బతుకమ్మ

ఏడాదికొకసారి వస్తుంది
ఇంతులలో ఆనందాన్ని నింపుతుంది
గునుగు మొగ్గదొడిగింది…
తంగేడు పువ్వు విరగబూసింది…

బొడ్డెమ్మ తో మొదలైంది….
బతుకమ్మ బంధాల పండుగయ్యింది
పదిరోజుల సంబురాలు
సద్దుల బతుకమ్మ తో సాగనంపింది…
ఆడపిల్లలనందరిని దీవించింది…
మళ్ళొచ్చే పండక్కి వస్తానన్నది…!!

Written by Sushma Srinivas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శరన్నవరాత్రుల విశిష్టత

మనమూ – ఆమె