ఎడారి కొలను 

ధారావాహికం -48

(ఇప్పటివరకు:  అపూర్వ, భవ్య వాళ్ళ మధ్యన ఉన్న బంధాన్ని ఒప్పుకుంటారు. ప్రసాద్ ని తమకి హెల్ప్ చేయమని అడుగుతారు. ఆ బాధనుండి బయట పడే మార్గంలో ప్రసాద్ కొత్త జాబ్ వెతుకొన్ని ఆంధ్ర కోస్తాడు. కొంత కాలమయినా అజ్ఞాతం లో గడపాలని తెనాలికి చేరుకుంటాడు. అలా పాత జ్ఞాపకాలనుండి వాస్తవంలోకి వస్తాడు అతను అక్కమ్మ పిలుపుతో.  పెద్దక్కకు బాగా లేదని చెప్పడంతో కాంతమ్మ గారితో కలిసి ప్రసాద్ , మైత్రేయి వెళతారు ఆమెని చూడటానికి. ఆ రోజు రాత్రే పెద్దక్క చనిపోతుంది.)

శనివారం నాడు రామాలయం లో అన్నసంతర్పణ ,  శ్రద్ధాంజలి  కార్యక్రమం ఏర్పాటు చేయబ డింది. ఆ కార్యక్రమానికి డాక్టర్ కాత్యాయని, కలెక్టర్ కౌశికి,  ఎం ఎల్ ఏ గిరిజక్క, నాగార్జున యూనివర్సిటీ విమన్స్ స్టడీస్ చైర్ పర్సన్  డాక్టర్ కావేరి  లాంటి కొందరు పట్టణ  ప్రముఖులు హాజరయ్యారు. వసుంధర వెంకటేశ్వర రావు గారు, కాంతమ్మ గారు, ప్రభాకర్, మైత్రేయి , ప్రసాద్ అందరు పెద్దక్కకి నివాళులర్పించారు. ఆ రోజు చేయూత ఆశ్రమం లో తయారు చేసిన వంటకాలే   అక్కడ వితరణ చేయబడ్డాయి.  

     సభలో మాట్లాడుతూ ,” పెద్దక్క పేరున ఒక ఫండ్ ఏర్పాటు చేయ బడుతుంది. ఆమె ఆశయాల కనుగుణంగా , ఈ ఆశ్రమానికి చేరే యువతులకు తగిన వృత్తి శిక్షణ ఇవ్వ బడుతుంది.  వాళ్ళు కోరుకుంటే వారికీ రెగ్యులర్ లేదా కరెస్పాండెంట్ కోర్సెస్ లో చదువుకునే అవకాశం కూడా కల్పించాపడుతుంది. దానికయ్యే ఖర్చు మొత్తం పెద్దక్క ఫండ్ ద్వారే సమకూర్చపడుతుంది. అందు కు కావాల్సిన విరాళాలను పట్టణ ప్రముఖులే అందించాలి. ముందుగా మా తరఫున లక్ష రూపాయలు ప్రకటిస్తున్నాను ,” అంటూ వసుంధర తన ఉపన్యాసం ముగించింది. ఆమె అలా చెప్పగానే అక్కడే హాజరయిన సత్తెనపల్లి గ్రామీణ బ్యాంకు మేనేజర్ 10,000 /- ప్రకటించాడు. అంతే కాదు పెద్దక్క ఫండ్ కి  బ్యాంకు ద్వారా ట్రస్ట్ ఏర్పాటు కూడా చేసి , ఒక అకౌంట్ ని ఓపెన్ చేయించాడు, దానికి శాంక్షనింగ్  అధికారిగా జిల్లా కలెక్టర్ , లాయర్ వసుంధరలను నామినేట్ చేసింది కాంతమ్మ. అందరు యునానిమస్ గ అంగీకరించారు. 

    అన్న సంతర్పణ ముగింపు కల్ల  పెద్దక్క ఫండ్ కి మంచి సంఖ్యలో  విరాళాలు  వచ్చాయి. డాక్టర్ కావేరి తమ డిపార్ట్మెంట్ తరఫున  కౌన్సెలింగ్  సెల్ ని కూడా ఏర్పాటు చేసింది. అతి ప్రమాద కరమయిన పరిస్థితుల నుండి బయట పడిన మహిళల కి ట్రమాటిక్ అట్టాక్స్ ఉంటాయని. కొంతకాలం వారితో  ఆప్యాయంగా మాట్లాడుతూ వారి మానసిక స్థితి సరి చేస్తూ వారికీ జీవితం మీద ఆశ కల్పించాలన్నదే  ఈ సెల్ యొక్క ఉద్దేశ్యమని చెప్పింది.”

