దసరా నానీలు

1)చెడుపై జయం
దసరా ఉత్సవం
మనిషిలోని చెడుకు
పడుతుందా బ్రేక్

2)ఇంట్లో సంబరం
అంబరమంటింది
వలస పక్షులు
కొమ్మ ఒడిలోవాలాయి

3)పూజలో
ఉంటారు అందరూ
జమ్మి ఆకు మాత్రం
గడుసువాళ్లేతెంపుకుంటారు

4)పసి పలుకుల
దసరా పద్యాలు నాడు
నేడు పల్లవిస్తున్నవి
ఆంగ్లాన్ని

పప్పుబెల్లాలుఐదువరహాలు
బాల్యం గుర్తు
పోటీ చదువుల్లో
హుళక్కి

6)ఇంటికి తాళం వేసి
ఇంట్లోనే ఉన్నా
కారణం దసరామామూళ్లదండయాత్ర

7)పాలపిట్ట కోసం
బయల్దేరిన
పిల్ల బాటలు
వెతుకుతున్నా!

8)జ్ఞాపకాలు
చేదుతున్నా
దసరాలింగనాలు
తడితడి పలకరింపులు
.

Written by Gaddam Sulochana

గడ్డం సులోచన
M.A.Bed.
రంగారెడ్డి జిల్లా
S.A తెలుగు (ఉపాధ్యాయిని)
ప్రస్తుతం పని చేస్తున్నది జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల
పోన్ నెంబర్ 7702891559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇంటిికి దీపం ఇల్లాలు

ఎడారి కొలను