దిగులు పడకు నేస్తమా…!!
కన్నీరు కార్చే కళ్ళు
హర్షించే కుసుమాలవుతాయి …
నిను చూసి అసూయపడే అక్షువులే
నీకై ఎదురుచూస్తాయి…
అమావాస్య అనంతరమే వెలుగుల పౌర్ణమి!!
ఏ నిమిషానికి ఆ నిమిషం
యమయాతనే ఈ జీవితం..!
లేని వాటికై నిరాశ చెందక…
ఉన్నాదానితొ తృప్తి పొందు..!
ఈ క్షణాన్ని…..
ఆనందించు..అనుభవించు..!!
కాంక్షించే కలల ప్రపంచం అతి చేరువలోనే ఉంది…
భూతల స్వర్గాన్ని సృష్టించే సామర్థ్యం నీకున్నది…
కడగండ్లను సవాళ్లుగా స్వీకరించు…
ఎదురైన ఆటంకాలను ఆయుధంగా మలుచు…
సుఖధుఃఖాలను సమానంగా ఆదరించు…
జీవితపు పేజీల్లో…..
కష్టం…సుఖం.. రెండూ కలిస్తేనే పరిపూర్ణం!!!