ఎడారి కొలను 

37 

    (ఇప్పటివరకు : మరునాడు పొద్దునే పంతులు గారు రమాదేవి మాటలేవి  పట్టించుకోవద్దని, ఇల్లు ఖాళీ చేయాల్సిన వసరం లేదని చెబుతాడు.  ఆదివారం నాడు మైత్రేయి, ప్రసాద్   కాంతమ్మ గారింటి కి వెళుతారు.ప్రభాకర్ కి సుబ్బారావు గురించిన కొన్ని నిజాలు తెలుస్తాయి. అవి ప్రసాద్ కి కూడా చెప్పి కాస్త రహస్యం గ ఉంచమని కోరతాడు. మంగళవారం మైత్రేయి తో టి  గుంటూర్ లో వాళ్ళింటికి చేరు కున్న కాంతమ్మ గారికి మైత్రేయి తల్లితండ్రుల  ధోరణి  కష్టమనిపించింది.)                                    

“నాన్న గారు ,” అంటూ తలుపు మీద చిన్నగా కొట్టింది.  పడక కుర్చీ  లో పడుకొని పేపర్ చదువుతున్న ఆ యన, తలెత్తి  చూసాడు. 

“ లోపలకి రమ్మంటారా నాన్న గారు , టీ తీసుకొచ్చాను. మీతో కాసేపు మాట్లాడాలని ఉంది,” అంది తలవంచుకొని. 

“ రా ,”   అంటూ చేతితో సైగ చేసారు. లోపాలకి వెళ్లి, అయన కప్పు ని చేతికి అందించి, తన కప్ కూడా తీసుకొని ఎదురుగ ఉన్న కుర్చీ లో కూర్చుంది బెరుకుగా. 

“ చెప్పు , ఎం మాట్లాడాలి,” అన్నాడు. 

“ అసలేం జరిగింది అని మీరు అడుగుతారని అనుకున్నాను,” అంది కాస్త ధైర్యం కూడా గట్టు కొని. 

“సరే చెప్పు వింటాను,” అన్నాడాయన. 

“ నేను చెప్పే ముందు , మిమ్మల్ని ఒక విషయం అడగాలని కుంటున్నాను,” ఏంటా విషయం అన్నట్టు కళ్ళెగరేసారాయన.

“ అదే నాన్న గారు, ఆయన మిమ్మల్ని ఎప్పుడు కలిసాడు,” అడిగింది. 

“నువ్వు కేసు పట్టావని, అతనికి అరెస్ట్ వారెంట్ వచ్చిందని, చెప్పడానికి వచ్చాడు,”అన్నాడీయన గంభీరంగా . 

“ ఇంకేం చెప్పాడు. అవన్నీ నీకెందుకు. అతను చెప్పిన విషయాలేవీ నా నోటితో చెప్పలేను,” అన్నాడాయన అసహనంగా. 

“ అతనేం చెప్పాడో నేను ఉహించగలను. కానీ అతను  చెప్పిన విషయాలన్నీ మీరు నమ్మారా?” సూటిగా చూసింది. ఆయన మౌనం వహించాడు. “అంటే, మీరు అతను చెప్పినవన్నీ నమ్మేశారు.  కానీ, ఒక్క క్షణం కూడా ఆలోచింలేదను కుంట, మీ పెంపకంలో పెరిగిన మీ కూతురు , మీరు చెప్పగానే, మారు మాట్లాడకుండా , తలవంచుకొని ఆ వ్యక్తి చేత తాళి కట్టించుకున్న మీ కూతురు ఏ  పరిస్థితిలో అలా,  ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయ లేదు కదు, నాన్న గారు?” అంది కంఠం వణుకు తుండగా. అయన కి ఎం చెప్పాలో తెలియలేదు కాసేపు సంభాలించు , “అందుకేగా మీ అన్నయ్యను పంపించాను ,” అన్నాడాయన కాస్త ధీమాగా. 

