ఎడారి కొలను 

ధారావాహికం – 46వ భాగం

(ఇప్పటివరకు : ఎలీషా  ప్రసాద్ కి భవ్య ,అపూర్వ ల మధ్య నున్న బంధం గురించి వివరిస్తుంది. భవ్య అపూర్వ ఆఫీస్ నుండి రిలీవ్ అవుతారు కొత్త కంపెనీలో చేరడానికి. ప్రసాద్ కి మనసంతా ఆందోళనతోటి నిండిపోతుంది. సుమతి అపూర్వ ప్రసాద్ ల చేత కొత్త ఫ్లాట్ లో కాపురానికి కావాల్సిన ఏర్పాట్లు చూడడానికి వస్తుంది. అక్కడ బోర్డు మీద భవ్య పేరు టెనెంట్ గా  చూసి హతాశురాలవుతుంది )

తన ఖంగారు కనిపించనీయకుండా కొంత సామాను చేత్తో పట్టుకొని లిఫ్ట్ లోకి వెళ్ళింది. ఎందుకో ఆమెకి ప్రసాద్ వంక చూడడానికి చాల ఇబ్బందిగా ఉన్నది. ఫ్లాట్ చేరుకోగానే ,ఆమె ముందుగా తాను తీసుకొచ్చిన దేవుడి పటాలను, దేవుడి గదిలో అమర్చి, వెండి కుందులలో దీపాలు వెలిగించి, కొబ్బరికాయ కొట్టి, ఇల్లంతా ధూప్ వేసింది. అంతలోకే  అపార్ట్మెంట్ లోని వర్కర్స్ చేత సామానులన్ని  పైకి పెట్టించాడు ప్రసాద్. ముందుగా గ్యాస్  స్టౌ  సిద్ధం చేసి, పాలు పొంగించింది. ఆ పాలతోటి కాఫీ కలిపి తెచ్చింది. అప్పటికే ప్రసాద్ కొంచం డస్టింగ్ చేసేసి , ఇల్లంతా అద్ధం ల కనిపించేలా చేసాడు.  ఆలా అన్ని సర్దుతూ పొందికకాగా అన్నిటిని అమరుస్తున్న ప్రసాద్ ని చూస్తూ   ‘అపూర్వ ఎంత అదృష్టవంతురాలు,’  అనుకుంది మనసులో.

“ ప్రసాద్ కాఫీ తీసుకో, కొంత పని అపూర్వ కోసం కూడా వదిలి పెట్టు,” అంది నవ్వుతు.

“ పర్లేదులే ఆంటీ, అపూర్వ ఇక్కడ సుఖ పడడానికి రావాలి గాని, ఆమె ని కష్టపెట్టే ఉద్దేశ్యమే లేదు,” అన్నాడు. “నాకు తెలుసు ప్రసాద్, అపూర్వ ని నువ్వెంత ప్రేమిస్తున్నావని.  అప్పుడప్పుడు నాకనిపిస్తుంది నా కూతురు నీ అంతలా ప్రేమించే భర్తకి తాను తగిన భార్య యేన అని,” అంది.

“ నాకయితే భవ్య కాస్త ఇబ్బందిపెడుతున్నదనిపిస్తున్నది. ఆ పిల్ల స్నేహం తో మా అపూర్వ  కాస్త ఎక్కువే పాడయిందనిపిస్తున్నది. వాళ్ళు చదువుకునే రోజుల్లో ఇలాగ లేరు. ఎందుకంటే ఇద్దరు కలిసే బి ఇ  చేసారు. ఆ తరువాత కలిసి ఢిల్లీ వెళ్లారు  జాబ్ మీద. అక్కడ ఒక ఏడాది పాటు  ఫ్లాట్ మేట్స్ లాగ ఉన్నారు.  వెనక్కి వచ్చేసారు. ఈ కంపెనీలో చేరారు. మేమంతగా పట్టించుకోలేదు వాళ్ళిద్దరిని. కానీ నాకనిపిస్తుంది వాళ్ళ స్నేహం ఎందుకో నిన్ను ఇబ్బంది పెడుతున్నదనిపిస్తున్నది,” అన్నది సుమతి.