 అలా పెద్దక్క నివాళి సభ ముగిసిన తరువాత అందరు తెనాలి చేరారు. మైత్రేయి చెప్పింది, ”తన కేసు వాయిదా  జులై 15 కి వచ్చిందని.” 

“ ధైర్యం గ ఉండు. నీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది మైత్రేయి,” అంటూ కాంతమ్మ గారు చేతిలో చేయి వేశారు మైత్రేయికి. ప్రభాకర్ మైత్రేయి తలనిమిరాడు. 

**************************

వసుంధర రాజ్య లక్ష్మి ని , సుమంత్ ని పిలిచి మైత్రేయి ఫైల్ ని క్షుణ్ణం గా పరిశీలించమంటుంది. ఎక్కడయినా ఆ ఫైల్ లోఏ  చిన్న క్లూ ఉన్న, అతన్ని మనమింకా బాగాఇరికించి తప్పించుకోకుండా చేయొచ్చు. 

“ మేడం, మీకు కొన్ని విషయాలు చెప్పలేదు కానీ, మీరు లేనప్పుడు మైత్రేయి ని బాగా ఇబ్బంది పెట్టాడు. ఆమెని పోలీస్ స్టేషన్  చుట్టూ తిప్పాడు.,” అన్నది రాజ్య లక్ష్మి.

“అవును మేడం, కానీ ప్రసాద్ చాలా తెలివిగా ప్లాన్ చేసి సుబ్బారావు అలా చేయించడానికి తన ఉద్దేశ్యమేమిటో చెబుతుండగా వీడియో తీయించాడు. అతను చాలా దుర్మార్గుడు మేడం,” అంటూ ప్రసాద్ సుమంత్ కి షేర్ చేసిన వీడియో ని వసుంధర కి చూపించాడు.

     “అంతే కాదు మేడం, అతను బ్యాంకు లో లోన్స్ ఇప్పించడం లో చాలా ఫ్రాడ్ చేసాడని, చిన్న వ్యాపారులందరికి లోన్ ఇప్పిస్తానని అందుకు, ఆ లోన్ అమౌంట్ లో 2% తనకు ఇచ్చు కోవాలని, డిమాండ్ చేసే వాడట మేడం, అంతేకాకుండా  చాలా బ్యాంకు ఫైల్స్ ని కొందరు డబ్బున్న కస్టమర్స్ కి ఫెవర్ గా మార్చేసి లోన్ రికవరీ పీరియడ్ పెంచాడట, ఇలా అతను చాలా ఆగడాలు చేస్తూన్నాడు. ఇప్పుడు అతనికి మైత్రేయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ద్వారా, తన  విషయాలన్నీ బయట పడతాయేమో నని భయ పడుతున్నాడు. అందుకే మీ దగ్గరి క్కూడా వచ్చి రాజి చేయమని చెప్పాడు. ఈ  విషయాలన్నీ ప్రభాకర్ గారు కూపీ లాగి ఒక కేస్ స్టడీ తయారు చేసి ఉంచారు మేడం, అతను  కనుక ఇంకేదయినా దారుణానికి పాల్పడితే మాత్రం ఉపేక్షించనని నాతోటి, ప్రసాద్ తో టి అన్నాడు. ప్రసాద్ ని కూడా చాలా అవమానిస్తున్నాడు. కోర్ట్ లో కేసు నడుస్తున్నప్పుడు తానూ ఇంకే విధంగానయినా రియాక్ట్ అయితే అది మైత్రేయి ని బలహీన పరుస్తుందని , ప్రసాద్ మౌనం గా భరిస్తున్నాడు అంటూ,” వసుంధరకి చెప్పాడు.

