ఎడారి కొలను 

ధారావాహికం – 36వ భాగం

(ఇప్పటివరకు : మరునాడు పొద్దునే పంతులు గారు రమాదేవి మాటలే వి  పట్టించుకోవద్దని, ఇల్లు ఖా ళీ చేయాల్సిన వసరం లేదని చెబుతాడు.  ఆదివారం నాడు మైత్రేయి, ప్రసాద్   కాంతమ్మ గారింటి కి వెళుతారు.ప్రభాకర్ కి సుబ్బారావు గురించిన కొన్ని నిజాలు తెలుస్తాయి. అవి ప్రసాద్ కి క్కోడా చెప్పి కాస్త రహస్యం గ ఉంచామని కోరతాడు.  రమణికి పెళ్లి కుదిరిందని, తనని   వదిలి రావడానికి వాళ్ళ పల్లె కి  కాంతమ్మ గారు మైత్రేయి వెళతారు.)

అనుకున్నట్లే కాంతమ్మ  మంగళవారం పొద్దున్నే మైత్రేయి ఇంటి దగ్గరికి చేరుకున్నారు. అప్పటికే మైత్రేయి తయారయి ఉన్నది. జానీ లోపలికెళ్ళి చెప్పొచ్చాడు,  “అమ్మ గారు కారులోనే కూర్చుంటానన్నారు , నువ్వొచ్చేసేయి  అక్క. ”

మైత్రేయి రమాదేవి గారి తలుపు కొట్టి ,” రమా దేవి గారు నేను , మా అమ్మ గారి దగ్గరికి వెళుతున్నాను. కుదిరితే రెండురోజులుండి  వస్తాను,” అని చెప్పింది.

“ అలాగే నమ్మ, పోయిరా, ప్రసాద్ కూడా నీతో పాటె వస్తున్నాడా ఏంటి ,” అంటూ బయటికొచ్చింది. బయటకారులో ఎవరో పెద్దావిడ కూర్చొని  ఉండడంతో కాస్త జంకి,  “మంచిదమ్మా పోయిరా,” అంటూ లోపలికెళ్ళి పోయింది

ప్రసాద్ అప్పటికే కారు దగ్గరికెళ్లి , కాంతమ్మ గారితోటి మాట్లాడుతున్నాడు.

మైత్రేయి రాగానే , జానీ డోర్ తెరిచి,  “కూర్చోఅక్క ,”  అంటూ, మైత్రేయి కూర్చోగానే, “ఉంటాం సార్,” అని సెల్యూట్ కొట్టి కార్ స్టార్ట్ చేసాడు.

వెళ్ళాలనయితే అనుకుంది కానీ బయలు దేరిన తరువాత  మాత్రం ఆందోళన ఎక్కు వయింది మైత్రేయి కి. అందుకే ఏమి మాట్లాడకుండా కూర్చుంది. అది అర్ధం చేసుకున్న కాంతమ్మ గారు కూడా మౌనంగ బయటికి చూస్తూ కూర్చున్నారు. కారు గుంటూరు లోకి ప్రవేశించింది. జానీ మౌనాన్ని భంగం చేస్తూ,    “అక్క కాస్త లొకేషన్ చెబుతావా,” అన్నాడు. అలాగే  అంటూ,” అరండల్ పెట ,ఓల్డ్ పిచికల గుంట , 4 వ లైన్,” అని చెప్పింది.

కారుని నాలుగవ లైన్ లోకి తిప్పాడు. కొంచం ముందుకెళ్ళగానే రెండస్తుల డాబా చూపిస్తూ “అదే మా ఇల్లు . అక్కడే ఆపు,”  అంటూ చెప్పింది.

కారు నేరుగా మైత్రేయి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. కాస్త జంకుతూనే కారుదిగింది  తాను. వెనువెంటే కాంతమ్మ గారు కూడా.

వాకిట్లో పేయింట్  తో ముగ్గులేసి ఉన్నాయి. ఒకటి రెండు మందార చెట్లు గేట్ కి రేడు వైపులా పెరిగిఉన్నాయి. ఒక మల్లె తీగను  ముఖ ద్వారం బయటినుంచి పై దాక మళ్లించి నట్లు న్నారు, వాకిట్లోకి వెళ్ళగానే, మంచిగా మల్లె పుల గుబాళింపు ఆహ్వానించింది.

