వింత ప్రపంచం

6-10-2024 తరుణి పత్రిక సంపాదకీయం

జిపిఎస్ పెట్టుకుని ప్రయాణాలు చేస్తున్న కాలంలో ఉన్నాం. మనుషుల జీవితాలు బొమ్మల బండి వంటి జీవితాలు అయిపోయాయి.
వాస్తవ జీవితానికి సాహసాల సంచిని కట్టుకుని తిరిగినట్టే ఉన్నది ప్రస్తుత కాలం. ఇదేమి వింత కాదు, తప్పు కూడా కాదు.నదులమీదా , సముద్రంలో వెళ్లేప్పుడు, ఆకాశంలో వెళ్ళేటప్పుడు, భూమి మీద ఎక్కడైనా ప్రయాణించేప్పుడు దారి చూపే యంత్రం GPS. Global positioning system గురించి మనిషి జీవన విధానం సమీక్షించుకోవడం అవసరమిప్పుడు. ఉపగ్రహ సహాయం లా మనదైన బుద్ధి నుంచి ఉదాహరించు కోవాల్సిన అవసరం.
శరీరం అనే యంత్రానికి మనస్సనే వాహిక తో చైతన్య స్రవంతి లా ఉండడానికి GPS లెక్కింపులకు అంటే calculate చేసే శక్తి లా ఓ receiver లా మనిషి కి బుద్ధి ఓ దిక్సూచి . దీన్నే వింత అనే మాటకు బంధీని చేయడం. విశాలత్వం లో దర్శించడం అంటూ వైరుధ్య భావాలను వ్యక్తం చేయవచ్చు.
ఆలోచన జ్ఞానం తో నలుగురిలో ప్రస్ఫుటంగా కనిపించగలిగే లా మానవ ప్రయత్నం చేయాలి. అసాధారణ రీతిలో ఉన్నవాటినీ వింత అంటాం. ఎందుకంటే వింత అనేది మూల పదం కాబట్టి.
బ్రతికి ఉంటే బలుసాకు తినొచ్చు అనే పరిస్థితి లో లేని మనుషులు కూడా అనవసరమైన భయాలను ఊహించుకోవడం ఓ వింత.

పాత ఒక వింత, కొత్త ఒక రోత. అనే సామెత ను కూడా ఇక్కడ చెప్పుకోవాలి. నూతన విషయ పరిజ్ఞానం ఎంత అవసరమో పురాతన చరిత్ర అంత అవసరం. జీవ పరిణామ క్రమం తెలిసుకుంటూ మనిషి తన ఉనికిని మరవద్దు. నేల విడిచి సాము చేయవద్దు. అత్యాశతో తనను తాను ప్రమోట్ చేసుకునే ఉద్దేశ్యం తో మనిషి ఎన్ని విధాలుగా తనను తాను రాపిడి చేసుకుంటాడో తనను తాను ఎంత దిగజార్చుకుంటాడో కూడా. ఇంత కన్నా వింత ఏముంటుంది?
అయోమయమనే తాళం కప్ప ను జ్ఞానం అనే తాళంచెవితో తీసినట్టు కళ్ళముందు ఉన్న సత్యాలను వదలి పెట్టి ఎక్కడో ఊహల్లో విహరిస్తూ తనవాళ్ళనే దూరం చేసుకుంటారు కొందరు. ఇదే వింతలో ముఖ్య భాగమైన ఆశ్చర్యం.
చేతిలో సెల్ ఫోన్ లేకుండా మనిషి మనలేని పరిస్థితులు నెలకొన్నాయి ఇప్పుడు. ఈ అవసరాన్ని దురలవాట్ల లోకి మార్చివేసుకున్న వైనాన్ని చూస్తున్నాం.ఇదే పెద్ద వింత.
వెజిటేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ అనే ఆలోచన లేకుండా మనిషి ఉంటే ఎట్లా! ఇదో వింత!! ప్రతి వ్యక్తి మూడు మొక్కలను పెంచితే స్వర్గానికి వెళ్తారని మన వేదాలలో ఉన్నదంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఏనాటి వేదాలు ఏమిటి? ఈపాటికి భూమి మొత్తం పచ్చని తల్లిలా ఎల్లకాలం కాపాడేది కదా! ఇలా ప్రకృతి ప్రకోపానికి గురికాకపోయేవాళ్ళం కదా! మనదైన సంస్కృతి సంపదను కాలరాసే వికృతం చూస్తే వింత అనుకోమూ!

వింత లో వింత ఏమిటంటే ఎదుటి వారి సంప్రదాయాలను చులకన భావం తో చూసే వాళ్ళు కూడా ఏదో ఓ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. భౌతికంగా నో మానసికంగా నో వ్యవహార శైలి లోనో! కానీ ఒప్పుకోరు. పిడివాదం అంటారే అలా పిడివాదం చేసైనా నలుగురిలో గొప్ప గా ఉండాలి అనుకోవడమే వింత!
వింత లో లోకం ఎంత మమేకమైందో తరచి చూస్తే చాలా దొరుకుతాయి. సముద్ర అడుగు భాగం, వైశాల్యం తెలుసుకోవడానికి లోతుల్లోకి వెళ్ళి పరిశోధకులు, శాస్త్ర వేత్తలు తమ తమ లాభాలు చూసుకోవడం కోసం చేయలేదు. అక్షర రూపంలో నిక్షిప్తం చేసిన ఆ త్యాగమూర్తులకు ఏమివ్వగలం కాని, వాళ్ళు తెలుసుకున్నారు తెలియజేసారు. రత్నాలు దొరకబుచ్చుకొన్న వాళ్ళ కు రత్నాలు దొరికాయి. చేపలు పట్టుకొని బ్రతికేవాళ్ళకు చేపలు దొరుకుతాయి. కానీ ఈ ఎవరి కోసమో కాదు వాళ్ళానాడు సముద్రాల లోతునూ ఆకాశం అంతునూ చూసింది. ఒక ఇష్టం ఒక పరిశోధనా తత్వం వాళ్ళ ను నడిపించింది. బలమైన లక్ష్యం ముందు విమర్శలు తలవంచుతాయి. ఇవి పట్టించుకోక నోరు పారేసుకునే వైనం వింతల్లో కెల్ల వింత! ఇన్ని ప్రపంచ వింతలు అసలు వింతలను మరుగున పడేస్తున్నాయా?

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అద్భుత చిత్రాలు

మన మహిళామణులు -వుప్పలపాటి కుసుమకుమారి.