“అన్నయ్య మీకు ఎం చెప్పాడో  నాకయితే తెలియదు, కానీ నన్ను  కేసు వాపసు తీసుకోమని చెప్పాడు, నేను మౌనంగా ఉండడంతో కోపం తో వెంటనే వెళ్లి పోయాడే తప్ప ,కాస్త నిదానంగా నాతో  మాట్లాడాలని వాడను కోలేదు. మీకా విషయం తెలుసా,” అంది . 

కళ్ళజోడు సవరించు కుంటూ కాస్త ముందుకు వంగా డాయన ఆసక్తిగా మైత్రేయి ఎం చెబుతుందో వినాలని. “ మీకు కొంచం నిజం మాత్రమే తెలుసు. అన్నయ్యకయితే అంతకు ముందు జరిగిన విషయాలు కూడా తెలుసు , కానీ మీకవేమి చెప్పలేదు,” అంది.

“ నాకేం విషయాలు తెలుసు, నేనే విషయాలు నాన్న గారికి చెప్పలేదు?” అంటూ మైత్రేయి అన్న య్య రవి కుమార్ గదిలోకి వచ్చాడు. 

“ ఏ విషయం  వాడు నాకు చెప్పలేదు ?” అన్నాడాయన సాలోచనగా. 

“ సుబ్బా రావు గారి విషయం. మీరందరు పెళ్లి చేసాము కదా అని నిశ్చింతగా ఉన్నారు.  కానీ అతని అ పెళ్లయిన మరుసటి రోజు నుండే అతని ఆలోచనలు బయట పడ్డాయి. నా చేత వాళ్ళ వాళ్ళకి డబ్బులు పంపించేవాడు. అంతే  కాదు, నా అకౌంట్ జాయింట్ అకౌంట్ చేసి , తనకి ఎప్పుడు డబ్బులు అవసరమయితే డ్రా చేస్తుండేవాడు నా అకౌంట్ నుండి. ఏడాది తరువాత  తెలిసింది అతని తాగుడు అలవాటున్నదని. డబ్బులు చీటీలకు కట్టి , మధ్యలోనే  చీటీ పాట పాడేస్తూ, తరువాత కట్టాల్సిన  వాయిదాలను నన్ను కట్ట మనెవాడు.  మీకెవ్వరికి తెలియదు కదు? అలా నన్ను రెండేళ్ల పాటు వేధించాడు .  ఆ తరువాత హైదరాబాద్ ట్రాన్ఫర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు, తిరిగి చూడలేదు, నేనా విషయం  అన్నయ్యను కనుకోమ్మని చెబితే, వాడు పట్టించుకోలేదు,” అన్న రవి వంక చూసింది. 

రవి గమ్ముగా తలా వంచుకొని కూర్చొని ఉన్నాడు. 

“ ఎరా , అది చెప్పిందా నీకు ,” కాస్త కోపం గ అడిగాడు ఆయన. 

“ చెప్పింది నాన్న, నేననుకున్నాను మగాడు కదా , ఇందులో ఏముందిలే , మనం అంతగా పట్టించుకోవటానికి , చాల మంది మొగాళ్ళు అలాగే చేస్తుంటారని, మీతో చెప్పలేదు,”

“ అన్నయ్య , నిన్ను  కనుకోమ్మని చెప్పిన నువ్వు నిర్లక్ష్యం చేశావు కదర, ఆ నిర్లక్ష్యమే ఇంతదూరం వచ్చింది, పైగా నాదే  తప్పన్నట్టు మాట్లాడి వచ్చేసావు,” అంది రోషంగ. 

మగపిల్లాడిని అలా నిలదీసి మాట్లాడటం పరంధామయ్య గారికి నచ్చలేదు.

“ వాడి మీద పడతావెందుకే, నీ సంసారం నీకు చక్క దిద్దుకోవటం రాక పోతే,”  అన్నది అప్పుడే అక్కడి కొచ్చిన భాగ్యమ్మ.

