భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణము

భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. భారత రాజ్యాంగ పరిషత్ 1946లో ఎన్నికల తర్వాత ఏర్పడింది. ఎన్నికలలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ పాలిత రాష్ట్రాల నుంచి 290 మంది సభ్యులు ఎన్నికగా స్వదేశీ సంస్థనాల నుంచి 70 మంది సభ్యులు నియమించబడ్డారు. కాంగ్రెస్ నుండి 202 స్థానాలు ముస్లిం లీగ్ 73 స్థానాలు మిగిలినవి ఇతరులు గెలుచుకున్నారు.
భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశము 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ పరిషత్ 12 ఉపసంఘాలుగా పనిచేయటం ప్రారంభించింది. రాజ్యాంగ రచించడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీ (ముసాయిదా కమిటీ) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు సభ్యులు.
1). డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (అధ్యక్షుడు)
2. సర్ అల్లాది కృష్ణ స్వామి అయ్యర్
3. ఎస్ గోపాలస్వామి అయ్యార్
4. సయ్యద్ అహ్మద్ సాదుల్లా
5. డాక్టర్ కే ఎం మున్షి
6. బి ఎల్ మిత్తల్(కొద్దికాలం తర్వాత వారి స్థానంలో శ్రీ మాధవరావుని నియమించారు)
7. డిపి ఖైతాన్ (1948లో మరణాంతరము టీటీ కృష్ణమాచారి ని నిర్మించారు
డిసెంబర్ 9 1946 నుండి 26 1949 మధ్య రాజ్యాంగ పరిషత్ 11 సార్లు సమావేశమై రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల వ్యవధిలో రాజ్యాంగ రచన పూర్తి చేశారు.
1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
రాజ్యాంగ ఆరంభంలో 395 ప్రకారం 22 భాగాలు 8 షెడ్యూలు గా నిర్మించబడింది. ప్రస్తుత రాజ్యాంగంలో సుమారు 465 ప్రకరణలు 25 భాగాలు 12 షెడ్యూలు ఉన్నాయి.
అంబేద్కర్ మరియు సభ్యులు అనేక దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశ భౌగోళిక సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా మన రాజ్యాంగ రచించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ ప్రాముఖ్యత

ఒడిపిళ్ళు