కాంతమ్మ గారు అడిగారు,  “మీ అమ్మ గారికి మొక్క లంటే ఇష్టమా,” అని.

“అంత ఇంట్రస్ట్ లేదు మేడం, మా ఇల్లు కట్టిన తరువాత ఈ మొక్కలను తెచ్చి ఇక్కడ పెంచింది నేనే. నాకు పూలమొక్కలంటే ఇష్టం. ముందు వైపు స్థలం తక్కువ అవడం తో నేని మూడు చెట్లే పెంచగలిగాను. అవి ఇప్పుడు నా అంత  పెద్దవయ్యాయి,” అంది నవ్వుతూ .

కాలింగ్ బెల్ కొట్టింది. తలుపు తెరుచుకుంది.  తొమ్మిది గజాల ధర్మ వరం చీరని కాశిబోసి  కట్టుకొని , నొక్కుల జుట్టు ముడి, మద్యలో పాపిట  మీద కుంకుమ, పసుపుపచ్చని మేని ఛాయలో ఉన్న  నుదుటిన ఎర్రగా అర్ధరూపాయంత బొట్టు , పసుపు రాసిన కాళ్ళకి పెద్ద పట్టీలు,  అరవయి లో బడినట్లున్న ఆమె తలుపు తీసింది.

“ మైత్రేయి! నా తల్లే !” సంబరంగా చేయిపట్టు కొని లోపలకు తీసికెళ్లింది. వెనకా తల ఎవరున్నారో కూడా గమనించలేదు. కాంతమ్మ గారు అదేమీ పట్టించుకోకుండా , మైత్రేయి వెనకాలే లోపలకొచ్చింది. కాస్త విశాలమయిన హాలు, ఒక వైపు  పేము కుర్చీలు, సోఫా  ఉన్నాయి. హాలు మధ్య లో పేయింట్ తో వేసిన అందమయిన ముగ్గు వేసి ఉన్నది .

అమ్మ చేతిని సుతారం గా విడిపించుకుంటూ,  “అమ్మ, వీరు కాంతమ్మ గారు , తెనాలి లోనే ఉంటారు. నన్ను ఆవిడ కారులోనే  తీసుకొచ్చారు మనింటికి,” అంటూ పరిచయం చేసింది. అప్పటి వరకు గమనించనందుకు  కాస్త సిగ్గుపడుతున్నట్టుగా, “నమస్కారం కాంతమ్మ గారు , అమ్మయిని చూసిన సంతోషంలో మిమ్మల్ని గమనించలేదు. మన్నించాలి , కూర్చోండి,” అంటూ సోఫా చూపించి, లోపలకెళ్ళి మంచినీళ్ళ గ్లాసు తోటి వచ్చి ఆవిడ చేతికి అందించింది.

“నమస్కారమండి , మైత్రేయి మిమ్మల్ని తలుచుకొని రోజుండదు. మీ ఆరోగ్యం బాగానే

ఉంటుంది కదా, వీళ్ళ నాన్నగారు కూడా ఇంట్లోనే ఉన్నారా?” అంటూ పరమర్శించింది ఆమె కాస్త పెద్దరికంగా.

“మా గురించేమను కోవటమొ,  ఏమోలే ,” అంటూ “ఇప్పుడే బాబా గుడి  దాకా వెళ్లారు. వచ్చేస్తుంటారు. మీరు కూర్చోండి, మీకోసం కొంచం కాఫీ కలుపుకొస్తాను.,” అంటూ వంట గదిలోకి వెళ్ళింది.

అమ్మ వెనకాలే వంట గదిలోకి వెళ్ల బోయింది మైత్రేయి, “ నువు నా వెనకాలే ఎందుకే, అక్కడే కూర్చో ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను,” అంటూ వంటగది లోకి వెళ్ళి పోయింది. కాస్త వింతగా అనిపించింది ఆవిడ వాలకం కాంతమ్మ గారికి.