“అయితే విను సుమంత్,  ప్రభాకర్ గారి దగ్గరున్న ఫైల్, నీ దగ్గరున్న వీడియో ని కల్లక్ట్ చేసి నా అఫీషియల్  డ్రైవ్ లో సేవ్ చేసి ఉంచు. చూస్తాను వాడేలా తప్పించు కుంటాడో,” అంది వసుంధర ఆలోచిస్తూ. 

“రాజ్య లక్ష్మి మైత్రేయి కి ఫోన్ చేసి రమ్మను,” అంది.

రాజ్య లక్ష్మి మైత్రేయి కి ఫోన్ చేసి ఈవెనింగ్ మేడం గారు తనని కలవమన్నారని చెప్పింది.

      మైత్రేయి ఆరోజు సాయంత్రం ప్రసాద్ తో కలిసి వసుంధర ఇంటికి వచ్చింది. కేసు వివరాలన్నీ వివరించిన తరువాత , వసుంధర చెప్పింది,” మైత్రేయి, డిఫెన్స్ లాయర్ అనొచ్చు సుబ్బారావ్ చేసినది  పెద్ద తప్పిదం కాదని, అందుకని అతను నీకు క్షమాపణలు చెప్పాడని. కానీ నువ్వే కావాలని అతని మీద కేసు పెట్టావని, కారణం అతన్ని నువ్వు వదిలించుకోవాలని అనుకుంటున్నావని  వాదించవచ్చు. అలాటి అభియోగాలపై నువ్వు ధైర్యంగా సరయిన సమాధానం చెప్పగలగాలి. భయ పడకూడదు. మౌనం గా ఉండకూడదు. నువ్వు కూడా లాజికల్ గా ఆలోచించాలి,”  అంటూ కౌన్సెలింగ్ చేసింది. 

                                          ***************************************  

రెండు రోజుల్లో, కోర్ట్ కి హాజరు కావాల్సి ఉంది. కాలేజ్ అయిపోగానే , మైత్రేయి ఆటో ఎక్కి  ఇంటికి బయలు దేరింది. కొంతదూరం పోయాకా రాష్ గా బైక్ మీదున్న వ్యక్తి ఆటో ని గుద్దేసి, ఆ స్పీడులో బైక్  మీద నుండి స్లిప్ అయి పడటంతో హెల్మెట్ కింద పడింది. అతని మొఖాన్ని ఆటో డ్రైవర్ చూసాడు. కానీ ఆటో ఆ గుద్దిన ఊపుకి బాలన్స్ తప్పి పక్కకి వొరిగి పడడం తో , ఆటో లో కూర్చొని ఉన్న మైత్రేయి రోడ్  మీదకు పడిపోయింది.  ఆటో ని బాలన్స్ చేస్తూ ఆ బైక్ వ్యక్తి ని పట్టుకోలేక పోయాడు ఆటో డ్రైవర్.  ఎంత వేగంగా  వచ్చాడో , అంతే వేగంగా ఆ వ్యక్తి బైక్ లేపుకుని ముందుకెళ్లి పోయాడు. ఆటో ని నిలబెట్టి వచ్చి మైత్రేయి ని లేపాడు. పెద్దగా దెబ్బలేమి తగలక పోయిన , మోచేతుల మీద , వీపు మీద చర్మం గీరుకుపోయింది. ఆమెని ఆటో లో కూర్చోబెట్టి, “మేడం మిమ్మల్ని ఆసుపత్రికి  తీసుకెళ్ళమంటారా,” అని అడిగాడు. 

 పర్లేదు నేను ఇంటికెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను, నువ్వు పోనీ” అని చెప్పింది.

       ఇంటికి చేరగానే వాకిట్లోనే అక్కమ్మ ఎదురొచ్చింది. మైత్రేయి వాలకం చూస్తూనే , “అయ్యో అమ్మ, అంతలా చీరుకుపోయిందేమిటి, ఎం జరిగింది,” అంది ఆదుర్దాగా.

“ఏంలేదు అక్కమ్మ, “ అంటూ తన పర్స్ అక్కమ్మ చేతి కిచ్చి “అతనికి డబ్బులి చ్చి రా,” అంటూ లోపలకి వెళ్ళిపోయింది. అక్కమ్మ ఆటో అబ్బాయి దగ్గరికెళ్లింది డబ్బులివ్వ డా నికి, “నువ్వా  వెంకీ, ఇయాలేటి జరిగింది, అమ్మగారికేమైంది ?” అదిగింది ఆదుర్దాగా .

