(ఇప్పటివరకు : అపూర్వ తోటి పరిచయం పెళ్ళికి దారితీస్తుంది. అపూర్వ కి భవ్య తోటిస్నేహ సంబంధం కాస్త తేడాగా ఉంది. ఎంగేజ్మెంట్ రోజున ప్రసాద్ కంటే ముందే భవ్య అపూర్వకి రింగ్ తొడుగుతుంది. ప్రసాద్ కి అపూర్వ కి పెళ్లి జరిగి పోతుంది. ఫస్ట్ నైట్ ప్రహసనం లో అపూర్వ జీవితం లో ఇంకెవరో ఉన్నారన్న అనుమానం వచ్చింది ప్రసాద్ కి.)
ఏమి జరగనట్లే అపూర్వ సౌమ్యంగా చూస్తూ, గల గల కబుర్లు చెబుతూ మధ్య మధ్య లో తన పళ్ళెంలోని పూరి ముక్కల్ని కుర్మా తో ప్రసాద్ నోట్లో పెట్ట సాగింది. ప్రసాద్ ఆపాలనుకున్న ఆమె ఆగకుండా అలాగే చేస్తూ, అతని ప్లేట్ తన ముందుకి లాక్కుని తాను తినేస్తూ సందడి చేసింది. బ్రేక్ఫాస్ట్ అవగానే, “ప్రసాద్, మనం కాసేపు బైక్ మీద ఊరంతా చక్కర్ కొట్టి ఇంటికెళదాము,” అంటూ చాల గోముగా అడిగింది.
ఆమె నటిస్తున్నద ని తెలిసిన ఆమె తనంతట తాను చెప్పే వరకు అడగకూడదని , ఆమె చెబుతున్నదల్లా తాను కూడా వింటున్నట్లు కూర్చున్నాడు. బిల్ పే చేసాక , రూమ్ వెకేట్ చేసి , బయటపడ్డారు. బయట బైక్ దాక వచ్చాక , ‘నేను వాష్రూమ్ కెళ్ళి వస్తాను’ అంటూ ప్రసాద్ మళ్ళీ రెస్టారెంట్ లోకి వెళ్ళాడు. అపూర్వ బయటే నుంచుని ఫోన్ లో మాట్లాడుతున్నది. అది గమనించి ప్రసాద్ రిసెప్షన్ దగ్గర కెళ్ళి ,” భాయ్ , నిన్న మా రూమ్ కి రెండు రూమ్స్ కి అవతల ఉన్న రూమ్ ని ఎవరు బుక్ చేసారో చెప్పగలవా ,” అన్నాడు.
“ సరే సర్ ,” అంటూ రిజిస్టర్ తెరిచి చూసాడు. “ సర్, ఆ రూమ్ మిస్ . భవ్య కుమార్ పేరున బుక్ అయింది సర్,” అన్నాడు.
“ఆమె డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా,” అన్నాడు.
ఆమె ఆధార్ కార్డు ఉంది సార్ ,అంటూ ఒక ఫైల్ నుండి ఆమె ఆధార్ ఫోటోకాపీ చూపించాడు.
“నోడౌట్, ఇది భవ్య ఫోటోనే,” అనుకుంటూ పిడికిలి బిగించి తన అసహనాన్ని దాచుకున్నాడు. “ ఒకే , థాంక్స్ అన్న,” అంటూ చేయి కలిపాడు.
వాడు సంతోషంతో,” ఈ మేడం, మీ మేడం చాలా సార్లు మా రెస్టారెంట్ లో రూమ్ బుక్ చేసుకుంటుంటారు సార్, “ అని ఎదో మర్మ తెలిసినట్లు చెప్పాడు.
