యూరోప్ ట్రిప్ – 16 

తేది: 22-8-2024. కిందటి వారం తరువాయి భాగం… 

పారిస్ నేషనల్ అసెంబ్లీ, ల్యౌవ్ర్ మ్యూజియం, నోట్ర్ డామ్ 

ఉదయం మొదటగా నెపోలియన్ బొనపార్ట్ సైనికుల విజయ పరంపరలో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్చ్, ఆయన సమాధి గురించి తెలుసుకున్నాముబస్సు వెళుతుండగా ఒక పెద్ద బిల్డింగ్ కనబడింది. మన దగ్గర కోఠీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ విమన్స్ కాలేజ్ లాగా అనిపించింది. కాకపోతే దానికంటే రెండు మూడింతలు పెద్దది. పెద్ద పెద్ద పిల్లర్స్ తో కట్టబడిన భవనం. అది నేషనల్ అసెంబ్లీ భవనమట. భవనం ముంగిట్లో ఎత్తైన స్టాచూస్ ఉన్నాయి. ఈమధ్య జరిగిన ఒలింపిక్ క్రీడల కోసం మరి కొన్ని రంగు రంగుల విగ్రహాలను ఏర్పాటు చేసారు.  నడుస్తున్న బస్ లోంచి మేము ఫొటోలు తీసుకున్నాము. దానిగురించి వైదేహి క్లుప్తంగా చెప్పింది. 

ఈ భవనం ఫ్రాన్స్‌ పారిస్‌ లోని పలైస్ బోర్బన్’. ప్రస్తుతం ఇది ఫ్రెంచ్ పార్లమెంట్ దిగువ సభ అయిన అసెంబ్లీ నేషనల్ (నేషనల్ అసెంబ్లీ). పలైస్ బోర్బన్ అనే నేషనల్ అసెంబ్లీ నిర్మాణం 1722-1728 ల మధ్య జరిగిందట. పలైస్ బోర్బన్ బిల్డింగ్ మొదట కింగ్ లూయిస్ XIV, మేడమ్ డి మోంటెస్పాన్ ల కుమార్తె లూయిస్ ఫ్రాంకోయిస్ డి బోర్బన్కోసం ఒక ప్రైవేట్ నివాసంగా నిర్మించబడింది. అందుకే ఆ పేరు ఉన్నట్టుంది. ఈ డిజైన్ ఇటాలియన్ వాస్తుశిల్పాలతో ప్రభావితమైంది. గియార్డిని, లాస్సూరెన్స్, గాబ్రియేల్ వంటి వాస్తుశిల్పుల సహకారంతో ఇది నిర్మించబడినదట. 1760లు-1790లు దశాబ్దాలలో ఈ భవనాన్ని ఎక్కువ స్థలంలోకి విస్తరించి ఎంతగానో మార్పులు చేసారట. ఫ్రెంచ్ విప్లవం (1789) తర్వాత, ప్యాలెస్‌ను రాష్ట్రం జప్తు చేసి 1798లో, జాతీయ అసెంబ్లీ స్థానంగా నియమించబడింది. 

1806-1810 లలో నెపోలియన్ బోనపార్ట్ పాలనలో, ప్యాలెస్ దాని ప్రసిద్ధ నియోక్లాసికల్ పోర్టికోను కొరింథియన్ స్తంభాలతో చేర్చడానికి పునఃరూపకల్పన చేసారు. దీనిని ఆర్కిటెక్ట్ బెర్నార్డ్ పోయెట్ సీన్ అంతటా ఉన్న మాడెలైన్ చర్చికి సరిపోయేలా సృష్టించి మనకు ఇప్పుడు కనబడే భవనానికి దాని స్మారక, అధికారిక రూపాన్ని కల్పించారు. 19వ, 20వ శతాబ్దాలలో శాసనసభ అవసరాలను తీర్చడానికి వివిధ విస్తరణలు కొనసాగాయి, వీటిలో చట్టసభ సభ్యులకు అదనపు కార్యాలయాలు గదులు ఉన్నాయి. 

