ఉదయసంధ్యలో

కవిత

తూర్పు తెలవారింది తొలికోడి కూతవేసింది
కళ్ళు తెరచి చూసేసరకి వేకువ కిరణాలు
కిటికిగుండా లోపలికి వచ్చి నన్ను నిదురలేపాయి
అప్పు డు చూసుకున్నాను నన్ను నేను
దుమ్ము కొట్టు కుపోయిన నా మేనువై పు
నేనొక బికారినని జానెడు కడుప్పకోసం
అర్పులుచాస్తూ అలమటిస్తున్నవేళ
పంచభక్ష్య పరమాన్నం తినకపోయినా
కమ్మటి కలలకు లోటులేదు కదా
కటిక దరిద్రుడైనా సంతోషపడేది ఖర్పి లేని
కలలతోటే కదా అందుకే
నిను రాత్రి నేను కలగన్నానని కలలో రాకుమారుడినని
పంచకళ్యాణి గుర్రంమీద సవారిచేస్తూ
అందాల రాకుమారిని చేపట్టి ఆనంద డోలికలలో
తేలిపోతూ నా అంత అదృష్టవంతుడు
లేనేలేడని నన్ను నేను మైమరచిన వేళ
చాలు చాలు పగటి కలలు కంటున్న పడుచువాడా
లే లేచి నిన్ను నువ్వు తెలుసుకో
అడుగు ముందుకు వేసి నిన్ను నువ్వు మార్చుకో
బద్ధకమనే బానిసత్వం వదిలి
పరిమళించే పూలబాటను తీర్చిదిద్దుకో
అంటూ లేలేత కిరణాలు తట్టి లేపాయి
నాలో మరుగుపడిన భావాలు నిదురలేచాయి

Written by Lakshmi Sharma Trigulla

॥॥ రచయిత్రి పరిచయం॥॥

పేరు- లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
గృహిణి
భర్త పేరు- మెట్రామ్ శర్మ
(HMT రిటైర్మెంట్ )
ప్రవృత్తి –కథలు కవితలు రచనలు
4/10/2021కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ ఆద్వర్యంలో
( మబ్బులు వీడిన ఆకాశం) కథల సంపుటి
మన తెలుగు కథలు డాట్ కామ్ వారి నుండి
(30/10/2022) ఉత్తమ రచయిత్రి బిరుదు
(సందెపొద్దు గూటిలోకి) కథకు (ప్రథమ బహుమతి)
( విశిష్ట బహుమతి) ఉత్తమ కథ బహుమతి ఓకే కథకు మూడు
రావడం
వివిధ పత్రికలలో మరిన్ని కథలు ప్రచురణ జరిగింది
మీ అందరి అభిమానంతో మరిన్ని మంచి కథలు రాయాలన్నదే
నా ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్ఫూర్తివంతమైన చిత్రాలు

మితభాషి- శబ్ద సంచిక