కారు పార్క్ చేసిలిఫ్ట్ లో ఐదో అంతస్తులో వున్న ఇంటిలోకి వచ్చాడు రవి. తలుపు తీసిందిఅర్పిత, ఆమె మొహం చూసి ఎందుకు సీరియస్ గావుందో అర్ధం కాలేదు రవికి.” రండి మీకు కాఫీ ఇవ్వనా.”వద్దు.ఎనిమిది దాటింది భోజనం చేద్దాం. ఆ మా అమ్మేది.” “ఆవిడ సాయంత్రం ఇంటిలో వుంటా
రా.గానసభ కు వెళ్ళారు.’
“మరి పిల్లలు ఇంటిలోకి ఎలా వచ్చారు.”
“మమ్మీ వచ్చాకే బామ్మ బయటికి వెళ్ళారు డాడి.”పదేళ్ళ కొడుకు భార్గవ్ చెప్పాడు. “ఓకే,నేను ఫ్రెష్ అయి వస్తాను.”
అతను వచ్చాక నలుగురూ ఒకేసారి భోజనానికి కూర్చున్నారు. “నేను మా అమ్మ వచ్చాక తింటాను.”
“అక్కర్లేదు.ఆవిడ ఆ ప్రోగ్రాం అయ్యాక ఎప్పుడు వస్తారో ఏమో. మీకు మళ్ళీ మీటింగ్స్ వుంటే భోజనం లేట్ అవుతుంది….. నేను ఆవిడ కోసం ఆగాలని మీ ఆలోచన. ?”
అబ్బేబ్బే అదేమీ లేదు.లేటుగా తినడం మంచిదికాదు.”ఎక్కువ మాట్లాడకుండానే భోజనాలు చేసారు,పిల్లలు గుడ్ నైట్ చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. ..ఏమండి మీ అమ్మగారు రోజూ ఇలా ఏదో ఒక దగ్గరికి వెళ్ళడం ఏమైనా బాగుందా.” “వెళ్ళని.ఆవిడ ఇంటిలో వుండి ఏం చెయ్యాలి.”
“అంటే పనిలేకపోతే రోడ్డుమీదకి వెళ్ళీపోవడమేనా అసలే రోజులు బాగలేవు. ఎన్నో ఘోరాలు రాత్రి తొమ్మిది వరకు బయట తిరగడం ఈమెకేం పని.”
“అబ్బా అరవై యేళ్ళు దాటిన మా అమ్మకు తెలియదా. బయటకు వెళ్ళాలో వద్దో.” “తెలియదు, ఆవిడ పెద్దావిడ, కళ్ళు తిరిగిపడిపోతే, మెడలో బంగారు గొలుసు ఎవరైనాలాగేస్తే….. ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వస్తుందో, ఎవరికే దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేము. ఆవిడను కాస్త ఇంట్లోనే ఉండమనండి.”
“చూద్దాములే.”
అతనికి ఫోన్ రావడం తో మాటలు ఆపేసింది అర్పిత.కానీ ఆమెకు అత్తగారిమీద వుండే కోపం మాత్రం పోవడం లేదు. తొమ్మిదిన్నర గంటలకు ఇంటికి వచ్చింది. అర్పిత అత్తగారు శ్రీదేవి. “ఏమ్మా రవి వచ్చాడా. మీ భోజనాలు అయ్యాయ్యా.”
డాన్సులు,మంచి నాటకాలు, పాటకచ్చేరీలు. వంటివి చాలా ఇష్టం. కానీ కాస్త నేను పెద్దయ్యేటప్పటికే వాటి ప్రదర్సనలు తగ్గిపోతూ వచ్చాయి. తర్వాతా నేను పెద్దక్లాసుల్లోకి రావడం డిగ్రీతర్వాత పెళ్లి.మీ మామగారికి ఇవన్నీ చూడాలనే ఆసక్తి లేదు ఎప్పుడైనా సినిమాకు వెళ్ళడమే అరుదు. తరవాత పిల్లలు వాళ్ళ చదువులు వీటితో సరిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ళకు నాకు వీటిని చూసే అవకాశం వచ్చింది.
