ప్రాచీన భారతదేశ ఖగోళశాస్త్రవేత్తలు-సూర్యగ్రహణం -చంద్రగ్రహణం

వేదకాలంలో ప్రాచీనవేదాలలో (1500-500బి సి ఇ ) ముఖ్యంగా ఋగ్వేదంలో నక్షత్రాలు మరియు తారల కదలికలపై ప్రస్తావనలు ఉన్నాయి. ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులు అయినటువంటి ఆర్యభట్ట, బ్రహ్మగుప్త వరాహమిహిర భాస్కర1 భాస్కర 2లల్ల, గార్గ, లఘద ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం, కాలమానం వంటి రంగాలలో విశేషంగా కృషి చేసారు వారి పరిశోధనలు భారతదేశంలో మాత్రమేకాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రభావం చూపాయి.
ఆర్యభట్ట తన రచన ఆర్యభటీయలో భూమి తన అక్షం చుట్టూ తిరుగుతుంది అని ప్రతిపాదించారు. సౌర సంవత్సరాన్ని 365,358 రోజులని ఖచ్చితంగా లెక్కించారు. హెలియో సెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అందులో గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయని చెప్పారు. త్రికోణమితి (TRIGONOMETRY) sine function కి సంబంధించిన పట్టిక రూపొందించాడు.
 బ్రహ్మగుప్త (598-668CE) బ్రహ్మస్ఫుత సిద్ధంతం అనే రచనలో గురుత్వాకర్షణను గుర్తించి, అది ఆకర్షణ శక్తి అని చెప్పాడు. గ్రహాల చలానాలు, గ్రహణాలు మరియు ఇతర ఖగోళ సంభవితాల లెక్కింపులు చేసారు. గణితం మరియు బీజగణితం (arithmetics) లో మనము నేడు వాడుతున్న సూత్రాలనుపరిచయంచేసారు.
వరాహమిహిర (505-587CE ) బృహత్సంహిత, పంచసిద్ధాంతికాలను రచించాడు. బృహత్సంహిత అనీదిఖగోళ శాస్త్రం, భౌగోళికం, వాస్తుశాస్త్రం వంటి వివిధరంగాలలోనూ అవగాహనా కలిగించే రచన. చంద్రుడు మరియు గ్రహాలు సూర్యరశ్మిని ప్రతిబింబిస్తాయని చెప్పాడు.
భాస్కర ( 600-608CE ) తన రచనాలయినటువంటి మహాభాస్కరీయా, లఘుభాస్కరీయా లో గ్రహచలనం మరియు గ్రహణాలమీద విశ్లేషణ చేసారు.
భాస్కర2 (1114-1185CE ) రచనలయినటువంటి సిద్ధాంత శిరోమణి, లీలావతి యందు ఖగోళశాస్త్రం మరియు గణిత శాస్త్రంలో ప్రత్యేకమయిన కృషిచేసి భూమి సూర్యుని చుట్టూ ఒక సంవత్సరం తిరురగటానికి 365,2588 రోజులు అవసరం అని చెప్పారు. ఇది సరికొత్త లెక్కలకి సమీపంగా ఉంది. గ్రహాల స్థానాలు, గ్రహణాలు, మరియు చంద్రుని దశాలపై వివరాలు ఇచ్చారు.

లల్ల(8 శతాబ్దం CE ) తన రచన రచన శిష్యాధివిధిదాతంత్రి యందు గ్రహచలనం మరియు గ్రహణాల లెక్కింపులో కృషిచేశారు.

 గార్గ (1వ శతాబ్దం BCE ) జ్యోతిషం మరియు ఖగోళ శాస్త్రం మీద గర్గ సంహిత పేరుగల రచన జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమయినది.
లఘద తన రచన అయినటువంటి వేదంగా జ్యోతిషంలో వేదం సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని కాలం లెక్కించే పద్ధతులను రూపొందించారు . భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనలు మధ్య యుగంలో ఇస్లామిక్ ఖగోళ శాస్త్రాన్ని ప్రభావితం చేసాయి. తద్వారా రేణైస్సాన్స్ కీలక పాత్ర పోషించాయి. ‘సూర్యసిద్దాంత’ వంటి గ్రంథాలు త్రికోణమితి ( trigonometry | విధానాలుమారియు గ్రహాల చలనాల లెక్కింపులను పరిచయం చేసాయి.ఇవి తరువాత అభివృద్ధి చెందాయి.

