వెలిగిపోతున్నాననే
భ్రమలో నీవు
చమురున్నంతవరకనే
వాస్తవంలో నేను !
చీకటిని తరిమేసాననే
భ్రాంతిలో నీవు
వెలుగున్నంతవరకనే
యధార్ధంలో నేను !
భ్రమ, భ్రాంతిల మధ్య
సజీవ దృశ్యం కోసం నీవు
వెలుతురు, చీకటిల మధ్య
అదృశ్య తెర స్పృశిస్తూ నేను !
వెతుకులాటలో ఇద్దరమూ
అమర సశేషులం
బతుకు పోరులో ఇద్దరం
సమర సైనికులం !