తూర్ కోటను తన సైన్యంతో చుట్టుముట్టిన బ్రిటిష్ అధికారి జాన్ ఠాక్రే రాణి చెన్నమ్మను లోంగిపోవాలని కోరాడు. కానీ స్వేచ్ఛగా బతుకుతాం లేదా పోరాడి మరణిస్తాం అన్న ఉద్యమ స్పూర్తి తో
రాణి చెన్నమ్మ యుద్దానికి సిద్దం అంటూ యోధుని వేషధారణలో తన సైన్యంతో కోట బయటకు వచ్చి బ్రిటిష్ సైన్యం లో తలపడ్డారు. భీకర యుద్ధం మొదలై బ్రిటీష్ సైన్యం పరాజయం పాలైంది. అంతే కాదు బ్రిటీషు అధికారి జాన్ ఠాక్రే ఈ యుద్దం లో మరణించాడు.
ఇది బ్రిటీషర్లకు చెంప దెబ్బగా తగిలింది. ఈ ఓటమితో బ్రిటీష్ వారిలో భయం మొదలైంది. చెన్నమ్మ స్ఫూర్తితో మిగిలిన రాజ్యాల రాజులు పోరు చేస్తారన్న భయం వారిలో పెరిగింది. మరో దాడి బలంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద సంఖ్యలో సైనిక బలగంతో చెన్నూర్ కోటను ముట్టడించి, కొంత మంది సైనికులను ప్రలోభాలకు గురి చేసి మోస పూరితం గా కోటను స్వాధీనం చేసుకున్నారు.
ఓడిపోయిన రాణి చెన్నమ్మ ను సామంత రాజు గా ఉండాలని బ్రిటిష్ అధికారులు కోరారు. కానీ స్వేచ్ఛగా బతుకుతాం లేదా మరణిస్తాం అంటూ చెన్నమ్మ స్పష్టం చేశారు. దాంతో ఆమె ను జైలులో బంధించి కోటను స్వాధీనం చేసుకున్నారు.
జైలు గోడ ల మధ్య మరణించిన రాణి చెన్నమ్మ ప్రజల హృదయాల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన చిరస్థాయిగా వారి గుండెల్లో నిలిచిపోయారు.
వంగ యశోద
This post was created with our nice and easy submission form. Create your post!