“ అదేం లేదండి , మీరంతల ఆలోచించొద్దు,” అన్నాడు ప్రసాద్.

“ ఒక్క విషయం గుర్తుంచుకో ప్రసాద్, నీకెప్పుడు మేము అండగా ఉంటాము. మా అమ్మయే అయినా తప్పుచేస్తే వదిలే ప్రసక్తే లేదు. ఏ  విషయమయినా మా దగ్గర దాచకుండా నువ్వు చెప్పవచ్చు,” అంది భావోద్వేగంతో.

ప్రసాద్ ఆమె మాటలను వింటూ ఉండిపోయాడు. ‘మీ కొచ్చిన అనుమానం సరయినదే అంటి కానీ, మీరది అర్ధం చేసుకోలేరు. నేనే అపూర్వ కి హెల్ప్ చేయాలి. ఆమె మనసెంటో  తెలుసుకోవాలి,’ అని మనసులోనే అనుకున్నాడు.

మధ్యానానికల్లా సర్దడం పూర్తి చేసి , “ప్రసాద్ వెళదాం పద.  మనం ఈ సారి అపూర్వ తో సహా వద్దాము. ఈ గురువారమే ముహూర్తం  మీరు గృహప్రవేశం చేయడానికి, మీ కొత్త కాపురం మొదలవడానికి,” అంటూ సంతోషం గ ఇల్లంతా పరికించి చూస్తూ చెప్పింది. ప్రసాద్ కూడా చిరునవ్వుతో ఆమె చెప్పినదానికి తలూపాడు.

*************************

ప్రసాద్ అపూర్వ ల జీవితం లో కొత్త అధ్యాయం మొదలయింది. నెలరోజుల పాటు లీవ్ ఉన్నదని అపూర్వ ఫ్లాట్  లోనే ఉంటున్నది.

చంద్రమౌళి గారు “ ప్రసాద్ , సిటీ కి మీ ఫ్లాట్ దూరం కదా. నా రెండో కార్ నీ దగ్గర ఉంచుకో ,” అని అయన వేసుకొచ్చిన 2000 మోడల్ జెన్ కార్ ని వదిలేసి వెళ్ళాడు.

ప్రసాద్ ఉదయాన్నే 9 గంటలకల్లా తన బైక్ మీద వెళ్ళిపోతాడు. సాయంత్రం ఏడూ , ఏడున్నర కల్లా  వచ్చేస్తాడు. కానీ ఎందుకో పెళ్ళికి ముందు అపూర్వ  మీదున్న ఆకర్షణ తనకి ఇప్పుడు కలగటం లేదు. ఇంటి కొచ్చాక కూడా లేట్ నైట్ దాకా ఆఫీస్ పని చేస్తూ కూర్చుంటాడు. అపూర్వ కూడా ప్రసాద్ ప్రవర్తన గమనించిన, ఏమి పట్టనట్టు గానే ఉంటున్నది. నాకు బోరు గ ఉన్నది అంటూ భవ్య ఫ్లాట్ లోనే ఎక్కువ సమయం గడుపుతుంది.

భవ్య పది రోజులు ముందరే ఆఫీస్ లో జాయిన్  అయింది. ఆ పది రోజులు కారేసుకొని అపూర్వ పగలంతా వాళ్ళ అమ్మ దగ్గరికెళ్లి వస్తున్నది.

“ ప్రసాద్ రావటమే లేదు. ఇద్దరు కలిసి రావచ్చు కదా! కనీసం వెళ్ళేటప్పుడయినా ప్రసాద్ వచ్చి నిన్ను తనతో టి తీసుకు పోవచ్చు కదే?” అంటూ సుమతి అడుగు తూనే ఉన్నది.

అన్నిటికి నవ్వే సమాధానం గ ఆ పదిరోజులు గడిపేసి అపూర్వ కూడా భవ్య ఆఫీసులో నే జాయిన్ అయింది. అప్పటి నుండి ఇద్దరు కలిసి వెళ్లడం, కలిసి రావడం చేస్తున్నారు. నాకు ఇంట్లో బోరు అంటూ లెట్ నైట్ దాక భవ్య ఫ్లాట్ లోనే కూర్చుంటుంది అపూర్వ.

