దాహం వేసినప్పుడు బావి తొవ్వుకోవడం లా ఉన్నది అని ఓ మాట చురకలా వేస్తుంటారు బద్ధకస్తులను నిర్లక్ష్యంగా ఉండే వాళ్లను చూసి. ఈ దాహం ఏంటి? ఈ బావి తవ్వుకోవడం ఏమిటి? ఒకసారి లోతుగా పరిశీలిస్తే ‘భావి’ అంతు తెలుస్తుంది, ‘లోతు’తెలుస్తుంది.
డబ్బు, సమయం, మాట ఈ మూడు తరిగిపోని మూట. సంపాదించడం ఒక ఎత్తు అయితే సంపాదించిన దాంట్లో ఖర్చులు పోగా… మిగిలించుకొని కొంత కూడా పెట్టుకోవడం ఒక అవసరం. చేయవలసిన పని చేయాల్సినవి చేయకుండా, ఇవ్వవలసినంత సమయం ఇవ్వకుండా ఉండకుండా తగిన సమయం లోపుననే చేయడం ఒక పాలన. . పెదవి దాటితే పృథ్వి దాటుతుంది అంటారు. నోరు జారిన తర్వాత వెనక్కు తీసుకోవడానికి నానా ప్రయత్నాలు చేసే కన్నా,ఎక్కడ ఏది మాట్లాడాలో అక్కడ అంతే మాట్లాడి పరువు మర్యాదలను దక్కించుకోవడం తీరైన బ్రతుకు. ఈ మూడు ఇంత ప్రాధాన్యత కలిగినవి.
People respect the money not the person అని అన్యాయమైన రోజులు వచ్చాయి.
వేకువ పంచే వెలుగులా.. బాటను చూపే సహనంలా .. ఆశల కోసం ఆరాటంలా కొన్ని మన వెంట బ్రతికున్నంత కాలం అలా రావాలి .
సమయం ఎవ్వరి కోసం ఆగదు, వేచి ఉండదు. భూత వర్తమాన భవిష్యత్ కాలాలన్నింటిలోనూ నిజం అనేది చాలా ప్రత్యేకమైంది. కావలసిన మనుషులు దూరమైనప్పుడు గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు అని సరిదిద్దుకోవడం ఒక జీవిత పాఠం ఈ నాన్ స్పేషియల్ కంటిన్యూయస్ లైఫ్ లో రేపటి కొరకు అనుక్షణం తపించే వ్యక్తులు చేయవలసింది · ఈ త్రిదళాలు ఏవైతే ఉన్నాయో డబ్బు సమయం మాట… వీటిని అదుపులో పెట్టుకుంటే ఒక సస్యశ్యామల సుందర వనం లా జీవితం పరిమళభరితమవుతుంది. మనుషుల స్పృహలో క్రమంగా సమయానికి ప్రాముఖ్యత ఉద్భవించినప్పటి నుంచి ఆ భావనను మిగతా విషయాలకు అన్వయించుకుంటూ పరిశీలించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇది సహజ దృగ్విషయంగా ప్రాచీన నాగరికతల నుండి ఇప్పటివరకు ఆధునిక కాలం వరకు ప్రత్యేకతను సాధించుకున్నది. ఈ సమయము క్యాలెండర్ల లో దొరకదు , పనిచేసే నియమాలలో దొరుకుతుంది, చేతనలో దొరుకుతుంది.ఈ డబ్బు ఆలోచనలలో దొరకదు శ్రమలో దొరుకుతుంది , పొదుపులో దొరుకుతుంది. ఈ మాట పుస్తకాలలో దొరకదు మనుషుల మనసులలో దొరుకుతుంది,బుద్ధిలో దొరుకుతుంది.
అందుకే మాట మర్యాద ఉండాలి. ఇదే కాల మహిమ లో ఉండే నీతి.
ఇల్లు ఇల్లాలు భర్త బంధం ఎందుకో తెలియకుండానే జీవిస్తున్నదా ఈ లోకం!
ఇప్పుడు అర్థం అవుతోంది కావచ్చు.
చక్కని నడవడి ఉండాలి, మంచి చదువులు చదాలి, భయ భక్తులతో పేరును సంపాదించుకోవాలి.
ఇవన్నీ చూస్తున్న నీ వాళ్ళ ఇంటికి కీర్తి ప్రతిష్టలు నువ్వే తేవాలి.
It’s not how Big the House is It’s how Happy the Home is అనేది చూడాలి . ఇది , ఈ భావం పైన చెప్పిన పంక్తులకు అద్దం పడుతుంది. ఇవేవీ అప్పటికప్పుడు వచ్చేవి కావు. బావి తొవ్విపెట్టుకోవాలి . ఈ బావి బుద్ధి కి ప్రతిరూపం. ఇదే కాలం చెప్పే నిజం.
డాక్టర్ కొండపల్లి నీహారిణి, సంపాదకులు