నేడు, పలైస్ బోర్బన్ ఫ్రాన్స్ శాసన శక్తికి కేంద్రంగా ఉంది. దేశాన్ని పరిపాలించే, చట్టాలను ఆమోదించే 577 మంది డిప్యూటీలు ఉన్నారు. ఇది ఫ్రెంచ్ ప్రజాస్వామ్యానికి రాజకీయ చరిత్రకు చిహ్నంగా వెలుగొందుతుంది. 

అక్కడనుంచి లౌవ్ర్ మ్యూజియమ్ వద్ద స్లోగా బస్సును నడుపుతూ దాని గురించి ఫ్రెంచ్ గైడ్ ఆ తరువాత వైదేహి వివరించారు. ఆ మ్యూజియమ్ లోకి వెళ్ళాలంటే టికెట్ ఉంటుంది. చాలా పెద్ద భవనం. అంతా చూడాలంటే చాలా సమయం పడుతుందట. లోనికి వెళ్ళటం లేదనే సరికి చాలా నిరుత్సాహ పడ్డాము. నాకు మోనాలిసా చిత్రాన్ని చూడాలని చాల ఆశ ఉండేది. 

పారిస్ లో 136 మ్యూజియమ్స్ ఉన్నాయి అందులో ఒకటి మొనాలిసా పెయింటింగ్ ఉన్న లూవ్ర్  మ్యూజియమ్. చాలా పెద్దది.1600 సెన్చురీస్ లో నిర్మించిన ఒక ప్యాలెస్ ని 1793 లో మ్యూజియమ్ చేసారట. ఇది ‘U’  షేప్ లో నిర్మించబడింది.  రోజల్లా తిరిగినా పూర్తికాదట.   

లూవ్ర్ ప్యారిస్ లో ఉన్న ఒక జాతీయ కళా మ్యూజియమ్. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ మ్యూజియంలలో ఒకటి. ఇది నగరం లోని 1 వ అరోండిస్ మెంట్లేదా వార్డు లోని సేన్ నది కుడి ఒడ్డున ఉంది.  మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్యిక్టరీతో సహా ప్రాశ్చాత్యకళల నిలయంగా ఉంది. దీనిని మొదట 12 నుండి 13వ శతాబ్దం చివర్లో ఫిలిప్ II మధ్యయుగపు లౌవ్రే కోట అవశేషాలు మ్యూజియం నేలమాళిగలో కనిపిస్తాయి. 1546 లో ఫ్రాన్సిస్ ఫ్రెంచ్ రాజుల ప్రాథమిక నివాసంగా మార్చాడు. ఈ భవనాన్ని అనేకసార్లు పునఃరూపకల్పన చేసి, ప్రస్తుత లౌవ్రే ప్యాలెస్‌గా రూపొందించారు. 1682లో,లూయిస్ XIV తన ఇంటి కోసం ప్యాలెస్ ను ఎంచుకున్నాడు. లౌవ్రే ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆ జాతీయ అసెంబ్లీ, దేశపు కళాఖండాలను ప్రదర్శించడానికి మ్యూజియంగా ఉపయోగించాలని నిర్ణయించింది. ఈ మ్యూజియం 1793 ఆగస్టు 10న 537 చిత్రాల ప్రదర్శనతో ప్రారంభించబడింది, వీటిలో ఎక్కువ భాగం రాజువి ఇంకా జప్తు చేయబడిన చర్చి ఆస్తికి సంభందించినవి ఉండేవి. దీనికి ముసీ నెపోలియన్ అనిపేరు మార్చారుమ్యూసీ డు లౌవ్రేలో దాదాపు 500,000 వస్తువులు ఉన్నాయి. ఎనిమిది క్యూరేటోరియల్ విభాగాలలో 35,000 కళాఖండాలు ప్రదర్శించబడతాయి. వీటిలో 60,600 మీ (652,000 చదరపు అడుగులు) కంటే ఎక్కువ శాశ్వత సేకరణకు అంకితం చేయబడ్డాయి. లౌవ్రే శిల్పాలు, ఆర్ట్ వస్తువులు, పెయింటింగ్‌లు, డ్రాయింగ్‌లు, పురావస్తు పరిశోధనలను ప్రదర్శిస్తుంది. ఏ సమయంలోనైనా, చరిత్ర పూర్వ నుండి 21వ శతాబ్దం వరకు సుమారు 38,000 వస్తువులు 72,735 మీ(782,910 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ప్రదర్శించబడుతున్నాయి, ఇదిప్రపంచం లోనే అతిపెద్ద మ్యూజియంగా నిలిచింది. 2024 సంవత్సరంలో 8.7 మిలియన్ల సందర్శకులు వచ్చారట. 2023 కంటే 2,00,000 మంది తక్కువట. ఆ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడిన మ్యూజియం గా చెబుతారు.  ఇక్కడ మొనాలిసా చిత్రంమొదటిసారిగా 1966లో ప్రదర్శించబడింది.   