ఈ
అదీ మా అబ్బాయి ఈ త్యాగరాజ గానసభ కు దగ్గర గా ఈ ప్లాట్ తీసుకున్నాడు కాబట్టి. అక్కడ నేను చూడవలసిన ప్రోగ్రాం ఏదైనా
వుంటే వెడతాను.నడిచివెళ్ళే దూరం కాబట్టి.పైసా ఖర్చులేదు. టికెట్ కొనే కార్యక్రమాలు
కాదు………
“ఖర్చు గురించి ఎవరు అడిగారు.”…. అర్పిత అంది.
“నువ్వు అడిగావనికాదు. టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నా. ఇంక రవీంద్రభారతి కి వెడితే నా ఆటో ఖర్చు నేనే పెట్టుకుంటున్నా. రవి మీద భారం పడకుండా.” “మీరు ఇలా మాట్లాడిమమల్ని అవమానిస్తున్నారు.”
“లేదు, ఒక విషయం మాట్లాడేటప్పుడు అన్ని కోణాలు అలోచించాలి. ఇంక ఇంట్లో పని గురించి,నువ్వు ఆఫీస్ నుంచి వచ్చాక ఇంటిని, పిల్లలను నీకు అప్పగించి వెడుతున్నా .వాళ్లకి తినడానికి ఏదైనా పెట్టి రాత్రి భోజనానికి కూర చేసి ఆరిన బట్టలు మడత పెట్టి ఇలా నీమీద పని భారం పడకుండా చేసి వెడుతున్నా. వేడిగా అన్నం కుక్కర్ లో నీకు వీలైనప్పుడు పెడతావు. ఇంక నేను పాట కచ్చేరికి వెళ్ళినా బాధ ఏముంది.
నాకు పెళ్ళయిన కొత్తలో మా ఆయన ఆఫీస్ నుంఛి రాగానే నాతోనే మాట్లాడాలని, కాఫీ నన్నే అడగాలని ఏంతో అనిపించేది. కానీ మా అత్తగారు, మామగారు నాకు ఎన్నడూ ఆ అవకాసం ఇచ్చేవారు కాదు.ఇప్పుడు నీకూ, రవికి కాస్త మాట్లడుకోవలనిపించవచ్చు.నేను వీలైనప్పుడల్లా ఆ ఛాన్స్ మీకు ఇస్తే ఎంత బాగుంటుంది.”
“మేముఅంత రోమాంటిక్ గా లేము లెండి.”
శ్రీదేవి నవ్వేసింది.”అదే వద్దనేది. ఇలాటి చిన్న చిన్న సరదాలే మనకి సంతృప్తిని ఇచ్చేవి.”ఒక నిముషం ఆగి అంది శ్రీదేవి.
నీకు నాకు ఒక తరంతేడా వుండవచ్చు. అత్తాకోడళ్ళం కావచ్చు. అయినంత మాత్రాన దెబ్బలాడుకోవాలని లేదు.
“మీకు వడ్డిస్తాను, రండి,”అంది అర్పిత. ఆ మాటలో శ్లేష కు నవ్వొచ్చింది శ్రీదేవికి. “ఆడవాళ్లకు ఒకరు అన్నం పెట్టడం ఎందుకు, నేను చీర మార్చుకు వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో నేను తిన్నాక అన్నీ సర్దుతానులే” అంది.