“అవునా,” అంటూ, “ఆమె తనకి బెస్ట్ ఫ్రెండ్ లే ,” అంటూ అక్కడి నుండి వెనక్కి మళ్ళాడు. మనసులో అనుకున్నాడు, “అందుకే మీకు ఏ ఫైవ్ స్టార్ లో బుక్ చేయమంటారు మీ రూమ్,” అని చంద్రమౌళి గారు అడిగినప్పుడు ఠక్కున , ఈ హోటల్ పేరు చెప్పింది అపూర్వ. తను ఇంకొంత తెలుసుకోవాలి , అప్పుడే ఏ విషయమయిన క్లియర్ అవుతుంది అనుకుంటూ అన్యమనస్కంగానే బైక్ స్టార్ట్ చేసాడు. ఎప్ప్పటిలాగే దారిపొడవునా అపూర్వ అల్లరి చేస్తూనే ఉన్నది. ప్రసాద్ కి మనస్కరించలేదు తనతోటి అలా ఎంజాయ్ చేయాలనీ. మౌనంగానే ఉన్నాడు.
మధ్యాన్నానికల్లా అపూర్వ వాళ్ళింటి కి చేరుకున్నారు. అప్పటికే సుమతి , చంద్రమౌళి గారు ఎదురు చూస్తున్నారు వీళ్ళ కోసం. ప్రసాద్ డల్ గా ఉండడం సుమతి గమనించి అడగాలని కుంది, కానీ అపూర్వ ముందు వద్దని ఊరుకున్నది.
భోజనాలవగానే అపూర్వ, “ప్రసాద్ నేను బాగా అలిసి పోయాను , నాకు నిద్దరవస్తున్నది” అంటూ తన రూమ్ లోకెళ్ళి తలుపేసుకున్నది.
సుమతి ఎదో అనబోతుంటే,” పర్లేదు అంటీ , నేను బుజ్జి రూమ్ లో రెస్ట్
తీకుంటాను,”అంటూ లేచెళ్లిపోయాడు.
కొందరు బంధువులుండడం తో చంద్రమౌళి గారు కూడా ఏమి మాట్లాడ లేదు. సాయంత్రానికల్లా ఇంట్లో ఉన్న బంధువులు కూడా వెళ్లి పోయరు . ఆరు గంటల వేళ ప్రసాద్ , లివింగ్ రూమ్ లోకొచ్చి కూర్చున్నాడు. పకోడీలు టీ తెచ్చి పెట్టింది సుమతి. కొద్దీ సేపయినా తరువాత అపూర్వ కూడా వచ్చి కూర్చుంది ప్రసాద్ పక్కనే. ఆమె ప్రవర్తన తో ఎవ్వరు ఏమి అడగ కుండా జాగర్త పడుతున్నట్లనిపించింది ప్రసాద్ కి. కొద్దీ సేపు పిచ్చ పాటి కబుర్లు అయిన తరువాత , సుమతి అడిగింది,” ప్రసాద్ మీరు కావాలంటే మాతో నే ఉండి పోవచ్చు , మీరు మీ అపార్ట్మెంట్ ఖాళీ చేసేసి ఇక్కడికే రండి అందరం ఇక్కడే ఉందాము ,” అన్నది.
అపూర్వ గబరాట్టుగా,”ఎందుకు , మామ్, ప్రసాద్ ఫ్లాట్ తీసుకున్నాడు కదా మేము అక్కడే ఉంటాము. ఇప్పుడే కదా మాకు ఏకాంతం కావాల్సింది. అక్కడయితే ఇద్దరమే ఎంజాయ్ చేయొచ్చు మా లైఫ్ ,” అంటూ చెప్పేసింది. “నువ్వేమంటావు ప్రసాద్ ,” అంది.
“ప్రసాద్ ఏమంటాడు. ఎప్పుడయినా నీ మాట కాదనటం ఇన్ని రోజులలో మేము ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు మాత్రం కాదంటాడా,” అంటూ చంద్రమౌళి అన్నాడు చిరునవ్వుతో. అన్ని వాళ్లే అనుకుంటున్నారు. ప్రసాద్ మౌనంగా ఉన్నాడు.
