నేను డా.మరుదాడు అహల్యా దేవి
అమ్మా,నాన్న: కీర్తిశేషులు మరుదాడు సుబ్బారామయ్య,మరుదాడు అన్నపూర్ణా దేవి.
పుట్టిన ప్రదేశం:కడప,రాయలసీమ
అప్పటి స్థితిగతులు:అరుమందిలో నేను ప్రథమ సంతానాన్ని..మేము నలుగురం అక్కాచెల్లెళ్ళం, ఇద్దరు అన్నదమ్ములు.
అందరూ నాకన్నా చిన్న వాళ్ళే.
నాన్న గారిది చిన్న ఉద్యోగం కావడంతో ప్రతిదీ సర్దుకుపోయి జీవించాల్సిన పరిస్థితి మాది.
అమ్మా నాన్నలతో: ఇంటికి పెద్దదాన్ని అని నా మాటకు చాలా విలువ ఇచ్చేవారు. నాపై మా అమ్మ ప్రభావం ఎక్కువ. మా అమ్మ గారు పదవ తరగతి వరకు చదివారు..మాగజైన్స్, నవలలు తెగ చదివేవారు..ఆమె పోలికే నాకు వచ్చిందనే వారు మా నాన్నగారు..
తోడబుట్టిన వారితో అనుబంధం:
తోడబుట్టిన వారితో అనుబంధం చాలా బాగుంది ఇప్పటికీ.
ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసి రిటైర్ అయ్యాము..అందరం బాగా సెటిల్ అయ్యాము..చిన్న చెల్లెలు మాత్రం ఎస్వీబీసీ లో చేసి రిటైర్ అయ్యింది..ప్రభుత్వ ఉద్యోగం కాదు ఆమెది.
నా చదువు, పెళ్ళి,అనుభూతులు:
బీఎస్సీ కడప గవర్నమెంట్ కాలేజ్ లో చదివాను.
ఆరుమందిలో నేను ప్రథమ సంతానాన్ని. అప్పట్లో ఆడపిల్లను
కాలేజీకి పంపించాలంటే పెద్దలకు ఇష్టం ఉండేది కాదు కట్టుబాట్లు అలా ఉండేవి ..నేను బీఎస్సీ చదవడానికి ఉపవాస దీక్షలు చెయ్యాల్సి వచ్చింది.చివరికి డిగ్రీ సాధించాను..మా కుటుంబాల్లో
ఆడపిల్ల కాలేజీ మెట్లెక్కడం నాతోనే మొదలయ్యింది..
తొలి సంతానం కావడంతో నాకు బాధ్యతలు ఎక్కువే . డిగ్రీ కాగానే
ఎంప్లాయ్ మెంట్ ఎక్సచేంజ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాను. నాన్న గారికి ఏడు సంవత్సరాలు ఆర్థికంగా సాయ పడ్డాను. తాత్కాలిక ఉద్యోగం కావడం వల్ల పెళ్లయ్యాక మూడేళ్ళ కు పెర్మనెంట్ అయ్యాక బదిలీ అయ్యి హైదరాబాద్ కు వచ్చాను.
మావారు చెరువు నాగరాజ..కడప జిల్లా వారే. వారు కూడా ప్రభుత్వ ఉద్యోగే.. ఇద్దరు ఆడపిల్లలు.
ఇద్దరం ఉద్యోగస్తులం కావడం వల్ల వారి పెంపకంలో కొన్ని కష్టాలు పడవలసి వచ్చింది..
నాకు గెజిటెడ్ ర్యాంక్ వచ్చాక డిస్ట్రిక్ర్స్ కు బదిలీలు ఉండేవి.
పిల్లలు,చదువులు కాలనీలో పరిస్థితుల దృష్ట్యా నేను ప్రమోషన్లు నాలుగు వదులుకున్నాను.. తప్పదు..నా గురించి ఆలోచించుకుంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉండేదో.. నా పిల్లల కోసం త్యాగం చెయ్యక తప్పలేదు. వాళ్ళిప్పుడు బాగా సెటిల్ అయ్యారు..ఆడపిల్లలు ,అల్లుళ్ళు ఇంజనీర్లు. మనుమడు,మనుమరాలు కూడా కంప్యూటర్ సైన్సు చదువు తున్నారు.
పెద్దమ్మాయి సుధా మాధురి: అమెరికాలో స్థిరపడింది..మా అల్లుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్.
మనుమడు కంప్యూటర్ సైన్స్, జార్జియా టెక్ యూనివర్శిటీ లో చదువుతున్నాడు.
చిన్నమ్మాయి సుధా శ్రవంతి: ప్రాజెక్ట్ మేనేజర్ గా బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. ఓ ఎంఎన్సీ లో అల్లుడికి సాఫ్ట్ వేర్ కంపెనీ ఉంది..
మనుమరాలు బిట్స్,పిలానీ లో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది.
నేను ఉద్యోగరీత్యా ప్రమోషన్లు వదులుకున్నది పిల్లల కోసమే. వాళ్లకోసమే నా కెరీర్ లో నేను చాలా వదులుకున్నాను. కష్టపడ్డందుకు పిల్లలు బాగున్నారు. నేను కోరుకున్నది అదే..అది దక్కింది చాలు.ఇంతకంటే తియ్యని అనుభూతి ఉంటుందని అనుకోను.
పరిచయం
పోటీ ప్రపంచంతో పాటు మేము పరిగెత్తలేకపోయినా మా వరకు మేము సంతృప్తిగా జీవిస్తున్నాము.