అమ్మ అండ చూసుకొని రవి రెచ్చి పోయాడు, “వాడు తప్పుగా ప్రవర్తిస్తే మాకు ఫోన్ చేసి చెప్పాలి గాని , అన్ని నిర్ణయాలు నువ్వే తీసు కుంటావా, నేను నాన్న గారు ఉన్నాం గా, ఎదో రకం గ నచ్చ చెప్పి, సమస్యను పరిస్కరించేవాళ్ళం , నువ్వలా చేయలేదే , అంత వ్యక్తిత్వం నీది మరి,” అని మాట్లాడుతున్న రవి ని పరం ధామయ్య గారు మందలించక పొగ , “వాడు చెపింది కరక్టే కాదమ్మా, మాకెందుకు చెప్పలేదు,” అన్నాడాయన.

“అంటే మీ కూతురిని అతను కొట్టి హింసిస్తుంటే , మీరొచ్చి రక్షిస్తారని ఎదురు చూడాలంటారు , అంతేగా, పైగా అతను చెప్పిన మాటలను విన్న తరువాత నిజం ఏంటో తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా మీరు చేయలేదు, అంతే కదూ,” అంది కాస్త ఉఛ్ఛ స్వరం లో. 

“ నాన్న గారితో అలా మాట్లాడతావేమిటే , నోర్ముసుకొని పద , మా పరువు పోయింది చాలక , నీతో కూడా మాటలు పడటం,” అంటూ భాగ్యమ్మ గారు మైత్రేయి చేయి పుచ్చుకొని అక్కడనుంచి బయటికి లాక్కు పోయింది, అన్న గాని తండ్రి కానీ ఆమెని ఆపలేదు . 

మనసు విరిగి పోయింది మైత్రేయి కి. తన గది  లోకెళ్ళి తలుపు వేసేసుకుంది. మనసంతా ఎవరో పిండివేస్తున్నట్లని పించింది. సొంత కూతురికి, తోడబుట్టిన దానికి అన్యాయం జరుగు తుంటే  మేమున్నామని చెప్పక పొగ , తానే తప్పు చేసిందన్న ధోరణిలో మాట్లాడుతున్న వీళ్ల ను చూస్తుంటే , వీళ్లేంత స్వార్ధం తో సంప్రదాయమనే ముసుగులో  ఆలోచించే విచక్షణని కోల్పోయారనిపించింది. . వీళ్లు ఇక మారారు. కనీసం మారడానికి కావాల్సిన ఆలోచన శక్తి ని కూడా వదిలేసుకున్నారు , ఇలాటి స్థితి నుంచి వీళ్ళని బయటికి తీసుకు రావడం తన వల్ల మాత్రం  కాదు. వీళ్ళకి నిజం తెలిస్తే తనకి అండగా ఉంటారన్న తన  ఆశ అడియాసే అయింది.  ఈ కొద్దీ రోజుల్లేనే తనకొక సత్యం బోధపడింది, ఎవరి వ్యక్తిగత పోరాటం వాళ్ళే చేయాలి, ఎవరో వస్తారని, తనకు అండగా నిలబడతారని అనుకోవడం తన అమాయకత్వం. దారిన పోయే వాడికి దారిన పోయేవారే దిక్కు అని మనసులో  

“ఇంకతను ఒంటరిగానే  పోరాడాలి,’ అనుకొంటూ కాంతమ్మ గారికి ఫోన్ కలిపింది.  

 రాత్రి ఏడుగంటలు అవుతుండగా కాంతమ్మ గారి కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. మైత్రేయి “అమ్మ నేను వెళుతున్నాను,” అని చెప్పటానికి వంటగదిలో ఉన్న భాగ్యమ్మ గారి దగ్గరికెళ్లింది. 

“ అదేమిటీ, అప్పుడే వెళ్తానంటావు? ఇంకో రెండు రోజులుండి వేళ్ళు ,” అంటూ ఆర్తి గ చూసింది. 

“ లేదమ్మా నేను వెళ్ళాలి,” అన్నది దృఢంగ. 

“ వెళ్లనివ్వు భాగ్యం, మనం చెప్పటం అది వినటం లాటి పరిస్థితి ఇప్పుడు లేదు. మన చేయి దాటి పోయింది,” అన్నాడు పరంధామయ్య కూతుర్ని చూస్తూ. 