మోనాలిసా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ చిత్రాలలో ఒకటి, దీనిని ఇటాలియన్ కళాకారుడు లియోనార్డో డా విన్సీ పునరుజ్జీవనోద్యమ కాలంలో 1503, 1519 మధ్య సృష్టించాడు. ఇది ఒక మహిళ చిత్రం, దీనిని ఫ్లోరెంటైన్ వ్యాపారి ఫ్రాన్సిస్కో డెల్ గియోకొండో భార్య లిసా గెరార్డిని దని విస్తృతంగా నమ్ముతారు. అందుకే పెయింటింగ్‌ను ఇటాలియన్‌లో లా గియోకొండ, ఫ్రెంచ్‌లో లా జోకొండే అని కూడా పిలుస్తారు. 

మోనాలిసా చిత్రం పోప్లర్ కలప ప్యానెల్‌పై నూనె లతోనూ, 77 సెం.మీ × 53 సెం.మీ (30 అంగుళాలు × 21 అంగుళాలు) కొలతలతో తయారు చేసినది. పునరుజ్జీవనం, స్ఫుమాటో (మృదువైన, మిశ్రమ అంచులు) వంటి పద్ధతులను ఉపయోగించడం దీని ప్రత్యేకత. 

దీనిలో చిత్రించిన పడతి ముఖంలో ఒక రహస్యమైన వ్యక్తీకరణ కనబడుతూ, స్వల్ప చిరునవ్వుతో, ముదురు రంగు దుస్తులు ధరించి, ఎక్కడో ప్రకృతి దృశ్యానికి వ్యతిరేకంగా కూర్చున్న స్త్రీ మూర్తిలా ఉంటుందట. ఆమె మిస్టీరియస్ ఎక్స్‌ప్రెషన్సూక్ష్మమైన చిరునవ్వు, వ్యక్తీకరణ దృక్కోణం, వినూత్న పద్ధతులో లియోనార్డో రంగులు, వాటిలో ఆయన చూపించిన షేడ్స్, సృష్టించిన బ్లెండింగ్ టెక్నిక్ అయిన స్ఫుమాటోను ఉపయోగించటం, చిత్రపు అసాధారణ కూర్పుసగం పొడవు గల పోర్ట్రెయిట్ సమయంలో ఒక నవల విధానం, ఈ ప్రత్యేకతల వల్ల ఆ కళాఖండానికి అంత ప్రాధాన్యత ఏర్పడిందని చెబుతారు. ఈ చిత్రానికి కొన్ని ప్రముఖమైన చారిత్రక సంఘటనలు కూడా తోడైనాయి. దీనిని 1911లో ఒక ఇటాలియన్ జాతీయవాది దొంగిలించి, ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. అంతేకాక డావిన్సీ నైపుణ్యం, శాస్త్రవేత్తగా, కళాకారుడిగా, లియోనార్డో వివరణాత్మక శరీర నిర్మాణ శాస్త్రం, గణిత నిష్పత్తులను ఉపయోగించి ఈచిత్రాన్నికి ప్రపంచ ప్రఖ్యాతి కలిగించాడు. మోనాలిసా లెక్కలేనన్ని కళాకారులకు స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా సందర్శించబడిన, గుర్తించబడిన చిత్రాలలో ఒకటి 