ప్రసాద్ కి ఇలా కాలయాపన చేయడం మంచిది కాదనిపించి భవ్య ని  డిన్నర్ కి పిలవ మని అపూర్వకి చెప్పాడు. తాను ఎలీషా ను డిన్నర్ కి  పిలిచాడు. ఎలిషా అక్కడికి దగ్గర్లో నే ఉన్న మరో అపార్ట్మెంట్ కాంప్లెక్ లో ఉంటుంది. ఎలిషా  ప్రసాద్ గురించి కొంచం చెప్పటంతో  ఆమెని ఆమె హస్బెండ్ ప్రసాద్ అపార్ట్మెంట్స్ దగ్గర దింపివెళ్ళాడు . ఎలీషాకి ముందుగానే చెప్పటంతో ఆమె తన చిన్న కూతురిని తన భర్త దగ్గరి వదిలింది.  ఆ పాప మమ్మీ తో వెళతాను అని గొడవ చేస్త, “మనం ఐస్క్రీమ్ తిందాము, పిజ్జా తిందాము అని చెప్పి” ఎలిషా  హస్బెండ్ పాపని తన దగ్గరే ఉంచుకున్నాడు.

కొద్దీ సేపు పిచ్చాపాటి కబుర్లు అయినా తరువాత ప్రసాద్ సూటిగా అడిగాడు,” భవ్య, మీరు , అపూర్వ ఒకరి నొకరు ఫిజికల్ గ  ఇష్ట పడుతున్నారా?”

అతనలా అడిగే సరికి భవ్య గతుక్కుమన్నది. మొహం పేలవం గ మారింది. గొంతు తడారినట్లయింది. అపూర్వ కి ఎప్పటి నుంచో ప్రసాద్ కి తమ విషయం అర్ధమయిందేమో అన్న అనుమానమయితే మనసులో మెదులుతూనే ఉన్నది. అందుకే నేల చూపులు చూస్తూ కూర్చున్నది.

వాళ్ళ ఇబ్బంది అర్ధం చేసుకున్న ప్రసాద్ ఎలిషా  వంక చూసాడు. ఎలిషా నే మాట్లాడటం మొదలుపెట్టింది.

“ చూడు అపూర్వ, మీరిద్దరూ ఒకరినొకరు ఫిజికల్గా ఇష్టపడుతున్నారన్న విషయం స్పష్టం గ ప్రసాద్ కి అర్ద్మయింది. ఇపుడు మీ బంధాన్ని దాచి ఇంకా సమస్యని పెంచొద్దు. మీరేమనుకుంటున్నారో తెలిస్తే, ప్రసాద్ తన ఫ్యూచర్ నిర్ణయించుకుంటాడు,” అంది నింపాదిగా.

“ నాకు ప్రసాద్ అంటే కూడా ఇష్టమే,” అంది అపూర్వ.

“ కానీ మీ దాంపత్యమే మొదలవలేదు కదా అపూర్వ, ఇన్ని విషయాలు తెలిసిం తరువాత ప్రసాద్ మనసులో ఏముందో కూడా తెలుసుకోవడం చాలా అవసరం. నీవు  సీక్రెట్ గా వ్యవహారం నడిపేద్దామనుకుంటున్నావు , మరి ప్రసాద్ మాటేమిటి, అతనెంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాడో  మీకు తెలియదా? ఎంగేజ్మెంట్ రోజున ప్రసాద్ కంటే ముందే భవ్య నీకు రింగ్  తొడగటం, మంగళసూత్రం కట్టేటప్పుడు మూడో ముడి ప్రసాద్ చేతి ని పక్కకి తప్పించి భవ్య వేయడం. ఇవన్నీ మీరు ప్లాన్ గానే చేసినప్పుడు, మీరిద్దరూ  కలిసుండాలనుకుంటున్న విషయం కూడా స్పష్టం గ చెప్పేయండి, ఇప్పటికి మించిపోయిందేమి లేదు, ప్రసాద్ అర్ధం చేసుకోగలడు, ” అంది   ఎలిషా గంభీరంగా .