“సరే” అర్పిత తన గదిలోకి వెళ్ళిపోయిపడుకుంది. రోజంతా ఆఫీస్ లో కూర్చుని పనిచేసే ఆమెకు రాత్రి పదిగంటలు అయితే ఇంక కూర్చుని ఉండాలని వుండదు.రవి ఆమెకు నిద్ర భంగం కాకుండా టేబుల్ లైట్ వేసుకు పని చేసుకుంటున్నాడు, నిజానికి అర్పిత కు నిద్ర రావడం లేదు.రెండేళ్ళ క్రితం మామగారు పోవడం తో అత్తగారు శ్రీదేవి హైదరాబాద్ లో తమ దగ్గరకు వచ్చేసింది.
రవికి చెల్లెలు వుంది,పెళ్లి అయి భర్త తో ముంబాయి లో ఉంటోంది.
శ్రీదేవి ఒకరిని సతాయించే మనిషి కాదు . కానీ ఆమె రోజూ ఇలా డాన్స్ అనీ నాటకం అనీ వెళ్ళడం అర్పితకు ఇష్టం గా లేదు.
అది ఎందుకు అన్నదిఆమెకే తెలియదు.
ఆ రోజు శనివారం. పిల్లలలకు హాఫ్ డే. భోజనానికి ఇంటికే వస్తారు.
ఆ సాయంత్రం అర్పిత ఇంటికి వచ్చేసరికి బామ్మ, మనవలు అష్టాచెమ్మా ఆడుతున్నారు.ఈవేళ ఎక్కడికీ పెత్తనాలు లేవు కాబోలు అనుకుంది అర్పిత. ఆమె ఫ్రెష్ అయి వచ్చేసరికి అత్తగారు కాఫీ కలిపి ఇచ్చింది. ఆమె ఇస్త్రీ జరీ చీర లో వుంది.
“అర్పితా ఇ వేళ నేను రవీంద్రభారతి కి వెడుతున్నాను. ఇడ్లి పిండి రుబ్బి పెట్టాను. చట్నీ చేసి ఫ్రిజ్ లో పెట్టాను. ,పిల్లలకు పాలు కలిపి ఇచ్చాను. ఈ వేళ కూచిపూడి నాట్యం వుంది. నేను రావడానికి ఆలస్యం అవుతుంది. తాళాలు తీసుకు వెడుతున్నా. మీరు నిద్ర పోయినా డిస్టబెన్స్ లేకుండా. పక్కనే కామత్ హోటల్ లో టిఫిన్ తిని వస్తాను,నా కోసం ఎదురుచూడకండి. వస్తాను పిల్లలు.”
అంటూ వెళ్ళిపోయింది శ్రీదేవి. అర్పితకు వెడుతున్న అత్తగారిని జబ్బ పట్టుకు ఇంట్లోకి లాక్కురావాలన్నంత కోపం వచ్చింది. కానీ
ఏం చేయలేక కోపంగా సోఫాలో కూర్చుండి పోయింది.
శనివారం అయినా ఆఫీస్ లో పని వుందని వెళ్ళిన రవి ఇంటికి వచ్చాడు. మళ్ళీ మామూలే.”మా అమ్మేది.
అర్పిత గయ్యిమంది.”మీ అమ్మగారికి నేనేమైనా సెక్రటరీ నా.ఆ విడ ప్రోగ్రాం రోజూ మీకు నివేదించడానికి, నేను ఇంటికి రావడం భయం ఇల్లు నాకు అప్పగించి ఆవిడ వూరేగబోతుంది.”
“ఏమిటా అరుపులు, మాములుగా మాట్లాడలేవు.” “నావి అరుపులే, మీ అమ్మ చేసే చేతలు కనపడవు.” “పోనీలే ఏదో కాలక్షేపంకోసం వెడుతోంది.”
ఆ,, ఏం సపోర్టు చేస్తారండి. అదే నేను చేస్తే ఊరుకుంటారా.”
రవి మాట్లాడలేదు,నిజానికి తల్లి అలా వెళ్ళడం అతనికీ నచ్చడం లేదు, కానీ భార్య ముందు తల్లిని చిన్నబుచ్చడం బాగుండదు.