మరి నేను చిన్నప్పటినుంచి దీని గురించి వింటూ, ఎప్పటికైనా చూడగలనా అనే జిజ్ఞాసతో ఉన్న నాకు ఆ మ్యూజియం ముంగిట్లోనే, బస్సులో నుండే ఫొటోలు తీసుకోవటం నావరకు నాకు చాలా బాధాకరమైన విషయం. కనీసం ఆ చిత్రమున్న భవనపు నేలనైనా తాకలేక పోయాను.  మళ్ళీ రాగలననే ఆశ లేదు కదా. ఇంత గొప్ప చిత్రమున్న ఆ మ్యూజియాన్ని, ఆ చిత్రాన్ని చూడలేక పోవటం అనేది నాకు ఎంతో కష్టంగా అనిపించింది. ఆ భవనాన్ని కనులనిండా నింపుకుంటూ, మోనాలిసా ప్రతిరూపాన్ని తలుచుకుంటూ బరువైన గుండెతో అక్కడ్నుంచి బయలు దేరాము. నాలాగా ఒకరిద్దరు కూడా నిరాశ పడ్డారు. 

దారిలో ఒక కూలిన భవనం లాంటిది కనబడింది. దాని గురించి వైదేహి మాకు వివరించింది. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గోతిక్ కేథడ్రల్‌లలో ఒకటైనదే ఈ నోట్రేడామ్ డి పారిస్ భవనమట. కేథడ్రల్ మధ్య పారిస్‌లోని సేన్ నదిలోని ఐల్ డి లా సిటే ద్వీపంలో ఉంది. నోట్రేడామ్ కేథడ్రల్రెండు ప్రసిద్ధ బెల్ టవర్లు కనిపిస్తాయి. కేథడ్రల్ అత్యంత ప్రసిద్ధ స్టెయిన్డ్గ్లాస్ కిటికీలలో ఒకటైన మధ్యలో ఉన్న గులాబీ కిటికీ ఉంటుంది. స్కాఫోల్డింగ్, కుడి వైపున నిర్మాణ క్రేన్‌తో నిర్మాణం ఇప్పటికీ పునరుద్ధరణలో ఉంది. ఏప్రిల్ 15, 2019 జరిగిన అగ్నిప్రమాదం తర్వాత పైకప్పు, శిఖరానికి తీవ్ర నష్టం వాటిల్లిన తర్వాత కేథడ్రల్‌ను పునర్నిస్తున్నారు. సీన్ నది గట్టు క్వాయ్ డి మోంటెబెల్లో ఇది కనబడింది.   

నోట్రేడామ్ అనేది మధ్యయుగ వాస్తుశిల్ప కళాఖండం, ఇది 12, 14 శతాబ్దాల మధ్య నిర్మించబడింది. పట్టాభిషేకాలు, రాజ వేడుకలు, సాహిత్య ప్రేరణ (విక్టర్ హ్యూగో, ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రేడామ్) వంటి అనేక చారిత్రక సంఘటనలకు ఇది సాక్షిగా ఉంది. పునరుద్ధరణ 2024 నాటికి పారిస్ ఒలింపిక్స్ సమయానికి కేథడ్రల్‌ను ప్రజలకు తిరిగి తెరవాలని లక్ష్యంగా పెట్టుకుందిట. కాని మాకు శిథిల దశ లోనే కనబడింది. 

