విజయానికి తొలిమెట్టు The path

30 – 11- 2024 తరుణి పత్రిక సంపాదకీయం

ఒకవైపు ప్రతిభ ఒకవైపు సృజనాత్మకత రంగరించుకొనే వాళ్ళు తప్పకుండా చరిత్రలో ఓ పేజీ ని రచించుకుంటారు.
కావలసింది కేవలం సాధన, అభ్యసనం. ప్రాక్టీస్ మేక్స్ పెర్ఫెక్ట్ .
మరేంచేయాలి పెర్ఫెక్ట్ గా ఉండాలంటే?
ముందు చూపు ఉండాలి.

Look forward to your journey……
ఈ జర్నీ ఈ జీవిత ప్రయాణం ఆగదు. ఆపాలని ఏవో ప్రయత్నాలు ఎవరైనా ప్రయత్నపూర్వకంగా చేస్తేనే అవుతుంది కాని జీవితం ఊరికే ఆగిపోదు. అందుకే నిర్ణయాధికారం నీదయ్యేదాకా నువ్వు తల్లిదండ్రుల మీద సమాజం మీద ఆధారపడ్తావు , అప్పుడే ….సరిగ్గా అప్పుడే … పెద్దలు చెప్పిన మాటలు వినాలి, మంచి మంచి పుస్తకాలు చదవాలి

Variety of things are surrounding you…. ఎన్నో ఆకర్షణలు ఎన్నో వికర్షణలు మనుషుల ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. What is wellbeing and what is important to you, and your life అనేది ఓ ప్రణాళిక ఉండాలి
ఎన్నో అజరామర చిత్రాలు అపురూప పాత్రలతో వెండితెర మీద తనదైన గొంతుకతో తనదైన స్థానంతో నిలిచి పోయాయి. వాటిలో చాలా వరకు నిజ జీవితంలోని వ్యక్తులవే.
సినిమా రంగం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.దేశం కోసం దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన యోధుల సినిమాలు చూసి వస్తారు మరచిపోతారు. అలా కాకుండా చూడగానే సరిపోదు.ఆ సినిమా లోని వీరుల గాథలను పుస్తకాలలోనో ఇంటర్నెట్ మాధ్యమాల్లో నో చదవాలి.చదవగానే సరిపోదు. ఒక నోట్ బుక్ లో నీదైన డైరీ లో కొన్ని పాయింట్ లను రాసిపెట్టుకోవాలి. ఈ పుస్తకం జీవిత మంతా తోడు ఉండేలా చూసుకోవాలి.
బడి చదువులు పూర్తి చేసి కళాశాలలో చేరేసరికి రెక్కలు వచ్చాయి అనుకుంటూ అతి స్వేచ్ఛ ను తీసుకుంటారు. నీ రెక్కల కు బలం ఎవ్వరు ఇచ్చారు? అమ్మ నాన్న కదూ! వీళ్ళ కుటుంబాలు కదూ! ఇవి మరచి పోయి జీవితం ఏదో సినిమా అన్నట్టు ఫీల్ అయితే ఎట్లా? నిజానికి నీ వాళ్ళందరికీ నువ్వు హీరోయిన్ గా కావాలి హీరో గా కావాలి. ఆ ప్రేమ ఆ స్నేహమూ ఆ అనుబంధాలు ఆప్యాయతలు కుటుంబం నుండి పొంది కుటుంబం నుంచి అనుభవించిన వాళ్ళకు పెళ్ళితో ముడిపడబోయే ప్రేమ కోసం ఓ తోడు కావాలి. అంతేకాని మిడిమిడి జ్ఞానంతో చదువు పూర్తి కాకముందే,అయ్యీ అవగానే ప్రేమ ప్రేమ అంటూ జీవితం ఒక పంజరం లో పడేసుకుంటున్నారు. డిగ్రీ దాటి పిజీ లో కి వచ్చాక ఎవరైనా నచ్చితే అమ్మాయి కి అబ్బాయి, అబ్బాయి కి అమ్మాయి నచ్చితే వాళ్ళ ను అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమకు వారధిగా ఇద్దరి కుటుంబాలు ఉండాలి. అప్పుడే పెళ్లి చేసుకోవడం అనేది. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కదా!
ఇవన్నీ ఏవీ సవ్యంగా లేకుండా తెలివికి పదును పెట్టుకోకుండా జీవితం లో ఏదైనా సాధించాలనే ఆలోచన లేకుండా ఉంటే ఎట్లా? సినిమా లకూ నిజం జీవితానికీ మధ్య ఉన్న సన్నని గీతను గుర్తెరగాలి.నీ పుస్తకం లో రాసుకున్న రాతలే నీవి అవుతాయి. నీవి చేసుకోవాలి.
ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా కళల్లో రాణించాలన్నా ముందు బేసిక్ జనరల్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ అనేది మరవద్దు.
Life is a weight paper whatever you write it will be shown. జీవిత వ్యాపారానికి
శ్రద్ధ నమ్మకం పెట్టుబడి. కాని జీవితమే వ్యాపారం చేయవద్దు . వ్యాపారమంటే పని. నిరంతరం ప్రక్రియ జీవితం. అందుకే సాధన అభ్యసనం తప్పనిసరి. ప్రతి అడుగు లో కొత్త విషయాన్ని నేర్చుకున్న వాళ్ళే సక్సెస్స్ దారిలో పయనిస్తారు.
ఇది గ్రహిస్తే నీలోని ప్రతిభకు నీలోని సృజనాత్మకతకూ నువ్వే వెలుగు దారివౌతావు.అది నీ విజయానికి తొలిమెట్టు .

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వర్ణ విన్యాసం

పాట