ఇంతలొకే ఎవరో వచ్చినట్లయింది,” నాన్న గారేమో,” అనుకుంటూ వాకిలి వైపు కి చూసింది మైత్రేయి.   తెల్లటి పంచ, ఖాదీ సిల్క్ లాల్చీధరించి , బట్ట తల, కాస్త నల్లగా ఉన్న వర్చస్సు గల మొహం , నుదుటిన బాబా విభూతి, చూట్టానికి కాస్త గంభీరంగా ఉన్న ఒక డెభైయిలో పడినట్లున్న ఆయన లోపాలకొచ్చాడు.

“నాన్నగారు ,”   అంటూ ఆప్యాయంగా ఆయన దగ్గరికి వెళ్ళింది మైత్రేయి.

ఆయన చేత్తోనే దూరం గా ఉండు అని సైగ చేసి , కాంతమ్మ గారి వంక పరిశీలనగా చూశాడు.  దూరంగా ఆగిపోయిన మైత్రేయి కి ఆందోళన గా అనిపించింది. అయిన కాస్త నిలదొక్కుకొని , “నాన్న ఈమె కాంతమ్మ గారు , సత్తెనపల్లి లో ఉన్న చేయూత సంస్థ స్తాపకురాలు,” అంటూ పరిచయం చేసింది.

ఆయన కాంతమ్మ గారి వంక చూస్తూ, “నేను మీగురించి విన్నాను. మీరు చాలా మంచి సేవ అందిస్తున్నారు,” అంటూ మర్యాద పూర్వకం గా నమస్కారం చేశాడు. కాంతమ్మ గారు చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసింది.

మైత్రేయి అమ్మ భాగ్యం , రెండు కాఫీ గ్లాసులు తెచ్చి టేబల్ మీద పెడుతూ,  “తీసుకోండి. నువు కూడా తీసుకోవే ,” అంటూ “ మీకు మంచినీళ్ళు తీసుకు రమ్మంటారా?” అని అడిగగింది  ఎంతో అణుకువగా.

“అమ్మ , నాకు మార్యాద లేంటి, నాన్నగారికి ఇవ్వు  ఈ  కాఫీ,” అంటూ అందించబోయింది.

“ అరెరె! నువ్వు లేవద్దమ్మ, నీకు కూడా మర్యాద చేయాల్సిందే కదా, ఎందుకంటే , నువిప్పుడు  మా కన్నా బిడ్డ మైత్రేయి వి కాదు కదా. ”

“ నాన్న గారు ,” అంది బాధతో.

“నువిప్పుడు స్వతంత్రురాలివి. స్వంత సంపాదన ఉన్నది, నీ నిర్ణయాలు నువ్వే తీసుకోగలిగిన ధైర్యం  ఉన్నది. పెద్దదానివయి పోయావు , కోర్ట్ , పోలీసు లంటూ తిరిగెంత పరపతి కూడా సంపాయించుకున్నావు. ఇప్పుడు నీకు మర్యాదలు చేసే స్తితి లోనే కదా నేను మీ అమ్మ ఉన్నాము,” అంటూ చాలా  నిష్టూరం గా మాట్లాడాడు.

మైత్రేయి తలదించు కొని గుడ్ల నీరు గుడ్లలోనే కుక్కు కుంటూ మౌనంగా వింటూ ఉంది. కాంతమ్మ గారికి ఒక్క నిముషం తాను కల్పించు కొని మాట్లాడొచ్చా లేదా? అన్న సందిగ్ధంలో పడింది. అయిన ఇంకొద్ది సేపు చూద్దామని అనుకోని మవునంగా జరుగుతున్నది చూస్తూ కూర్చున్నది.

“ అవునే, మమ్మల్ని పరువుగా ఎక్కడ బతక నిచ్చావు. మీ  నాన్న గారు నిద్దర పోయి ఎన్ని రోజులయిందో తెలుసా?” అంటూ భర్తకు వత్తాసు పలికింది భాగ్యమ్మ.

“నేనేం చేశానమ్మ, అంత నిష్టూరంగా మాట్లాడతావు,” అంది కొంచం రోషంగా.