సూర్యగ్రహణం:
సూర్యగ్రహణం ప్రాచీనకాలం నుండి ఖగోళ శాస్త్రజ్ఞుల ఆసక్తికరమయిన ఒక ముఖ్యమయిన అంశం. సూర్యగ్రహణం అంటే చంద్రుడు,భూమి మరియు సూర్యుని మధ్యలోకి రావడంవల్ల సూర్యకాంతి పూర్తిగా లేదా కొంతవరకు భూమిని చేరుకో పోవటం. ఇది నేడు మనకు సులభంగా అర్ధమవుతున్నా, ప్రాచీనకాలంలో ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడం పెద్ద సవాలుగా ఉండేది.

సూర్యగ్రహణం గురించి ప్రాచీన భారతీయ విజ్ఞానం:
భారతీయ ఖగోళ శాస్త్రంలో, గ్రహణాలు గురించి వివరాలు ప్రాచీన పదాలలో ముఖ్యంగా “వేదంగా జ్యోతిషం” వంటి పాత గ్రంథాలలో ఉన్నాయి. ఆర్యభట్ట వంటి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం కి గల శాస్త్రీయ కారణాలను సరిగా అర్ధం చేసుకున్నారు. ఆర్యభట్ట తన రచన ఆర్యభట్టీయం లో గ్రహణాలు శాస్త్రీయ విధానాన్ని వివరించారు. ఆయన ప్రతిపాదన ప్రకారం సూర్యగ్రహణం చంద్రుడు, భూమి, మరియు సూర్యుని మధ్యలో ఉన్నప్పుడు సంభవిస్తుందని చెప్పటమేకాక ఆ కాలంలో, సూర్యగ్రహణం గురించి చాలా వాస్తవాలు ప్రజలకు సూర్యుడు, చంద్రుడు గ్రహాలయొక్క శాస్త్రీయశాస్త్రీయ చలానాలతో వివరిస్తూ భయాలకు అడ్డుకట్ట వేశారు. బ్రహ్మగుప్త “బ్రహ్మస్ఫుత సిద్ధాంత” లో గ్రహణాలు సున్నితంగా అర్ధంచేసుకున్నారు. ఆయన గ్రహణం పూర్వ పూజలు, యోగాలు మాత్రమే కాకుండా శాస్త్రీయంగా కూడా విచారణ చేయడం ప్రారంభించారు. భారతీయ పురాణాలలో మరియు ఇతిహాసాలలో సూర్యగ్రహణం గురించి కొన్ని మానసిక ప్రతీకలు ద్వారా వివరించారు. ‘రాహు’ మరియు ‘కేతు’ అనే రెండు నక్షత్రాలు సూర్యుడు లేదా చంద్రుడు నింగిలో నీల్చడం వల్ల గ్రహణం ఏర్పడుతుంది అని పురాణాలలో ప్రస్తావన ఉంది. అయితే ఈ ప్రాచీన కల్పనలను తర్వాత ఖగోళ శాస్త్రజ్ఞులు శాస్త్రీయంగా సరిచేశారు. సూర్యగ్రహణం అనేది ప్రాచీఈయన భారతీయ ఖగోక శాస్త్రంలో ఒక ముఖ్యమయిన విప్లవాత్మక ఆవిష్కరణ. భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు సూర్యగ్రహణాలను పూర్తిగా అర్ధంచేసుకోవడం ద్వారా ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ సిద్ధాంతాలను బలపరిచారు. తద్వారా ప్రపంచ ఖగోళ శాస్త్రానికి మార్గం చూపారు.