చిన్నతనం నుండి సాహిత్యం అంటే ప్రాణం..స్కూల్,కాలేజీ రోజుల్లో ఆయా సావేనీర్స్ కు రాసేదాన్ని. సైర0ద్రి వ్యాసంతో నా రచనా ప్రస్థానం మొదలయ్యింది. ఆ తర్వాత చాలా మాగజైన్స్ కు అనేక వ్యాసాలు రాసాను..ఇప్పటికీ రాస్తున్నాను. ఆతర్వాత పెళ్ళి, బదిలీ,ఉద్యోగం బిజీ,పిల్లలు,బాధ్యతలు..దీనితో క్షణం తీరుబాటు ఉండేది కాదు.
డాక్టరేట్ చెయ్యాలని నాకు ఆశ.
పిల్లల బాధ్యతలు తీరాక ఎం.ఏ.తెలుగు, ఎం.ఏ.జ్యోతిష్యం చేసాను.2017 లో జ్యోతిష్యం లో పీహెచ్డీ పట్టా తీసుకున్నాను.
2006 లో ఎం.ఏ.జ్యోతిష్యం,2015 లో ఎం.ఏ.తెలుగు,2017 లో పీహెచ్డీ చేసాను.
ఇవన్నీ చేస్తూనే మాగజైన్స్ లో జ్యోతిష్యం, ఆధ్యాత్మిక వ్యాసాలు వ్రాసేదాన్ని..ఇప్పటికీ రాస్తూనే ఉన్నాను..
ఇష్టమైన రచయితలు అంటే చెప్పలేను..అందరి రచనలు చదువుతాను..ముఖ్యంగా యద్దనపూడి రచనలు చాలా ఇష్టం. నవలలు తెగ చదివేదాన్ని.
ఇప్పుడు బాద్యతలన్నీ తీరిపోయాయి.పూర్తి సమయం సాహిత్యానికే కేటాయిస్తున్నాను.
అనారోగ్యాలున్నా నా సాహిత్యానికి అది ఇబ్బంది పెట్టడం లేదు అనేకంటే సర్దుకుపోతున్నాననే చెప్పాలి.
2021 నుండి ఫెస్ బుక్ లో,వాట్సప్ గ్రూపుల్లో కవితలు అనేక ప్రక్రియల్లో రచనలు చేస్తున్నాను. ఎన్నో ప్రశంసా పత్రాలు, బిరుదులు లెక్కలేనన్ని.
ఇవన్నీ ఒక ఎత్తు..ఏప్రిల్ 30,2024 నాడు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వారిచే అందుకున్న మాతృవందనం పురస్కారం ఒక ఎత్తు..ఇన్ని సంవత్సరాల నా కష్టాన్ని ఈ పురస్కారం ద్వారా నన్ను గుర్తించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది..ఇంతకంటే గొప్ప పురస్కారం ఉందని నేను అనుకోను..ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను..
గుంటూరు భవిష్యవాణి వారిచే ఆధ్యాత్మిక రత్న:జ్యోతిష్య శిరోమణి, 200 ప్రశంసా పత్రాలతో
పాటు అందుకున్నాను.
ఆధ్యాత్మిక,సామాజిక వ్యాసాలు 1000 కి పైగా వివిధ మాస,వార పత్రికల్లో ప్రచురితం.ఇప్పటికీ వ్రాస్తున్నాను.
వాట్సప్ సమూహాల్లో అనేక ప్రక్రియల్లో ఇప్పటికి 20000 వరకు రాసాను.
ఇప్పటికి 250 కి పైగా కథలు,,వేలాదిగా కవితలు,120 కి పైగా ట్యూన్ లిరిక్స్ రాసాను.
3000 పైగా ప్రశంసా పత్రాలు(విజేతగా కూడా) పొందాను..
నేను కొంతకాలం ఆకాశవాణిలో అనౌన్సర్ గా పని చేసాను.
ప్రయాగ రామకృష్ణ గారితో బాగా పరిచయం.
పాటలు పాడటం, వినటం ఇష్టం.
కాలేజీలో నాకు పాటల పోటీల్లో బహుమతులు కూడా వచ్చాయి.
1.కదంబ మాల
2.శ్రీ రుబాయీలు
3.స్వర రాగ సుధా లహరి వంటి పుస్తకాలను ప్రచురించాము.
ఉద్యోగం పెద్ద అచీవ్మెంట్.
డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అక్కౌంట్స్
జూనియర్ అంకౌట్స్ ఆఫీసర్ గా 31/3/2008 లో పదవీ విరమణ చేసాను.
యాత్రలు చెయ్యడం, సైట్ సీయింగ్ ఇష్టపడతాను.
ప్రకృతి దృశ్యాలు చూడ్డం, కెమెరాలో బంధించడం.. చాలా ఇష్టం.
ఇప్పటికి 80 శాతం భారతం చూశాము.
ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం అయిపోయింది.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఇంకో 4 మిగిలాయి.
ఇవి కాక కంబోడియా, ఇండోనేషియా,నేపాల్, శ్రీలంక, బ్యాంకాక్,బాలి చూశాము.
2011 నుండి 2020 కరోనా వచ్చేముందు రోజు వరకు యాత్రల్లోనే ఉన్నాము..
ప్రస్తుతం సాహిత్యం మీద మరింత శ్రద్ధ వహించాను.
అంటూ మరుదాడు అహల్యాదేవి గారు వారి జీవితం విశేషాలను పంచుకున్నారు. అటు కుటుంబం ఇటు అభిరుచులు సమన్వయం చేసుకుంటున్న ఇటువంటి వాళ్ళే కదా ఈనాటి యువతకు స్ఫూర్తి!
తరుణి పత్రిక పాఠకులకు అభినందనలు. అహల్యాదేవి గారికి కృతజ్ఞతలు.\
9848238453