“అయితే మంచి రోజు చూసి అపూర్వ ని కాపురానికి పంపిస్తాము,” అంది సుమతి. తలాడించాడు ప్రసాద్. కానీ మనసంతా సమాధానం దొరకని అనేక ప్రశ్నలతో నిండి పోయింది. అక్కడ ఉన్న కొద్దీ రోజులు అపూర్వ ఏదొక వొంక చెబుతూ ప్రసాద్ ని తన రూమ్ లోకి గాని, తనకి క్లోజ్ గా గాని రానివ్వ లేదు. కొంత అర్ధమవటం తో ప్రసాద్ కూడా దూరంగానే ఉన్నాడు. ఎక్కువ మాటలు కూడా కలపటంలేదు ఎవ్వరితోను. అతని ఉదాసీనత అర్ధమవుతున్న కూడా సుమతి వాళ్లిద్దరూ కలిసుంటే అన్ని సర్దుకుంటాయిలే అని అనుకున్నది.
నాలుగు రోజుల తరువాత ప్రసాద్ ఆఫీస్ కి బయలుదేరాడు. “ అపూర్వ ఆఫీస్ కి రెడీ అయ్యావా ,” అడిగాడు. అప్పుడే నైటీ లో అక్కడి కి వచ్చిన అపూర్వ,” లేదు ప్రసాద్ , నేను ఇంట్లోనే ఉంటాను. నేను ఆఫీస్ కి రావటం లేదు,” అంది.
మారుమాట్లాడకుండా ప్రసాద్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు.
ఆఫీస్ కి చేరగానే కలీగ్స్ అందరు చుట్టూ చేరారు,” ప్రసాద్ , కంగ్రాట్స్. పార్టీ ఎప్పుడు అంటూ ,” హంగామా చేసేసారు.
“సరే సరే పార్టీ చేసుకుందాము మీరే డిసైడ్ చేయండి,” అన్నాడు. అందరు ఆ రోజే లంచ్ ఇవ్వాలని పట్టు పట్టారు.
“అపూర్వకి ఫోన్ చేయి ప్రసాద్, తాను కూడా వస్తుంది,” అన్నాడు బాస్.
“తను రాదేమో కదా1” అంది అనుమానంగా ఎలీషా.
“ఒకే ఒకే , నేను ప్రయత్నిస్తాను,” అంటూ తన సీట్ దగ్గరికెళ్ళాడు. కొద్దీ సేపయ్యాక తన పక్కనే ఉన్న కాబిన్ లో పనిచేస్తున్న ఎలీషాను చూసి ,” ఎలిషా, కాంటీన్ కెళ్ళి కాఫీ తాగేసి వద్దాము,” అంటూ చెప్పాడు.
ఎలిషా, ప్రసాద్ కాంటీన్ దగ్గరికెళ్ళారు.
ప్రసాద్ ,ఎలిషా కాంటీన్ కెళ్ళి కాఫీ చెప్పి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు.
“ఎలిషా! నువ్వు ఎందుకలా అన్నావు అపూర్వ రాదేమోనని?” ప్రసాద్ అడిగాడు.
“ఊరికే అన్నాను ప్రసాద్ , పట్టించుకోకు , తనకి కాల్ చేయి,” అంది.
“కాదు. ఇంకేదో నీకు తెలుసు. నాకు చెప్పటానికి ఇబ్బంది పడుతున్నావేమో ననిపిస్తున్నది. ఎలిషా ! నాకు కొంత అర్ధమయింది. నీకు అపూర్వ గురించి ఏమయిన తెలిసుంటే నాకు చెప్పు, ప్లీజ్!” అని ప్రాధేయ పడ్డాడు.
అపూర్వ విషయం ఇంకా దాచటం వలన ప్రసాద్ కి ఏమి మంచి జరగదు అనుకొంటు , “ప్రసాద్ , అపూర్వ , ఒక నెల క్రితం తన జాబ్ కి రిజయిన్ నోటిస్ ఇచ్చింది. నీకు తెలుసా,” అంటూ అడిగింది.
“లేదు ,” అన్నాడు ఆమె చెప్పేది వినటానికి సిద్దమవుతు.
