శ్రీమద్రామాయణము

“”అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు
“””””””హేతౌ ఈర్ష్యా ఫలే నతు”””
ఇతరుల ఘనకార్యములు చూచి ఈర్ష్య పడకుండా వారు ఆ ఘనకార్యాలు ఎలా నిర్వర్వర్తిస్తున్నారని తెలుసుకొని వారివలే తానుకూడ అలా కృషి చేయుటకు పూనిక వహించవలయును.అప్పుడే ఫలసిద్ధి కలుగుతుంది

రావణాసురుడు,కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు అన్నదమ్ములే.మహా తపసంపన్నులు.కానీ వీరి తపస్సులు లోక కళ్యాణము కొరకు కాకుండగ స్వంతలాభాలకోసము చేసారు.

రామాయణము ఉత్తరకాండములో అగస్త్య మహర్షి రామునికి రాక్షసుల జన్మ విశేషాలు వారి తపస్సులగురించి తెలియచేస్తు,

“” దశగ్రీవ తథా యత్నం కురుష్వా~మితవిక్రమ,
యథా త్వమసి మే పుత్ర భవ వైశ్రవణోపమః””||(09-43),

విశ్రవసునికి దేవవర్ణిలకు జన్మించినవాడు కుబేరుడు.అయన తీవ్రతపస్సు చేసి బ్రహ్మ ను మెప్పించి పుష్పక విమానమును పొందాడు.
విశ్రవసునికి కైకసికి జన్మించినవారు రావణ,కుంభకర్ణ విభీషణులు. రావణ కుంభకర్ణులు విశ్రవసుని ఆశ్రమములో పెరుగుచు లోకకంటకులుగ ప్రవర్తిస్తున్నారు.ఆ సమయములో కుబేరుడు తన పుష్పక విమానములో విశ్రవసుని దగ్గరికిరాగా అతని వైభవము చూచి కైకసి రావణునితో నాయనా! ఆ కుబేరుని తేజో వైభవాన్ని గుర్తించావా.నీవు నీ దుష్టచేష్టలు మాని కుబేరుని వలె యశస్సు బడయమని కోరగా రావణుడు మాతా!చూడు ఇతనికంటే మించినవాడిని అవతానని ఆన చేసి ఈర్ష్యతో కుంభకర్ణునితో కలిసి ఘోర తపస్సు కి వెడతాడు. ఇది విని విభీషణుడు కూడ తపస్సు ప్రారంభిస్తాడు.

బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకోమ్మనగా రావణుడు,

“” భగవాన్ ప్రాణీనాం నిత్యం నా~న్యత్ర మరణాద్భయమ్,
నాస్తి మృత్యుసమః శత్రుః అమరత్వమ్ అహం వృణే||(10-16),

మహాత్మా! సమస్తప్రాణులు నిత్యం మరణభీతితో వ్యాకులపడుతుంటారు.కనుక మరణముతో సమానమైన శత్రువు ఉండడు.కనుక నాకు అమరత్వము ప్రసాదించమని ప్రార్థిస్తాడు.అది అసాధ్యము మరియొకటి ఏదైనా అడగమంటే

“” నహి చింతా మమా~న్వేషు ప్రాణిష్వమరపూజిత,
తృణభూతా హి మన్యే ప్రణినో మానుషాదయః||(10-20),

ఓ ప్రజాపతీ! మానవులతో సహా ఇతరప్రాణులన్ని నాకు గడ్డిపోచలతో సమానమని చెప్పి గరుడ,నాగ,యక్ష,కిన్నెర,రాక్షస మరియు ఏ దేవతలవల్ల మరణము లేకుండగ వరము కోరి బ్రహ్మచే అనుగ్రహింపబడ్డాడు.రావణుని తపస్సులో ఈర్ష్య తో కూడిన సాధన మరియు లోకకళ్యాణ ప్రసక్తి లేనందువల్ల వినాశనము పొందాడు.
విభీషణునికి ప్రజాపతి ప్రత్యక్షమై వరము కోరమనగా అతడు,
“” యా యా జాయతే బుద్దిః యేషు యేష్వాశ్రమేషు చ,
సా సా భవతు ధర్మిష్టా తం తు ధర్మం చ పాలయే||(10-32),

ఓ మహాత్మా! బ్రహ్మచర్యాదిగా గల అన్ని ఆశ్రమములలో నా బుద్ధి పరిపూర్ణముగ ధర్మబధ్దమై యుండులాగు,అన్ని ధర్మములు సత్య దీక్షతో నేను పాటించులాగు వరము కోరుకొనగా బ్రహ్మ సంతోషించి సరే యనెను.
అందుకనే విభీషణుడు ధర్మమూర్తియైన రాముని చెంతకుచేరి యశస్కాముడయ్యాడు.
దేవతల విజ్ఞాపనమేరకు సరస్వతీమాత కుంభకర్షుని నాలుకపై నిల్వగా అతడు చిరకాల నిద్రను కోరుకొని ఇదివరకు చేసిన దుష్టకార్యాలకు దూరమై ప్రశాంతచిత్తుడయ్యాడు.

కనుక మన కోరికలలో మానవాళి శ్రేయస్సు యున్నచో మన తపస్సులు ఫలించి ఇష్టకామ్యార్థాలు నెరవేరుతాయని ఈర్ష్యతో కూడిన సాధనలు ఫలించవని రామాయణము మనలని హెచ్చరిస్తున్నది.
*🌹శ్రీరాం🌹

Written by K.K Tayaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యాత్రా చరిత్ర – travelog

“దసరా”