“ అంటి , నువ్వీడ పనిచేస్తావా?” అంటూ ఆమెకి రో డ్ మీద బైక్ వ్యక్తి గుద్ది పోయిన వయనమంతా  చెప్పాడు.

   “ ఓలమ్మో ఎంత పెమాదం తప్పింది,” అనుకొంటూ అక్కమ్మ లోపలికోచ్చింది.

    అప్పటికే మైత్రేయి డ్రెస్ మార్చుకొని, “ అక్కమ్మ వేడినీళ్ళు  పెట్టాను తీసుకురా , అలాగే అల్మారాలో ఉన్న బ్యాండేజ్ బాక్స్ కూడా,” చెప్పింది. అక్కమ్మ అన్ని తెచ్చి అక్కడ బెట్టి, పొడి  టవల్ని వేడి  నీళ్లలో ముంచి, గట్టిగా పిండి , చీరుకు పోయిన చోటల్లా తుడిచింది. మైత్రేయి బాక్స్ లోంచి క్రీమ్ తీసి దెబ్బలమీద రాసుకొని బ్యాండేజ్ క్లాత్ ని కట్టింది. నుదుటి మీద కూడా దెబ్బ తగలటం తో అక్కడ కూడా బాగా కందింది. అక్కడ అక్కమ్మ వేడినీళ్లు కాపడం బెట్టి, ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకోవడానికి ఇచ్చింది.  

“అక్కమ్మ నేను పడుకుంటాను, నువ్వు సాయంత్రం దాకా ఉంటావు కదా ,” అడిగింది మైత్రేయి. 

“ అట్టాగే అమ్మ, నువ్వు ముందు పడుకో ,” అంటూ పక్క సరి చేసింది.

అలా సాయంత్రం  దాకా నిద్దర పోయింది మైత్రేయి. ప్రసాద్ అక్కమ్మ తో మాట్లాడుతున్నట్లనిపించి, కళ్ళు తెరిచి చూసింది, ఎదురుగా ప్రసాద్ కూర్చొని కనిపించాడు.

   “ అక్కమ్మ, కొంచం టీ  పెట్టు , నేను లేవలేక పోతున్నాను, వొళ్ళు నొప్పులుగా ఉన్నది,” అన్నది. అప్పటికే మైత్రేయి లేవడం కోసమే ఎదురుచూస్తున్న అక్కమ్మ , ముందుగానే టీ తయారుచేసి ఉంచడంతో అడగగానే వేడి చేసి తెచ్చి ఇచ్చింది ఇద్దరికీ. టీ తాగడం తో తేరుకున్న మైత్రేయి లేచి కూర్చుంది.

“ ఎలా జరిగింది? మీరా బైక్ నెంబర్ చూసారా? కనీసం ఆ వ్యక్తినయినా,” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రసాద్.   

“నాకేమి తెలియదండి. నేను రోడ్ కి అటు వైపు పడిపోయాను. బైక్ అతను  కూడా స్లిప్ అయ్యాడు రెండో వైపు , అందుకే నాకేమి కనిపించలేదు ,” అంది.

“ అలా జరిగిందా? మరయితే మీకు ఆటో అతను తెలుసా?” అడిగాడు.

“లేదండి, ఆటో ని నేను కాలేజ్ దగ్గరే ఎక్కాను గాని అతన్ని అంతగా గమనించలేదు,” అంది 

“బాబు, ఆ ఆటో కుర్రాడు నాకు తెలుసు, మా  వాడ లోనే ఉంటాడు,” అంది అక్కమ్మ. 

ప్రసాద్ కి క్లూ దొరికి నట్లయింది.  “మీరు రెస్ట్ తీసుకోండి , నేను డిన్నర్ హోటల్ నుండి తెస్తాను,” అంటూ బయటికెళుతూ, అక్కమ్మ అనిపిలిచాడు.  

  “ చూడు అక్కమ్మ , ఆ ఆటో కుర్రాడితో నేను మాట్లాడాలి రేపు పిలుచుకోస్తావా?” అడిగాడు ప్రసాద్. “ అట్టాగే బాబు, అదెంత పని, ఇప్పుడు మీరు నాకొక  సాయంసేయాలా,” అంది.