“మంచిగా నాలుగు లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేస్తే , బుద్దిగా కాపురం చేసుకోకుండా, నువు వెలగబెట్టిన నిర్వాకం  ఊరంత తెలుసు. మాకే ఆలస్యంగా తెలిసింది. ఏదో మంచి చేబుదా మని మీ అన్న వస్తే , నువ్వేమో వాడిని లెక్క చేయకుండా పంపావు. అల్లుడుగారొచ్చి మా ముందు లబొదిబో మన్నాడు. ఎవ్వరం  ఎంత చెప్పిన నువు నీ పంతం వదులు కోక పొగ, పోలీసు కేసు కూడా పెట్టి కోర్ట్ గడప తొక్కావు.   మా మాట  నెప్పుడు లెక్క చేశావు,” అంటూ భాగ్యమ్మ ఆవేశంగా మాట్లాడింది.

ఇక కల్పించుకోకుండా ఉండలేక పోయింది కాంతమ్మ గారు.

“భాగ్యమ్మ గారు, కాస్త శాంతించండి. అసలే తాను చాలా నలిగిపోయింది.  మీ దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నది. కానీ నేనే ధైర్యం చెప్పి తీసు కొచ్చాను,” అంది.

“ఎందుకు తెచ్చారండి. దారిన పోయే తద్దిననాన్ని మా నెత్తిన ఎక్కించుకోవటానిక,” అన్నడా యన  కుతూరని కూడా చూడ కుండ.

“అలా మాట్లాడకండి, ఎంతయినా మైత్రేయి మీకు ఒక్క గానొక్క కూతురు. ఆ పిల్లకు ఏదయినా సమస్య వస్తే మీరు కాకపోతే ఇంకెవరూ అర్ధం చేసు కుంటారు,” అంటూ అనునయించబోయింది.

“ఆ ఇంగితం దానిక్కూడా ఉండాలికద. మేము చెప్పినట్లు కేసు వాపసు తీసుకోనుంటే ఈ రోజున ఇలా ఎడవాల్సిన పరిస్తితి కలిగేది కాదుకదా. ” అన్నడాయన .

“మీరు  జరిగింది  ఎంటీ   అని ఎప్పుడయినా మైత్రేయి ని అడిగారా ?” ఆమె సూటిగా ప్రశ్నించింది.

“మొగుడ న్నాక, కోపం రాదా , ఒక దెబ్బ వేస్తే ఏమయి పోతుంది,” అంది ఆమె కాస్త అ మాయకంగా.

“మిమ్మల్ని కూడా మీ వారు కొడుతుంటారా తరచూ? ఇలా అడిగానని ఏమనుకోవద్దు . చెప్పండి?” అంటూ సూటిగా ఆమె కళ్ళ లోకి చూసింది.

“ఛీ ఛీ!అలా ఎప్పుడు జరగలేదు మా పెళ్ళయిన ఇన్నేళ్లలో ,” గాభరపడింది.

“మీకు పెళ్ళయి కనీసం ముప్పై ఏళ్ల అయిన అయుండాలి. ”

“అవును.”

మరి ఇన్నేళ్ల  మీ  వైవాహిక జీవితం లో ఒక్కసారి కూడా జరగని విషయం మీ కూతురి జీవితం లో జరిగితే మీకు ఆలోచించాలని అనిపించలేదా,” సూటిగా అన్నది.

కొద్ది సేపు మౌనమే అందరినీ చుట్టేసింది. కాంతమ్మ గారల మాట్లాడతారని భాగ్యమ్మ ఆలోచించలేదు. పరంధమయ్య గారికి కూడా ఏం చెప్పాలో తోచలేదు.

“ఇప్పటికయిన మీ అమ్మాయిని కూడా అడిగి తెలుసుకోండి అసలేమి జరిగిందో,” అంటూ,

“మైత్రేయి నేను బయలు దేరుతాను, నువ్వు వెనక్కి రావలనుకుంటే సాయంత్రాని కల్ల  నాకు ఫోన్ చేయి నేను నిన్ను పిక్ అప్ చేసు కుంటాను,” అని కాంతమ్మ గారు లేచారు.