 చంద్రగ్రహణం

ప్రాచీనఖగోళశాస్త్రజ్ఞులు చంద్రగ్రహణం పై శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రీతిలో పరిశీలనలు చేసారు. ఖగోళశాస్త్రపరంగా,చంద్రగ్రహణం అనేది భూమి. చంద్రుడు మరియు సూర్యుని సంబంధం వాళ్ళ జరిగే ఒక ప్రక్రియ. చంద్రగ్రహణం భూమి సూర్యుడు మరియు చంద్రుని మధ్యలో రాగానే, భూమియొక్క నీడ చంద్రునిపై పడడం వాళ్ళ ఏర్పడుతుంది. ఆర్యభట్ట “ఆర్యభట్టీయం” అనే గ్రంథం లో చంద్రగ్రహణం పై శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఆయన ప్రకారం భూమి తన చలనం ద్వారా సూర్యుడు మరియు చంద్రుని మధ్యలోకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. భూమికాంతిని అడ్డుకోవడంవల్ల చంద్రునిపై నీడ ఏర్పడుతుంది. ఇది గ్రహణానికి కారణం అవుతుందని ఆయన వివరించారు. ఇది ఒక సహజ ఖగోళ సంఘటన అని, దీనికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయని వివరించారు. బ్రహ్మగుప్త “బ్రాహ్లస్సుత సిద్ధాంత” అనే రచనలో చంద్రగ్రహణం పై వివరణ ఇచ్చారు. ఆయనకూడా చంద్రగ్రహణం భూమి నీడ వల్లనేజరుగుతుందని శాస్త్రీయంగా నిరూపించారు. అలాగే గ్రహణాలకు సంబంధించిన ఖగోళ చలనాలను వివరించారు. పురాణాలలో చంద్రగ్రహణం గురించి ఆధ్యాత్మిక మరియు కైవల్యమైన కథలు ఉన్నాయి. రాహువు మరియు కేతువు అనే రాక్షసులు సూర్యుడు మరియు చంద్రునిపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే పురాణకధల ప్రాచుర్యంల ఉన్నాయి. వీరు చంద్రుని గ్రహించడం వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుందని పురాణాలద్వారా ఆచెప్పబడింది. కానీ పురాణం విశ్వాసాలను శాస్త్రీయంగా ప్రాచీన ఖగోళ శాస్త్రజ్ఞులు సవాలు చేసి ఖగోళ సిద్ధాంతాలతో సహజవిజ్ఞానాన్ని ప్రోత్సహించారు.

సమన్వయం

ప్రాచీన భారతీయ ఖగోళశాస్త్రజ్ఞులు చంద్రగ్రహణం పై ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలకు శాస్త్రీయ కారణాలకు మధ్య సమతౌల్యం చూపిస్తూ ‘గ్రహణాలు సహజ ఖగోళ సంఘటనలు అని సరిగ్గా అర్ధం చేసుకున్నారు.