నోట్రేడామ్ డి పారిస్ (“అవర్ లేడీ ఆఫ్ పారిస్అని అర్థం) ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ గోతిక్ కేథడ్రల్‌లలో ఒకటి. ఇది 1163 – 1345 మధ్య నిర్మించబడింది, ఇది 850 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఐల్ డి లా సిటీలో ఉన్న ఈ కట్టడం శతాబ్దాలుగా పారిసియన్, ఫ్రెంచ్ చరిత్రకు కేంద్రంగా ఉంది. మనకు భవనం లాగా ఏమి కనిపించదు. ట్విన్ టవర్స్ (వెస్ట్ ఫేసేడ్) –రెండు పెద్ద బెల్ టవర్లు కేథడ్రల్ అత్యంత గుర్తించదగిన భాగాలలో ఒకటి. టవర్లు నోట్రేడామ్ ప్రసిద్ధ గంటలు ఉన్నాయి, వీటిలో 13 టన్నుల కంటే ఎక్కువ బరువున్న అతిపెద్ద గంట అయిన ఇమ్మాన్యుయేల్ కూడా ఉందట. సందర్శకులు 387 మెట్లను ఎక్కి పైకి వెళ్ళి పారిస్ సిటీని చూడవచ్చు. కాని మాకు బస్ లోంచే ఆ శిథిలమైన శకలాలు కనపడ్డాయి. రోజ్ విండో (సెంట్రల్ ఫేసేడ్) – భారీ స్టెయిన్డ్గ్లాస్ విండో నోట్రేడామ్‌లోని మూడింటిలో ఒకటి. ఇది 13 శతాబ్దానికి చెందినది. సంక్లిష్టమైన బైబిల్ దృశ్యాలను ఉన్నాయట. మూడు ప్రధాన పోర్టల్స్ (దిగువ విభాగం, పశ్చిమ ముఖభాగం, పాక్షికంగా కనిపిస్తుంది) – గోతిక్ ప్రవేశ ద్వారాలు బైబిల్ దృశ్యాలు సాధువులను వర్ణించే శిల్పాలతో అలంకరించబడ్డాయిఏప్రిల్ 15, 2019 జరిగిన అగ్నిప్రమాదంలో కేథడ్రల్ విస్తృతంగా దెబ్బతింది. 

నోట్రేడామ్ వద్ద కొన్ని ముఖ్య మైన చారిత్రక సంఘటనలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఇంగ్లాండ్‌కు చెందిన హెన్రీ VI పట్టాభిషేకం (1431) – వందేళ్ల యుద్ధంలో, నోట్రేడామ్ లోపల హెన్రీ VI ఫ్రాన్స్ రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. నెపోలియన్ పట్టాభిషేకం (1804) – నెపోలియన్ బోనపార్టే కేథడ్రల్‌లో జరిగిన ఒక గొప్ప వేడుకలో తనను తాను చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకున్నాడు. విక్టర్ హ్యూగో ప్రభావం (1831) – ఆయన రాసిన నవల ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రేడామ్ అప్పట్లో నిర్లక్ష్యం చేయబడిన కేథడ్రల్‌ను పునరుద్ధరించే ప్రయత్నాలను ప్రేరేపించింది. రెండవ ప్రపంచ యుద్ధం (1944) – నాజీ ఆక్రమణ నుండి పారిస్ విముక్తి పొందినందుకు వేడుకగా కేథడ్రల్ గంటలు మోగాయి. కేథడ్రల్ పునరుద్ధరణ సాంప్రదాయ మధ్యయుగ పద్ధతులను ఉపయోగించి శిఖరం, పైకప్పు, పైన నిర్మాణాన్ని పునర్నిర్మించడంపై దృష్టి పెట్టింది. అగ్నిప్రమాదంలో కోల్పోయిన దాని స్థానంలో కొత్త చెక్క చట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

మా బస్సు ప్రయాణం తిరిగి మొదలైంది. దారిలోని ఒక కూడలి చూపిస్తూ అక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ సమయంలో జరిగిన సంఘటనలగురించి చెప్పారు. దాన్ని కాంకోర్డ్ స్కైర్ అంటారట. పారిస్‌లోని 7 అరోండిస్మెంట్‌లో, ప్లేస్ డి లా దగ్గర ఉంది. ప్లేస్ డి లా కాంకోర్డ్  ముఖ్య ప్రదేశాలలో ఒకటైన లక్సోర్ ఒబెలిస్క్ మధ్యలో స్పష్టంగా కనిపిస్తుంది. లక్సోర్ ఒబెలిస్క్ (కేంద్ర నేపథ్యం) 1831లో ముహమ్మద్ అలీ పాషా ఫ్రాన్స్‌కు బహుమతిగా ఇచ్చిన 3,300 సంవత్సరాల పురాతన ఈజిప్షియన్ స్మారక చిహ్నం. 23 మీటర్లు (75 అడుగులు) ఎత్తులో ఉంది. మొదట ఈజిప్టులోని లక్సోర్ ఆలయ ప్రవేశ ద్వారంగా గుర్తించబడింది. పెద్ద వేదిక లైట్లు నిర్మాణాలు ఏర్పాటు చేయబడ్డాయి, తాత్కాలిక గోడపై ఊదా, పసుపు రంగు గోడకు ఉన్న చిత్రం కనిపిస్తుంది, బహుశా పారిస్ 2024 ఒలింపిక్స్ లేదా సాంస్కృతిక కార్యక్రమానికి సంబంధించినది కావచ్చు. వీధి దీపాలు, క్లాసిక్ పారిసియన్ డిజైన్ వంతెనపై ఉన్న దీప స్తంభాలు పారిస్ విలక్షణమైన హౌస్మానియన్ నిర్మాణాన్ని ప్రతిబింబిస్తాయి. పాంట్ డి లా కాంకోర్డ్ ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ (పలైస్ బోర్బన్)ను ప్లేస్ డి లా కాంకోర్డ్‌తో కలుపుతుంది. 