“అపూర్వ , భవ్య కలిసి ఒక అమెరికన్ ఎం ఎన్ సీ కి జాబ్స్ కోసం అప్లై చేసారు.”
“వాళ్ళకి ఆ జాబ్స్ దొరికాయి, కానీ ముందు రెండేళ్లు కానీ, మూడేళ్లు కానీ ఇండియా లో పని చేసిన తరువాత వాళ్ళకి అమెరికా లో పోస్టింగ్ వస్తుంది. అందుకని వాళ్లిద్దరూ చెన్నై లోని బ్రాంచ్ లోనే చేయడానికి అగ్రిమెంట్ కూడా ఇచ్చారు . జీతం కూడా ఎక్కువే,” చెప్పింది.
“మంచిదేగా, కానీ ఆ విషయం ఇప్పటివరకు నాతో చెప్పలేదు. ఎందుకని,” అనుమానంగా అడిగాడు.
“ నీ అనుమానం నాకంటే బాగా అపూర్వే తీర్చగలుగుతుంది ప్రసాద్. ఒక్కటి మాత్రం చెప్పగలను. అపూర్వ , భవ్య వాళ్ళ స్నేహ బంధం లో చాలా ముందుకెళ్ళిపోయారు. భవ్య మాన్ – అపూర్వ షీ. ఇంతకంటే వివరంగా చెప్పలేను. ఆమె నిన్ను ఎందుకు పెళ్లి చేసుకుంది అనేది చిక్కు ప్రశ్న, అది నువ్వే తెలుసుకోవాలి ” అన్నది ఎలిషా.
మనసులో ముసురుకొన్న మబ్బులు ఒక్క సారిగా విచ్చుకున్నట్లయింది. కానీ మరి పె ళ్లేందుకు చేసుకుంది. తనతో అచ్చు ఒక మంచి అమ్మాయి లాగా , తనంటే పిచ్చి ప్రేమ ఉన్నదానిలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నది, కొంత అర్ధమయినట్లు కొంత అర్ధం కానట్లు గా ఉన్నది.
“ఆమెకి భవ్య కి అలాటి సంబంధం ఉంటె, ఇంతకాలం నాతో చనువుగా ఎందుకుంది? అలాటి స్వభావం ఉన్నట్లయితే వాళ్ళకి మెన్ పట్ల ఇష్టం ఉండదు కదా,” అడిగాడు ప్రసాద్.
“అలాఉండాలని ఏమి లేదు ప్రసాద్, అపూర్వ అమ్మాయి మనసుతోనే ఉన్నది, భవ్య పట్ల ఆకర్షణ విపరీతం, “but some are sexullay attracted to both sexes.” అందుకే అపూర్వ నీతో కూడా చనువుగా ఉండగలుగుతుంది. కానీ కొంత కాలం తరువాత ఆమె ఎవరితో ఉండాలి అనేది కూడా నిర్ణయించుకోవచ్చు.” వివరించింది ఆమె.
“ఈ విషయం వాళ్ళ తల్లి తండ్రులకి తెలుసుంటుందా.”
“Of course not, అపూర్వ వాళ్ళ నాన్నకి గా ని అమ్మకి గాని తెలిసుంటే పెళ్లి దాక వచ్చేదికాదు. ఇప్పుడే నువ్వీ విషయం మాత్రం వాళ్ళకి చెప్పొద్దు. కొంతకాలం వేచి చూడు. అపూర్వ మనసు విప్పి నీకు ఏమి చెబుతుందో. అప్పుడే ఒక నిర్ణయానికి రావడం మంచిదని నా అభిప్రాయం,” అంటూ ప్రసాద్ వైపు చూసింది.