“ అవును నాన్న, కూతురు చెప్పే విషయాన్నీ నమ్మకుండా, అతనొక మహాను భావుడని, పెళ్ళాన్ని హింసించడం భర్త గ అతని హక్కు అని మాట్లాడిన తరువాత, నాకు మీ అండలో న్యాయం జరుగుతుందనే నమ్మకం చచ్చి పోయింది. అందుకని నేను వెళ్లి పోవడమే సరయిన నిర్ణయం. ఏమైనా అతను చెపుతాడనే అనుకుంటున్నాను కోర్ట్ హియరింగ్ తారీకు. మీకు ఇష్టమయితే రండి, కనీసం కొన్ని నిజాలయిన తెలుసుకో గలుగు తయారు,” అంటూ కళ్ళు తుడుచు కుంటూ బయటి కెళ్ళి పోయింది. 

అప్పటికే బయట కారు లో కూర్చుని ఎదురు చూస్తున్న కాంతమ్మ గారు, “జానీ డోరు తెరువు  తను వస్తున్నది,” అన్నది. మైత్రేయి వెళ్లి కారులో కూర్చుంది , వాకిలి వైపు చూసింది, కనీసం అమ్మ కూడా వాకిలి దాకా రాలేదు, కళ్ళలో నీళ్లు తిరిగాయి మైత్రేయి కి. అవి ఎవరికి కనిపించకూడదన్నట్టు తలని ఒక వైపుకి తిప్పేసుకుంది, కానీ కాంతమ్మ గారి దృష్టి నుండి మాత్రం తప్పించుకోలేక పోయింది. 

                                  *********************************

గుంటూరు నుండి వెనక్కి వచ్చాక అమ్మ నాన్నల తీరు నిరాశ కలిగించిన కూడా  తనకిప్పుడు మనసు కాస్త కుదుట పడింది. జరగాల్సింది జరగక మానదు , ఎలాటి పరిస్థితి నయినా ఎదుర్కోవడం తప్ప తనిలా  బెంబేలు పడుతూ ,భయ పడుతూ ఉండకూడదు. అన్ని ఎదురు దెబ్బలు తిన్న పెద్దక్క లాంటి వారిని చూసాక, తనెందుకంతలా  భయపడాలి, తనకి ఆర్ధిక స్వతంత్రం ఉన్నది. ఎవరు చుసిన చూడక పోయిన తనని తాను , తనతో పా టు నలుగురిని పోషించగల శక్తి ఉన్నది, కాంతమ్మ గారు, వసుంధర , ప్రసాద్ లాంటి వాళ్ళ స్నేహం దొరికింది. ఇలా తనలో తానే ధైర్యం  నింపుకుంటూ కాలేజ్ రీ ఓపెన్ అవగానే  మైత్రేయి రిపోర్ట్ చేసింది.  

అలా ఆలోచనలలో ఉన్న మైత్రేయి గమనించలేదు , అప్పటివరకు ఎండగా నే ఉన్నది. ఇంతలోనే మేఘాలు కమ్ముకొని సన్నటి మృగశిర వర్షం  మొదలయింది. వేసవి ఎండకి వేగి వేసారిన  పుడమి కాంతకీ సేద తీర్చే ఆత్మీయుడు మేఘుడు. ఆ గ్రీష్మ తాపాన్ని ఎంతో ఓర్పుతో భరిస్తూ ఆశగా ఆ మేఘుడి కోసం ఎదురు చూస్తుంది ఈ ధరణి.  ఆశని ఎప్పుడు నిరాశ చేయలేదు ఆ ఆత్మీయుడు మేఘుడు.

“తన  మనసును సేదతీర్చే ఆత్మీయులే లేని ఈ ఒంటరి జీవితం లో తొలకరి అసలు ఉన్నదా”?   తన కన్నీటి ని తుడిచే ఆత్మీయులు  ఎవరు? 