ప్లేస్ డి లా కాంకోర్డ్ చారిత్రాత్మకంగా ముఖ్యమైనది, ఇందులో కింగ్ లూయిస్ XVI, మేరీ ఆంటోయినెట్ ఉన్నారు. ఇది చరిత్రలో గొప్ప ప్రదేశంగా చెబుతారు. 18 శతాబ్దంలో స్థాపించబడిన ప్లేస్ డి లా కాంకోర్డ్ పారిస్‌లోని అత్యంత ప్రముఖ ప్రజా చతురస్రాల్లో ఒకటి. అప్పటి పాలించిన చక్రవర్తి గౌరవార్థం దీనిని మొదట ప్లేస్ లూయిస్ XV అని పిలిచారు. చతురస్రం రూపకల్పనలో శాస్త్రీయ నిర్మాణ శైలి ఉంది. విగ్రహాలు, ఫౌంటైన్‌లతో అలంకరించబడింది. ఫ్రెంచ్ విప్లవం సమయంలో, చతురస్రాన్ని ప్లేస్ డి లా రివల్యూషన్ అని పేరు మార్చారు. కింగ్ లూయిస్ XVI, క్వీన్ మేరీ ఆంటోయినెట్ వంటి గిలెటిన్ ద్వారా అనేక బహిరంగ ఉరిశిక్షలకు వేదికగా మారింది. విప్లవం తరువాత, జాతీయ సయోధ్యకు చిహ్నంగా దీనికి ప్లేస్ డి లా కాంకోర్డ్ అని పేరు మార్చారు. 

పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల సమయంలో, ప్లేస్ డి లా కాంకోర్డ్ ఒక డైనమిక్ అర్బన్ స్పోర్ట్స్ పార్క్‌గా రూపాంతరం చెందింది. స్క్వేర్ స్కేట్‌బోర్డింగ్, BMX ఫ్రీస్టైల్, బ్రేక్‌డ్యాన్సింగ్, 3×3 బాస్కెట్‌బాల్ వంటి కార్యక్రమాలకు ఆతిథ్యం ఇచ్చింది. ఈచారిత్రాత్మక మైలురాళ్లను సమకాలీన క్రీడలతో అనుసంధానించడానికి నగరం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్లేస్ డి లా కాంకోర్డ్‌ను ఒలింపిక్ వేదికగా ఉపయోగించడం వల్ల పారిస్ తన గొప్ప చారిత్రక వారసత్వాన్ని ఆధునిక అథ్లెటిక్ ఈవెంట్‌లతో మిళితం చేయగల సామర్థ్యాన్ని హైలైట్ చేసింది, అథ్లెట్లు, ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించింది. ఒలింపిక్స్ సమయంలో దాని ఆధునిక ఉపయోగంతో కూడలి చారిత్రక ప్రాముఖ్యతను కలిపి ఉంచడం, భవిష్యత్తును స్వీకరించేటప్పుడు దాని గతాన్ని గౌరవించడంలో పారిస్ అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. 

ఆ కాంకర్డ్ స్కైర్ నుంచి మరో చారిత్రక ప్రదేశమైన నెపోలియన్ 1 విజయాలకు చిహ్నంగా వెలసిన వెండోమ్ కాలమ్ దగ్గరికి బయలు దేరాము. దాని విశేషాలను మరో వారం తెలుసుకుందాం. 

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తిక్క శంకరయ్య

కళల కాణాచి ఓరుగల్లు