భవ్య ఎదో చెప్పపోయింది.  ఎలిషా  భవ్య ని ఆపుతూ,” నువ్వాగు భవ్య, ఎందుకంటే ఇప్పుడు అపూర్వ కేవలం నీ పార్ట్నర్ మాత్రమే కాదు, లీగల్ గా ప్రసాద్ కి భార్య కూడా. ఆమెని ని మాట్లాడని,” అంది.

అపూర్వ కొద్దీ సేపు మౌనంగా ఉండి  మాట్లాడటం మొదలు పెట్టింది.

“ ప్రసాద్ మీరు నన్ను  క్షమించాలి. మొదట్లో మీమీద నాకు చాల ప్రేమ కలిగింది. అందుకే ఆ ప్రేమతో నేను మీతో జీవితం పంచుకోవాలను కున్నాను. కానీ మీరు నా తో చనువుగా ఉంటె బాగుండని ఉండేది , కానీ మీరు కాస్త దగ్గరికి వచ్చిన కూడా నా మనసు తనువూ ముడుచుకుపోసాగాయి. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఢిల్లీ లోఉన్నప్పుడే   ఆకర్షణ మొదలయింది. మీతో కొద్ధి సేపు గడిపాక భవ్య దగ్గరికి చేరాలన్న వాంఛ బలంగా ఉండేది.” అంటూ చెబుతుంటే భవ్య  మధ్యలో అపూర్వ  ని ఆపి  తాను చెప్పటం మొదలెట్టింది.

“ అవును  ప్రసాద్ గారు. మా ఇద్దరి మధ్య ఎంత బలమయిన బంధం ఏర్పడిందంటే మేము ఒకరికి దూరంగా ఒకరం ఉండలేని స్థితి. అందుకే మీరు ఫ్లాట్ కొనగానే, నేను కూడా మీ పక్కనే ఉన్న ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాను. కానీ మా ఈ బంధం సమాజానికి అంగీకారం కాదు. ఇంకా ఇలాటి బంధాలను వ్యతిరే కిస్తూనే ఉన్నారు, అంతే కాదు చట్టపరం గ కూడా మాకు ఏ విధమయిన భద్రతా లేదు. కానీ ఇది కూడా ప్రకృతి చేస్తున్న విచిత్రమే అనుకోవాలి. మహా భరతం లో  ప్రమీల రాజ్యం , ఆమె మీద అర్జునిడి దాడి, ఆ తరువాత వారి వివాహం. ఆ కధ  అందరికి తెలుసు . కానీ ప్రమీలకు  అర్జునిడికి వివాహం చేసి ,  ప్రమీల కేవలం స్త్రీ ఆధిపత్యం కోసమే పోరాడిందని వ్యాస మహర్షి వివరించాడు. కానీ కొందరు విమర్శకులు ప్రమీల రాజ్యం లో అసామాజిక సంబంధ బాంధవ్యాలూన్నయే మో అని భావించారు.  అంతటి మహర్షులు సామాజిక వ్యతిరేక ధోరణి ని చూపించలేదు. మరి మాలాటి అల్పుల మాటేమిటి. మిమ్మల్ని చూడగానే మీరు మమల్ని అర్ధం చేసుకొని మాకు అండగా ఉంటారని పించింది. అందుకే మీతో పెళ్ళయితే అపూర్వ కి ఈ సమాజం లో వివాహిత అన్న మర్యాద దక్కుతుంది. నన్నేమి అనదు,ఎందుకంటే నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. మీరే మాకు సపోర్ట్ చేయాలి. ఇంకో ఏడాది కల్లా నేను అపూర్వ అమెరికా వెళ్ళిపోతాము. అప్పుడు మీకు మా నుండి కలిగే ఇబ్బంది ఏమి ఉండదు,” అంటూ  భావావేశం తో టి మాట్లాడింది.