“అవును ,ఎలీషా , నువ్వు చెప్పింది కరక్టే. సమస్య త్వరగా మొదలవుతుంది మనకు తెలియకుండానే. కానీ పరిష్కారం కోసం మాత్రం మనమే అన్వేషించాలి. మన ఈ ప్రయత్నం ఎడారిలో ఉండే నీటి చెలం కోసమయితే, చెప్పలేం.” అన్నాడు కాస్త నిస్పృహగ. ప్రసాద్ చేతిమీద చేయి వేసి దైర్యం చెబుతున్నట్టుగా చూస్తూ ఉండిపోయింది ఎలీషా.
ఇద్దరు తిరిగి ఆఫీస్ లోకి వచ్చారు. చాల రోజుల పని పెండింగ్ అవటం తో అన్యమనస్కం గానే పనిమొదలెట్టాడు ప్రసాద్.
అటెండర్ వచ్చి “సార్ కాంటీన్ లో స్పెషల్ లంచ్ కి ఆర్డర్ ఇచ్చాను సార్,” అన్నాడు.
“ఓకే. ఎన్నింటికి తయారవుతుంది,” అడిగాడు.
“లంచ్ టైం కల్లా రెడీ అవుతుందని చెప్పమన్నాడు సార్,” అయితే సరే, అందరికి 2.30 కల్ల కాంటీన్ కి లంచ్ కి రమ్మన్నానని చెప్పు,” అన్నాడు. అటెండర్ వెళ్ళిపోయాడు.
కరెక్ట్ గా అపూర్వ 1.30 కల్ల ఆఫీస్ కొచ్చింది. ప్రసాద్ కి చాల ఆశ్చర్యమయింది. వెనకా తలే భవ్య కూడా. “ హాయ్ ప్రసాద్ , నేను లేకుండానే నువ్వు పార్టీ ఇద్దామనుకున్నావా?” అంటూ దగ్గరకొచ్చింది అపూర్వ.
భవ్య బాస్ రూమ్ లోకి వెళ్ళింది. “అదేం లేదు అపూర్వ, నువ్వు ఆఫీస్ కి రానన్నావు కదా! అందుకనీ నేను రాగానే అందరు అడిగారు. కాదనలేక పోయాను.,” అన్నాడు.
“భవ్య కి ,దాని ఫ్రెండ్ ఫోన్లో చెప్పింది నువ్వు లంచ్ ఇస్తున్నావని, పైగా మమ్మల్ని రమ్మని బాస్ కూడా ఫోన్ చేసాడు, అందుకే రాక తప్పలేదు,” అన్నది.
“సింప్లి సూపర్బ్,” అన్నాడు నవ్వుతు. “అమ్మయ్య అబ్బాయి గారు దారిలోకి వచ్చారు అంటూ,అటు ఇటు చూసి , ప్రసాద్ బుగ్గ మీద కిస్ చేసి, తాను కూడా బాస్ రూమ్ లోకి వెళ్ళిపోయింది.
“లంచ్ కి అందరు కాంటీన్ లో చేరారు. బాస్ కేక్ తెప్పించాడు ఆఫీస్ తరఫున. కేక్ కటింగ్ చేసారు ప్రసాద్ అపూర్వ. భవ్య వాళ్ళిద్దరికీ తినిపించింది. అప్పుడు బాస్,” “డియర్ కలీగ్స్ , ఒక స్మాల్ అనౌన్సమెంట్. భవ్య , అపూర్వ ఇద్దరు అమెరికన్ ఎం ఎన్ సీ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ రోజే వాళ్ళు రిలీవ్ కూడా అవుతున్నారు. ఒక విధం గ ఇది వాళ్ళిద్దరికీ ఫెర్వెల్ పార్టీ కూడా. అల్ థ్ బెస్ట్ బోథ్ అఫ్ యు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్,” అంటూ అందరి తరఫున అభినందనలు అందచేశాడాయన.
ఆయన చెప్పిన తరువాత ప్రసాద్ మొహం లోకి చూసింది అపూర్వ కొంచం భయం గా. కానీ ప్రసాద్ నిర్లిప్తం గ ఏమి జరగనట్లుండడంతో ఆమెకి ధైర్యం వచ్చినట్లయింది.
(ఇంకావుంది)