అర్పితకు మాత్రం కోపం తగ్గడంలేదు. అత్తగారు అన్నీ చేసి పెట్టినా ఏ పని చేయాలనిలేదు .ఒకటి రెండుసార్లు రవి ఆమెను
సోఫా లోంచి లేవమని హెచ్చరించినా లేవకపోయేసరికి తనే ఇడ్లి కుక్కర్ పెట్టాడు. టిఫిన్ తినమని పిల్లలు, రవి బలవంతం చేస్తే తప్ప ఆమె రాత్రి ఎనిమిది గంటల వరకు అలా కూర్చుండి పోయింది.
***********
******* *ఈ
ఆలోచనలు తెలియని అమాయకురాలు కాదు శ్రీదేవి. ఆమెకూచిపూడి నాట్యం చూస్తున్న ఇంట్లో కోడలు చేసే డాన్స్ కూడా కనిపిస్తూనే వుంది, ఆ రాత్రి పదకొండు గంటలకు ఇంటికి వచ్చి నిద్రపోయింది శ్రీదేవి.” నువ్వు రాత్రి వేళ బయటకు వెళ్ళకమ్మా, రోజులు బాగాలేవు, “అన్నాడు రవి. ఆ మర్నాడు.
“నిజమే రవి, ఏవో కొన్ని మంచి ప్రోగ్రాములకు తప్ప నేనూ వెళ్లను. అయినా నా జాగ్రత్తలో నేను ఉంటాను.అంతగా నేను ఇంటికి రాలేకపోతే నీకూ కోడలికో ఫోన్ చేస్తాను. మీరు వచ్చి తీసుకు వస్తారు.”వింటున్న అర్పితకు చెప్పలేని ఆశ్చర్యం కలిగింది.”అంతేకానీ ఈవిడ పెత్తనాలు మానదన్న మాట.
“నాయనమ్మా మీరు డాన్స్ కు వెళ్ళారని అమ్మకు కోపం. ఆరేళ్ళ
భవిత అంది.
“ఏమిటే వాగుతున్నావ్.”అర్పిత పిల్ల చేయి పట్టుకు లాగి కొట్ట బోయింది. చప్పున ఆమెను దగ్గరికి తీసుకుంది. శ్రీదేవి,”భవిత అది నా మీద కోపం కాదమ్మా, రాత్రి వేళ నేను ఇంటికి ఎలా వస్తానో అని భయం.అంతే.అయినా పెద్దవాళ్లు మాట్లాడుకుంటుంటే మీరు కల్పించు కోకూడదు అని చెప్పానా. వెళ్ళు అన్నయ్య లేచాడేమో చూడు బ్రేక్ ఫాస్ట్ కు రండి అందరూ.”ఆ గొడవ అంతటితో సద్దు మణిగింది. ఆ సాయంత్రం సినిమా టిక్కెట్లు చేతిలో పెట్టి అందరినీ సినిమాకు పంపించింది, శ్రీదేవి, కాస్త మూడ్ బాగాలేని వాళ్ళు సినిమాకు వెళ్లి నవ్వుకుంటూ ఇంటికివచ్చారు.
******
ఆ రోజు కాస్త జలుబుభారం గా వుండి ఆఫీస్ కు వెళ్ళలేదు అర్పిత.
రవి పిల్లలు ఆఫీస్ కు స్కూల్ కి వెళ్ళిపోయారు. బ్రేక్ ఫాస్ట్ అయ్యాక దినపత్రిక చూస్తుంది శ్రీదేవి,ఈ లోగా అర్పితకు ఫోన్. ఆమె తల్లి కాబోలు.”ఆ..ఆ..వెళ్ళలేదమ్మా ఆఫీస్ కి ఆ..జ్వరం లేదు చాలా జలుబు గా వుంది.ఆ..ఆ.. ఇంట్లోనే వున్నారు. ఈ వేళ ఎక్కడికీ పెత్తనాలు లేనట్టున్నాయిలే….. అయినా సాయంత్రం కదా బయలుదేరేది.” ” తర్వాత ఏవో మామూలు మాటలు. తన గురించి వినపడిన మాటలకూ బాధ పడింది శ్రీదేవి. అత్తా కోడళ్లిద్దరూ భోజనం చేసారు.” నిద్రపోకు అర్పితా. జ్వరం వస్తుంది.” అంది శ్రీదేవి. “నాకు బాగా నిద్రపోవాలని వుంది.”