“ ఏంటో చెప్పు అక్కమ్మ,” అన్నాడు భరోసాగా. 

“ నన్ను మీ బైక్ మీద మా గుడిసెల కాడ  దింపాలా, నేను తోరగా , కూడొండి , నా మొగుడిగి పెట్టి మల్ల మైత్రేయమ్మ కాడికి వచ్చేస్తాను , బాగా దెబ్బలు తగిలాయిగదా ,” అన్నది. 

“ఓస్  దానికేం భాగ్యం అక్కమ్మ! రా బండెక్కు దిగబెడతాను, ఎప్పుడు రావాలో చెప్పు వచ్చి నిన్ను తీసుకొస్తాను. నేనెట్లాగు హోటల్ కె వెళుతున్నాను కదా, నీకు నీ ఇంటాయనకి అన్నం ప్యాక్ చేయిస్తాను పట్టుకుపో, మళ్ళి  వండనక్కర లేదు,పద” అన్నాడు. 

చక చక లోపలికెళ్ళి , “నువ్వు పడుకో అమ్మ, నేను ఇంటికెళ్లి బేగి వచ్చేస్తా,” అంటూ బయటికి వచ్చింది. ప్రసాద్ ముందుగా అక్కమ్మ కు అన్నం పాకెట్ దగ్గరిలో ఉన్న మీల్స్ మెస్ లో ఇప్పించి, ఆమెని వాళ్ళ గుడిసెల దగ్గర దింపాడు,నేనొక గంటలో వచ్చేస్తా నువ్వు ఇక్కడికే రా అక్కమ్మ,” అన్నాడు.

“ అట్టాగే న్నయ్య,” అంటూ అక్కమ్మ ముందుకి నడిచింది. 

ప్రసాద్ మంచి హోటల్ కెళ్ళి పూరి కుర్మా పాక్ చేయించుకొని తిరిగి అక్కమ్మ గుడిసెల దగ్గరి కొచ్చి నిలబడ్డాడు. కొద్దీ సేపటికల్లా అక్కమ్మ ఒక కుర్రాడితో అక్కడికి చేరింది. “ ప్రసాద్ బాబు ఈ డే, మన మైత్రేయమ్మ ఎక్కిన ఆటో కుర్రాడు,” అంటూ పరిచయం చేసింది. 

“ నువ్వేనా, నీ పేరేంటి,”  అన్నాడు. “ వెంకీ ,సార్” చెప్పాడు వినయం గా.

“ చూడు వెంకీ , పొద్దున్న బైక్ గుద్దింది కదా నీ ఆటో ని ఏమయినా డొక్కులు పడ్డాయా, లేక విరగాయ ? ఆ బైక్ వాడి నెంబర్ రాసుకున్నావా?” అడిగాడు. 

“ లేదు సార్, నేను వాడి బైక్ నెంబర్ చూడలేదు. ఇప్పుడయితే గుర్తు కూడా లేదు. కానీ వాడిని మాత్రం చూసాను. ఎందుకంటే బండి గుద్ద గానె, వాడు  కూడా బ్యాలెన్స్ తప్పి కింద పడటం తో , హెల్మెట్ కూడా పడిపోయింది, అప్పుడు అతని ముఖం చూసాను. బాగానే ఉన్నాడు. మంచి ఉద్యోగం చేస్తునాడల్లే ఉన్నది. కానీ ఎంత వేగం గా వచ్చి నా ఆటో ని గుద్దాడో , అంతే  వేగంగా, హెల్మెట్ కూడా సరిగా పెట్టుకోకుండా, బైక్ లేపుకుని వెళ్ళిపోయాడు దొంగనాయాలు,” అన్నాడు ఆవేశంగా. 

“అతన్ని చుస్తే గుర్తు పట్టగలవా?”  “ పక్కా సారూ! వాడు మల్ల కనపడాలా వాడి అంతు చూస్తాను. నా ఆటోకి సైడ్ గ్లాస్ ఇరిగిపోయింది. వాడి దగ్గర దాని ఖర్చు వసూలు చేయాల ఎలాగయినా,” అన్నాడు మరింత ఆవేశంగా. 