“ అవును ప్రసాద్ మేము అమెరికా వేళ్ళ పోయే ముందే మా అమ్మ నాన్న లకు చెబుతాను. అప్పటి వరకు నువ్వు ఎవ్వరికి చెప్పనని నాకు ప్రామిస్ చేయి. నాకున్న , నేను నమ్మిన మంచి స్నేహితుడివి నువ్వే. నేను నీకు కూడా దాంపత్య సంతోషాన్ని  పంచటానికి ప్రయత్నిస్తాను ,” అంటూ జాలిగా చూసింది ప్రసాద్ వంక అపూర్వ అతని మీద చెయ్యివేస్తూ.

అనుకోకుండానే ఆమె చేయి పక్కకి  తోసేస్తూ ,” ఆల్ రైట్ అపూర్వ, ఈ  విషయం ముందే చెప్పుంటే , ఎంగేజ్మెంట్ వరకే వచ్చేసి ,పెళ్లి  ఆపే వాళ్ళం. ఇప్పుడు నేను కూడా పెళ్లయిన వాడినేగా. నీకేమనిపిస్తుంది? ఈ సమాజం మగవాళ్ళనయినా వదిలిపెట్టదు . నీకే మయిన అయితే దానికి చట్టబద్దంగా  నన్నే బాద్యుడిని చేస్తుంది.” అంటూ “ ఎలిషా  ఇప్పుడు విషయం మొత్తం అర్ధమయింది. నామీద ఇంకొక బాధ్యత కూడా ఉన్నది. అపూర్వ అమ్మ నాన్న. వాళ్ళకి కూడా తెలియదు. ఈ విషయం  తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏమిటో నాకయితే ఊహకి కూడా అందటం లేదు. వాళ్ళని కూడా సంభాలించాల్సిన బాధ్యత నాదే. పద నిన్ను మీ ఇంటిదగ్గర దిగబెడతాను. మీ పాప ఎదురుచూస్తుంటుంది,” అంటూ బైక్ తాళాలు తీసుకొని బయటికి నడిచాడు, వెనకాలే ఎలీషా.

వెనకనుండి అపూర్వ పెద్దగా ఏడుస్తున్నట్లనిపించింది.

********************

ఆ రోజు తరువాత ప్రసాద్ ఎప్పుడు అపూర్వ ని  ఏ  విషయం లోను కట్టడి చేయలేదు. తనకి తానుగా దూరంగా ఉన్నాడు. కానీ తన అవసరాలన్నీ చూసుకుంటున్నాడు ఒక మంచి స్నేహితుడిలాగా. అపూర్వ అమ్మ నాన్నలకి అనుమానం రాకుండా ఉండడం కోసం కొన్ని ఆదివారాలు అపూర్వ తో కలిసి వాళ్ళింటికి వెళ్లి గడుపుతున్నాడు. అప్పుడప్పుడు వాళ్ళని తన ఇంటికి పిలుస్తున్నాడు.

కానీ మనసంతా ఎదో కోల్పోయిన బాధ మాత్రం నిండి పోయింది. అందరికోసం నవ్వుతున్నట్లున్న కూడా, మొహం లో మాత్రం నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. కొన్ని సార్లు ఆఫీస్ నుండి , సిటీ లో ఉన్న తన పాత  ఫ్లాట్ కె వెళ్ళిపోతాడు. కొన్ని సార్లు రెండుమూడురోజుల దాక అపూర్వ ఉన్న ఫ్లాట్ కి వెళ్ళడు. అతను రావటం లేదని తెలిసిన అపూర్వ మాత్రం మామూలుగానే ఉన్నట్లు , తన ఆఫీస్ పని, ఆ తరువాత భవ్య తో సాయంత్రాలు ఉల్లాసంగ గడుపుతూనే ఉన్నది.

ప్రసాద్ కి ఇలా నటించే ఓపిక తగ్గిపోసాగింది, చూస్తుండగానే ఏడాది తిరిగిపోయింది. మ్యారేజ్ యానివర్సరీ ని చంద్రమౌళి బాగా గ్రాండ్ గ జరిపించాడు. అవన్నీ చూస్తుంటే ప్రసాద్ కి ఈ నిజం ఎక్కువ రోజులు దాచటం కష్టమేమో అనైతే అనిపిస్తూనే ఉన్నది.  అదే విషయం ఎలీషా తో టి అన్నాడు,   “ఎలీషా!ఇలా ఎంత కా లం నన్ను నటించమంటావు. ఇందులోనుండి బయటపడే మార్గం ఉంటె చెప్పు,” అని.

