మహాభారతంలో ఎక్కువ ప్రాచుర్యం పొందని స్త్రీ పాత్రలు:-

మాద్రి:- ‘మద్ర ‘దేశాన్ని పాలించిన రాజు శల్యుడు. శల్యుని సోదరి మాద్రి. మద్ర దేశపు యువరాణి కాబట్టి ఈమె పేరు మాద్రి అని పిలువబడింది. మాద్రి అత్యంత అందాల రాశి. పాండురాజు మద్ర దేశాన్ని జయించినప్పుడు మాద్రిని వివాహం చేసుకున్నాడు. కాని,
‘ కిందమ’ ముని చాప కారణంగా పాండురాజు మరణిస్తాడు అప్పుడు మాద్రి తన కుమారులైన నకుల, సహదేవులను కుంతీదేవికి అప్పగించి సహగమనం చేస్తుంది.
హిడింబి :- మహాభారతంలో చాలా తక్కువగా కనిపించినా ఎంతో ఎక్కువ ప్రభావాన్ని చూపిన పాత్ర ‘హిడింబ’ . హిడింబ భర్త భీముడు. ఘటోత్కచుని తల్లి. అనుకున్న రూపాన్ని ధరించగల కామరూప విద్య తెలిసిన స్త్రీ . భూత భవిష్య వర్తమాన కాలాల గురించి చెప్పగల విజ్ఞాని . కురుక్షేత్ర యుద్దంలో కౌరవులకు ఎక్కువ నష్టం కలిగించిన వారిలో ఘటోత్కచుడు ఒకడు. అంతేకాదు కర్ణుడు అర్జునుని మీద ప్రయోగించడానికి దాచుకున్న “వాసవశక్తి” అస్త్రాన్ని తన మీద ప్రయోగించేలా చేసుకున్నాడు ఘటోత్కచుడు. అలా అర్జునుడి ప్రాణాలను కాపాడడానికి తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్ప కొడుకును కన్నది హిడింబ.
అంతేకాదు లక్క ఇంటి కుట్ర నుంచి తప్పించుకున్న పాండవులు పారిపోయి ఒక వనం చేరుకుంటారు, ఆ వనం పేరు ‘హిడింబవనం’ .ఆ వనంలో నివసిస్తున్న రాక్షసుడు హిడింబాసుర . ఇతని చెల్లెలే హిడింబ.హిడింబ వనంలో వస్తున్న నరవాసన చూసి వాళ్ళని చంపి తనకు ఆహారం కోసం తెమ్మని చెల్లెలు హిడింబ ను పంపుతాడు. అక్కడ పాండవులను చూసిన హిడంబ , వాళ్ళలో నిద్రపోతున్న భీముని పై మొహంతో ‘కామరూప ధారణ’ వచ్చు కాబట్టి మామూలు స్త్రీ రూపం దాల్చి భీముని దగ్గరికి వెళ్లి తనను పెళ్లి చేసుకుంటే తన అన్న మిమ్మల్ని ఎవరిని చంపడం అని చెబుతుంది. అప్పుడు భీముడు తన వాళ్ళని రక్షించుకోవడానికి ఏమైనా చేస్తానంటాడు. అయితే,నేనే వీళ్ళందర్నీ రక్షిస్తానని అంటుంది. హిడిబాసురుడు చెల్లెలు తో బాగా దెబ్బలాడుతాడు. తర్వాత హిడింబాసురునికీ భీమునికి యుద్ధం జరిగి భీముని చేతిలో హిడింబాసురుడు మరణిస్తాడు. కుంతి హిడింబను చేరదీసి బీమునితో వివాహం చేస్తుంది.హిడింబ అసలు పేరు ‘కమలపాలిక’. పాండవులలో మొదట వివాహమైంది భీమునికి హిడింబతోనే . అందుకే పెద్ద కోడలు హిడింబ నే. పని మహావీరుడైన ఘటోత్కచుడు రాక్షస అంశ కనుక పుట్టిన వెంటనే పెరిగాడు ఆ తర్వాత పాండవులతో హెడింబా హస్తినకు వెళ్లలేదు కొడుకును తీసుకొని కామాఖ్య అరణ్యంలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇద్దరం వస్తామని పాండవులకు చెబుతుంది ఆ తర్వాత హెడుంబ కథ ఎక్కడ కనిపించదు.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతీయ ఋషి పరంపర

Restory of Harmony