“అవును జలుబుకు వేసుకున్న ఇంగ్లీష్ మందులకు నిద్ర వస్తుంది. అయినా కొంచెం సేపు మధ్యహ్నం మూడు గంటల వరకు మేలుకో ఆ పైన నిద్రపోదువుగానీ. ఈ వేళ నేను ఎక్కడికీ వెళ్ళలనులే.”
“వెడితే వెళ్ళండి. నేను పని చూసుకుంటాను.”
ఎంత మామూలుగా మాట్లాడదా మానుకున్నా మాట విసురుగా వచ్చింది అర్పితకు. అది గ్రహించిన శ్రీదేవి హమ్మయ్య మాట్లాడాలనుకున్న సమయం వచ్చింది. అనుకుంది. “ఈ వేళ నేను చూసే ప్రోగ్రాం లు ఏమీ లేవులే……. అయినా నేను ఇలా రోజూ వెళ్ళడం నీకు నచ్చడం లేదుకదూ.”
అత్తగారు అలా సూటిగా మాట్లాడడం అర్పితకు కాస్త ఖంగారు వచ్చింది.
శ్రీదేవి గొంతు సర్దుకుంది. ఇద్దరూ హాల్లో సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు.”చూడు అర్పితా నాకు చిన్నప్పటినుంఛి క్లాసికల్ నేను స్వగ్రామం లో ఉండవచ్చు. కానీ మన విషయాల మీద మనకంటే ఇతరులకే ఆసక్తి ఎక్కువ. అక్కడే వుంటే మీకు నాకు ఏవో మనస్పర్థలు అనుకునే అవకాశం వుంది. అయినా రెండో బాల్యం లాంటి ఈ వృద్దాప్యం లో నా మనవలతో గడపాలనిపించింది……నీకు నిజంగా నీకు ఇబ్బంది అయితే ఈ ప్రోగ్రాం లకు వెళ్ళడం మానేస్తాను.”
“మీ సెక్యురిటీ……
శ్రీదేవి సూటిగా చూసింది కోడలి వైపు”నేను ఎప్పుడైనాతొమ్మిది గంటలు దాటే దాకా ఇంటికి రాకుండా వున్నానా.మొన్న రవీంద్రభారతి విషయం అంటావాఅలా లేటు అయ్యేది చాలా తక్కువ. అరవైఏళ్ళ జీవితాన్ని జాగ్రత్తగా గడుపుతూ ఇక్కడి దాకా వచ్చినదాన్ని ఇకపై జాగ్రత్త గా ఉండనా. ఇది ఒక్క సంగతి కాకుండా నా తప్పుఏదైనా వుంటే చెప్పమ్మా అది ని జంగా పొరపాటు అయితే సర్దుకుంటాను……. ఆ… మధ్యాహ్నం మూడు అయింది నువ్వు నిద్రపో.” శ్రీదేవి తన సెల్ ఫోన్ తీసుకు తన గదిలో కి వెళ్ళిపోయింది. ఒక్క మాట పరుషంగా లేదు.ఒకమాట కోపంగా లేదు….. అత్తగారి మాటలు నిజాలు. అవి ఇష్టం వున్నా కాదు”జలుబు” కూడా తగ్గిపోయినట్టయింది.
లేకపోయినా ఒప్పుకు తీరాలి. శ్రీదేవి మాటలకూ అర్పితకు నిద్ర మత్తే.