బతుకమ్మ పాట

జగన్మాతవమ్మ ఉయ్యాలో ఓ గౌరిదేవి ఉయ్యాలో
ఆకాశగంగతో ఉయ్యాలో అభిషేక మొనరించి ఉయ్యాలో
పసుపు కుంకుమతో ఉయ్యాలో అర్చింతునమ్మా ఉయ్యాలో
పరమేశుని పత్ని ఉయ్యాలో పరమేశ్వరీ దేవి ఉయ్యాలో
పారిజాతాలతో ఉయ్యాలో ప్రేమతో పూజింతు ఉయ్యాలో
రాజేశుని పత్ని ఉయ్యాలో రాజేశ్వరీ దేవి ఉయ్యాలో
జాజీపూలతో ఉయ్యాలో జన్మంత పూజింతు ఉయ్యాలో
వీరభద్రుని పత్ని ఉయ్యాలో భద్రకాళీ దేవి ఉయ్యాలో
బంతీపూలతో ఉయ్యాలో భక్తితో పూజింతు ఉయ్యాలో
మల్లికార్జున పత్ని ఉయ్యాలో భ్రమరాంబా దేవి ఉయ్యాలో
మందారపూలతో ఉయ్యాలో ముద్దుగా పూజింతు ఉయ్యాలో

శంకరుని పత్ని ఉయ్యాలో శాంకరీదేవి ఉయ్యాలో
శంకూ పూలతో ఉయ్యాలో శ్రద్ధతో పూజింతు ఉయ్యాలో
విశ్వనాథుని పత్ని ఉయ్యాలో అన్నపూర్ణా దేవి ఉయ్యాలో
చేమంతిపూలతో ఉయ్యాలో చిత్తంతో పూజింతు ఉయ్యాలో
సుందరేశ పత్ని ఉయ్యాలో మీనాక్షిదేవి ఉయ్యాలో
తామరపూలతో ఉయ్యాలో తప్పక పూజింతు ఉయ్యాలో
ఏకామ్రేశ్వర పత్ని ఉయ్యాలో కామాక్షిదేవి ఉయ్యాలో
కలువపూలతో ఉయ్యాలో కొలిచెదనమ్మా ఉయ్యాలో
లోకాలనేలేటి ఉయ్యాలో లలితాదేవి ఉయ్యాలో
కొలిచినవారికి ఉయ్యాలో కొంగుబంగారమై ఉయ్యాలో
నిలిచావు తల్లి ఉయ్యాలో ఓ జగదాంబ ఉయ్యాలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తుమ్మ ముల్లు – కథ

రమక్కతో ముచ్చట్లు -దిల్ ఖోల్కె….!!