భారతమాత

By టిఎస్ సువిశాలి

ఆమె భరతమాత

ఆమె సువిశాల సుందరం ధరణి మాత

పత్రంగా నీడ ఇచ్చినా

పుష్పంగా వికసించినా

ఆమె సస్యశ్యామల సురభిళమే

సుజలాలు సుఫలాలు

ఆమె నేత్ర పర్వాలు

సమ భావం సమ న్యాయం రెండు చేతులు

ఆమె ధర్మ చక్రానికి ప్రతీక

మూడు రంగుల ముచ్చటతో

కోట్ల హృదయాల వెలుగైంది

ఆమె భరతమాత

సమస్త స్త్రీ జాతికి స్ఫూర్తి ప్రదాత

హృదయ స్వేచ్ఛ రెపరెపలకు

ఎర్రకోటై  నిలిచింది

ఆమె భరతమాత

మాతృభూమి స్వాతంత్ర్య పతాక

_డాక్టర్ కొండపల్లి నీహారిణి

This post was created with our nice and easy submission form. Create your post!

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తరుణి చిత్రం

సంఘసేవిక శ్రీమతి శ్రీలక్ష్మిరెడ్డిగారు!