“ ఆవేశం ఉంటె సరిపోదు వెంకీ, అలా ఎప్పుడయినా యాక్సిడెంట్ జరిగితే , ఎవరు గుద్దారో అనేదానికి నీ దగ్గర ఆ బండి నెంబర్ ఉండాలి, నీ ఆటో ని చూపెట్టి, ఆ నంబర్ ఇస్తూ నువ్వు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యొచ్చు,” అన్నాడు ప్రసాద్.

“ సార్, మాకివి మాములే సార్, ఎక్కడోక్కడ ఇలాగె జరుగుతుంటుంది, కాస్త మంచోళ్ళు ఆగి, మాకేమయిన దెబ్బలు తగిలాయి అని అడిగి, కొంచం డబ్బులుకూడా ఇస్తారు రిపేర్ కోసం, కొందరెమొ  అంత మాదే తప్పు అన్నట్టు దబాయించి, మమ్మల్ని బెదిరిస్తారు, కొందరు చేయి కూడా చేసుకుంటారు. వీడొట్టి పిరికి నాయాలు, అందుకే మొహం చూపించకుండా పారిపోయాడు,” అన్నాడు వెంకీ.

అతని మాటలు వింటుంటే  “ఈ యాక్సిడెంట్ కావాలని చేయలేదు కదా? కేవలం మైత్రేయినే టార్గెట్ చేశారేమో?” అన్న బలమయిన అనుమానం ప్రసాద్ మనసులో మెదిలింది.   అక్కమ్మను ఎక్కించుకొని ఇల్లు చేరుకున్నాడు. మైత్రేయి టిఫిన్ పాకెట్ అక్కమ్మ చేతికిచ్చి తాను తన రూమ్ లోకి వెళ్లి పోయాడు. 


                                              **********************

    మర్నాడు సుమంత్ ని కలిసి జరిగినదంతా చెప్పాడు. వాళ్లిద్దరూ కలిసి మళ్ళి  అక్కమ్మ వాళ్ళ గూడెం వైవు కి వెళ్లి వెంకి ఎక్కడున్నాడో తెలుసుకొని, ఆ ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్లి అతన్ని కలిశారు.

“ వెంకీ, నువ్వి ఫోటో చూసి చెప్పు, నీ ఆటో ని గుద్దింది ఇతనో కాదో ,” అంటూ ఒక ఫోటో చూపించాడు తన మొబైల్ లో. 

“ సార్, వీడే ! పక్క ! వీడే!” అంటూ అరిచాడు వాడు ఉత్సాహంతో. 

    సుమంత్ కి ప్రసాద్ కి అర్ధమయిపోయింది ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో నని. నేరుగా ఎసై రమణ మూర్తి గారిని కలిసి ఆయనకి జరిగిన విషయం వివరించారు.

“మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ, ఆటో కుర్రాడు కానీ, ఆమె కానీ వచ్చి పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది అప్పుడే నేను అతని మీద కేసు ఫైల్ చేయగలుగుతాను,” అన్నాడు రమణ మూర్తి. 

“కానీ మీరిచ్చే ఇన్ఫర్మేషన్ లాయర్ వసుంధర మేడం కి ఉపయోగ పడవచ్చు,”  అంటూ సలహా చెప్పాడు. అలాగే అంటూ వాళ్లిద్దరూ అక్కడి నుండి వెళ్లి పోయారు. 

సుమంత్ నేరుగా ఆఫీస్ కెళ్ళి వసుంధరకి మైత్రేయి కి జరిగిన యాక్సిడెంట్ విషయం,                  

ఆ ఆటో కుర్రాడు ఫోటో ని గుర్తు పట్టడం అన్ని వివరం గా చెప్పాడు. వెంటనే వసుంధర  అంది,   “సుమంత్, ఇప్పటికిప్పుడు మనం ఇలాని  కోర్ట్ లో చెప్పలేను, కానీ ఆ కుర్రాడు ఆ రోజు కోర్ట్ కి వచ్చేట్లు చూడు, మిగిలింది నేను చూసుకుంటాను,” అన్నది.

 అందరు ఎదురు చూస్తున్న రోజు జులై 15 తారీకు వచ్చేసింది.

ఇంకా ఉంది

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అన్నమాచార్య కీర్తన

నిశ్శబ్ద ఝరి