“ మబ్బు పట్టిన ఆకాశంలోకి 

పడే వానచినుకు కోసం   చూస్తున్నాను,

ఆశగా నిరాశగా 

ఆశ నిరాశల మధ్య ఊగిసలాటగా  ”  ఆమె కన్నులు వర్షిస్తున్నాయి. 

                                                           *****************

ఆ మరునాడే కాలేజీ లో ఉండగా  కోర్ట్ నుండి ఒక రిజిస్టర్ కవర్ వచ్చింది పోస్టులో. ఫైనల్ హియరింగ్ కి కోర్ట్ కి హాజరవమని ఇచ్చిన సమన్స్.  స్వాతి చినుకులు తన పయిన పడ్డట్లయింది మైత్రేయి గట్టిగ ఊపిరి పీల్చుకుంది . ….” 

సుబ్బారావు క్కూడా సమన్స్ అందాయి. అతను వెంటనే పరంధామయ్య గారికి ఫోన్ కలిపాడు.

“  హలో మావయ్య గారు ,  కోర్ట్ హాజరీకి డేట్ ఇచ్చారండి, జూన్ 15,” అన్నాడు. 

“ మరయితే నన్నేమి చేయమంటావయ్యా , నువ్వు నీ భార్య తేల్చుకోండి,” అన్నాడాయన కాస్త కోపంగా. అప్పటికే మనసులో తానే కూతురి విషయం లో ఎదో  తప్పుచేసానే అన్న మీమాంసలోఉన్నాడాయన  మైత్రేయి కలిసి వెళ్ళాక. కానీ సహజం గ ఉన్న భేషజం తో అది బయటికి కనిపించనీయకుండా వ్యవహరిస్తున్నాడు భాగ్యమ్మ గారి ముందు. 

“ అది కాదు మామయ్య గారు ,” అంటూ నసిగాడు.   

“ చెప్పు ఏంటి ?” అన్నాడాయన కాస్త కోపంగా. 

“ నాకు మీ సహాయం అవసరముంది, మిమ్మల్ని మీ కూతురు కలిసి వెళ్లిందని తెలిసింది. నా మీదేవో లేనిపోనివి కల్పించి చెప్పేవుంటుంది , ఎంతయినా మీ కూతురే కదా, నమ్మేఉంటారు, అయినా సరే నా నిజాయితీ మీకు నిదానం గ అర్ధమవుతుంది,” అంటూ మొసలి కన్నీరు కార్చడం మొదలెట్టాడు. 

“ఎంతయినా నేనామెను మనః స్ఫూర్తి గ  ప్రేమిస్తున్నాను, మీరే ఆమెను ఒప్పించి విడాకులు అడగకుండా చేయాలి . ”

“ ముందు కేసు విషయం  తేలనివ్వు, తరువాత ఆలోచిద్దాము విడాకుల గురించి,” అన్నాడాయన 

చిరాకుగా. 

“ అంతే  కాదు నాకు మీరు కొంచం డబ్బు సాయం చేయాలి, మీ అమ్మాయి వలన నేను చాలా అప్పుల్లో పడిపోయాను ,”అన్నాడు అసలు విషయానికొస్తూ. 

“ ఇప్పుడా విషయాలు మాట్లాడేందుకు ఇది సమయం కాదు. నీకు డబ్బు సాయం చేసే ఉద్దేశ్యం మాత్రం నాకిప్పుడు లేదు. నీ తిప్పలు నువ్వే  పడు.  మిగిలిన విషయాలు తరవాత చూసుకుందాము, ముందు గృహ హింస కేసు నుండి బయట పడు, చేసిందంతా చేసి , ఇప్పుడు అమాయకత్వం నటించకు   నా ముందు, ఇంకేమి మాట్లాడకుండా ఫోన్ పెట్టేయి,”అని కసురుకుంటూ ఫోన్ పెట్టేసాడాయన. 

సుబ్బారావ్ తో టి మాట్లాడిన తరువాత ఆయనకు మనసంతా అదోలా అయిపోయింది. ఎదో బోధపడినట్లుగా అనిపించింది  

(ఇంకావుంది) 

      

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గూటి పక్షులు – గులాబి ముళ్లు

చదువు