“ దీని కొక్కటే మార్గం ప్రసాద్, నువ్వు దూరంగా వెళ్లిపోవడమే,” అంది.

“ అంటే.”

“ నువ్వీ వూరునుండి దూరంగా వెళ్ళిపోతే కొంతకాలమయిన నీకు మనశాంతిగా ఉంటుంది.  మా వారు చెప్పారు వాళ్ళ కంపెనీ లో ప్రొడక్షన్ మేనేజర్ పోస్ట్ ఉన్నదని. నువ్వు  కావాలంటే మా వారితో మాట్లాడు,” అన్నది ఫోన్ కలుపుతూ.

“ హలో జాన్, ఎలా ఉన్నారు. మీ కంపెనీలో ఎదో పోస్ట్ ఉన్నదని తెలిసింది, నాకు వివరాలు చెబుతారా,”

“సరే ప్రసాద్, నీకు నేను మా ఆఫీస్ వెకన్సీస్ లింక్ షేర్ చేస్తాను , అందులో అన్ని డీటెయిల్స్ తో పాటు అప్లికేషన్ కూడా ఉన్నది. కాకపోతే ఇది టూరింగ్ జాబ్. ఆంధ్ర లో మా కొత్తప్రాడెక్ట్స్ ని  ప్రమోట్ చేయాలి. అక్కడ ఉంటూ ఆ స్టేట్ లో ఈ ప్రాడెక్ట్స్ ని ప్రమోట్ చేయాలి, సాలరీ  తో పాటె ఇతర పర్క్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ కి టీమ్ హెడ్ ని నేనే . నీకు నచ్చితే చెప్పు సాలరీ డిస్కస్ చేద్దాము,” అంటూ చెప్పాడు.

లింక్ ఓపెన్ చేసి వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ తో పా టు జాబ్ ప్రొఫైల్ కూడా బాగుండడంతో , ప్రసాద్ వెంటనే అప్లై చేసాడు. ఒక నెల కల్లా  జీతం  1. 5 లాక్ విత్ పెర్క్స్ ,  హౌస్ రెంట్ అలోవెన్స్ తో సహా  కంఫర్మ్ అయి , ఆంధ్ర స్టేట్ మొత్తని కి కంపెనీ తరఫున మార్కెటింగ్ మేనేజర్ గా సెలెక్ట్ అయ్యాడు.  ఒక నెల నోటిస్ ఇచ్చాడు తను  ప్రస్తుతం చేస్తున్న  జాబ్ కి. రిలీవ్ అయిన వెంటనే అపూర్వ వాళ్ళింటి కెళ్ళి ,” ఆంటీ , నాకు కొత్త జాబ్ వచ్చింది. నేను రేపే వెళ్లి జాయిన్ అవుతాను ఆంధ్ర లో. అకామడేషన్ దొరకగానే మీకు చెబుతాను. మీతో ఫోన్లో టచ్ లోఉంటాను,” అన్నాడు. “మరి అపూర్వ?” సుమతి అడిగింది.

“ ఎం పర్లేదు అంటి , మా కంపెనీ హెడ్ ఆఫీస్ ఇక్కడే. నేను రిపోర్ట్ చేయడానికి ఇక్కడికే రావాలి. తరచూ వస్తూనే ఉంటాను. మీరేమి బెంగ పడకండి, “ అని చెప్పి, తన పాత  ఫ్లాట్ కి వెళ్లి ప్యాకింగ్ చేసు కొని, అపూర్వ కి చెప్పాలనుకోలేదు కనుక,  రాత్రికి రాత్రే మెడ్రాస్ నుండి విజయవాడ కి బయలుదేరాడు.  కొద్దిరోజులుండి తన మకాం తెనాలికి మార్చుకున్నాడు. కొంత కాలమయినా అజ్ఞాతం లో గడపాలని.

(ఇంకావుంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

…అనుభూతులు…

హైమావతి పాటలు