అనుమితి

సూర్యగ్రహణం మరియు చంద్ర గ్రహణం వంటి ఖగోళ సంఘటనలికి శాస్త్రీయ వివరణాలున్నప్పటికీ ఇవి ఇంకా సాంప్రదాయ విశ్వాసాలు. నమ్మకాల చట్రంలో ఉండిపోయాయి. సూర్యగ్రహణ సందర్భంలో చాలా సాంస్కృతికకాల్లో గర్భిణీ స్త్రీలకు ఇది హానికరమని, ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రాగూడదని ఇది గర్భస్థశిశువుకు దెబ్బ తగిలే ప్రమాదం లేదా రూపభంగాలు వచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తారు. సూర్యగ్రహణం సమయంలో హానికర రేడియేషన్ వెలువడుతుందని, దానివలన ఆహారం, నీరు పాడవుతుందని దానివలన ఆరోగ్యసమస్యలు కలుగుతాయని భావిస్తారు. జ్యోతిషం మరియు ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం, సూర్యగ్రహణం చికాకులు, సంకోక్షభం, గందరగోళాన్ని సూచిస్తుందని భావిస్తారు. సూర్యగ్రహణాన్ని అసౌకర్య సమయంగా భావించి కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించకూడదని చాలామంది నమ్ముతారు చంద్రగ్రహణం భావోద్గాగాలను పెంచుతుందని దాని ఫలితంగా ఒత్తిడి, లేదా భావోద్గగ అసమతౌల్యం కలుగుతుందని నమ్ముతారు. ముఖ్యంగా జ్యోతిషంలో చంద్రుని ప్రభావం ఉన్నవారికి ఇది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంస్కృతులలో చంద్రగ్రహణం చెడుసంకేతాలను సూచిస్తుంది. ఇది ప్రతికూల శక్తులు బలంగా ఉన్న సమయంగా భావిస్తారు. దురదృష్ట సంఘటనలు జరుగవచ్చునని నమ్ముతారు. గ్రహణసమయంలో చాలామంది ఆహారం స్వీకరించడం నీరుత్రాగటం మరియు కొన్ని పనులు మానుకుంటారు. చంద్రగ్రహణం ఆధ్యాత్మిక చీకటిని తెస్తుందని, దుర్మార్గాలను దూరంచేయటానికి ప్రత్యేక పూజలు చేయటం ద్వారా రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విశ్వసిస్తారు. సూర్య మరియు చంద్రగ్రహణలు ఆధ్యాత్మిక దృష్టికోణంలో స్వయం, మరియు ఆత్మశుద్ధికి అనుకూల సమయాలు అని భావిస్తారు. జ్యోతిషశాస్త్రంలో, కొన్ని సందర్భాలలో గ్రహణాలు పాతసమస్యలకు ముగింపు చెప్పి కొత్తప్రారంభాలు దారితీసే సమయంగా పరిగణిస్తారు. కొన్ని సాంప్రదాయాలలో గ్రహణానంతరం సుధిపూజలు చేయడం, శరీరం మరియు ఆత్మను పునరుద్ధరించుకోడానికి ఉపయోగపడుతుందని భావిస్తారు.

ఆసక్తికర విషయాలు
సూర్యగ్రహణం రెండు రకాలుగా ఉంటాయి1.. సంపూర్ణసూర్యగ్రహణం 2. పాక్షికసూర్యగ్రహణం . ఈ దిగ్విషయాల యొక్క అత్యంత ప్రసిద్ద పురాతన పరిశీలనలు కేవలంమూడు దేశాలనుండి ఉద్భవించాయి. చైనా, బాబిలోనియా మరియు గ్రీస్. ఈజిప్ట్ మరియు భారతదేశంనుండి గ్రహణ రికార్డ్స్ లేవు. మార్చ్ 3,1223 BC న సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం ఉగారిట్ నుండి మయిన విశ్వసనీయ పరిశీలన . గ్రహణాలు అప్పుడప్పుడు మనుగడలో ఉన్న యూరోపియన్ రచనలలో గుర్తింపబడ్డాయి.

ప్రస్తుత వ్యాఖ్య
2024వ సంవత్సరంలో సూర్యగ్రహణం గురించి ఎన్నో అనుమానాలున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద అమావాస్యవేళ రెండవ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటే అక్టోబర్ 2వతేదీనచివరి సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం అక్టోబర్ 2 బుధవారం రాత్రి 9.13 గంటలకు ప్రారంభమయి తెల్లవారు ఝామున 3. 17 గంటలవరకు ఉంటుంది. అంటే ఈ గ్రహణం వ్యవధి దాదాపు 6 గంటల 4 నిమిషాలవరకు ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రియల్ లో సంభవించిన సూర్యగ్రహణం మనదేశంలో కనిపించలేదు. ప్రస్తుతం ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే రెండో సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. భారతకాలమానం ప్రకారం రాత్రివేళ ఈ గ్రహణం ఏర్పడడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ గ్రహణం అమెరికా, మెక్సికో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ వంటి దేశాలలో కనుపిస్తుంది.

గ్రహణం చూసేటప్పుడు తీసుకొనవలసిన జాగ్రత్తలు:

ఈగ్రహణాన్ని నేరుగా చూడటం మంచిదికాదు. ఎందుకంటే సురుని UV కిరణాలూ సూటిగా మనకళ్ళకి తాకితే తీవ్రంగా నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఈ గ్రహణాన్ని చూసేందుకు టెలిస్కోపులు, బైనాక్యూలర్స్, ఇతర ఆప్టికల్ పరికరాలను ఉపయోగించడం మంచిది.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నేటి భారతీయమ్” (కాలమ్)

పాకశాస్త్రంలో పదనిసలు