అప్పుడు పరంధమయ్య గారు , “కాంతమ్మ గారు , మేము సమాజానికి భయపడే వాళ్ళం. సామజిక కట్టు బాట్లను గౌరవిస్తూ అందులోనే మా మూడొంతుల జీవితం గడిపేశాము, ఇప్పుడు మేము మారలేము, మైత్రేయి ఇక్కడకు వచ్చిందంటే , మా చుట్టూ పక్కల వాళ్ళందరూ దాన్ని చూడాలన్న నెపంతో వస్తారు, కానీ వాళ్ళు రావడానికి కారణం వేరే ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు , సలహాలు విని భరించే ఓపిక మాకిప్పుడు లేదు. దాని నుదుటిన ఏది రాశి పెట్టిఉంటే అదే జరుగు తుంది. మేము దాన్ని వదిలేసు కున్నాము, మీతో నే తీసుకు పొండి. దాన్ని మేమేమి అడగనవసరం లేదు, మాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు ,” అంటూ ఖరాఖండిగా చెప్పి ఆయన లోపలకెళ్ళి పోయాడు.

ఆయన ధోరణి   మనసుకి  చాలా  కష్టం కలిగించింది. మైత్రేయి హతాసురాలయింది.

మైత్రేయి సంభాళించుకొని , “కాంతమ్మ గారు, మీరు సత్తేనపల్లి వెళ్ళండి. ఎప్పుడు మీరు వెన్నక్కి వస్తున్నారో నాకు ఫోన్ చేసి చెప్పండి నేను వస్తాను. అప్పటి దాకా నేను మా ఇంట్లో ఉంటాను. వాళ్ళు నన్ను వదులుకోవాలని అనుకున్న నేను వాళ్ళని వదులు కోలేను,” అంది.

ఇలాటి మార్పు మైత్రేయి లో కోరు కున్న కాంతమ్మ గారు చిరునవ్వుతో ,  ”మంచిది మైత్రేయి, సమస్య నుండి పారిపోకూడదు, ఎక్కడ ఉన్నదో తెలిస్తే ఆ సమస్యకి పరిష్కారం వెతకటం మనం అక్కడి నుంచే మొదలెట్టాలి. ధైర్యం గ ఉండు ,” అంటూ బయటిదాకా వచ్చిన మైత్రేయి కి చెప్పి కారెక్కింది ఆమె. కారు వెళ్లిపోయింది. మైత్రేయి లోపలికోచ్చింది. ‘

“ అమ్మ నేను నా గది  లోకి వెళ్ళనా ?” అడిగింది. “ కన్న బిడ్డను కాదనుకునేటంత కసాయి తనం నాకు లేదమ్మా,పద , నీ గదిలోకి వెళదాము ,” అంటూ ఆప్యాయంగ లోపలకు తీసుకెళ్లింది.

‘ఎంతయినా తల్లి కదా’ అనుకుంది తాను మనసులో. ఎలాగయినా నాన్నకు వివరించాలి, తన మీదున్న కోపం పోగొట్టాలి,’ అని గట్టిగ నిర్ణయించు కుంది.

భోజనాల సమయం లో  పరం ధామయ్య గారు ఏమి మాట్లాడకుండా భోజనం అయిందని పించి ,

ఆయన తన గది  లోకి వెళ్లి పోయాడు. భాగ్యమ్మ కూడా అంతే అయన ముందేమి మాట్లాడకుండా , అయన తినేసిన  కంచం కడుక్కో కుండానే , ఒక సా రి బోర్లించేసి, అందులోనే తాను తిన టానికి వడ్డించు కున్నది.

“ అమ్మ నీకెన్ని సార్లు చెప్పుంటాను. ఇలాటి పనులు చేయొద్దని. ఇలాగ తినడం వలన నువ్వేమి సతి సావిత్రి లాగా శక్తులు సంపాదించుకోలేవు. ఇది కేవలం గుడ్డి  ఆచారం,” అంది.

“నువ్విలా మాట్లాడినప్పుడల్లా , మా మైత్రేయి మంచిగా చదువు కుంది, అన్ని తెలుసుకుంటున్నది అని సంబర పడ్డాను ,కానీ ఆ తెలివే నీ కొంప ముంచు తుందని అనుకోలేదు. నీ తెలివి తేటలకు మురిసిపోవాలో, లేక కాపురం గంగలో కలుపుకుంటున్నందుకు ఏడవాలో అర్ధం కావటం లేదు ,” అంది  భాగ్యమ్మ.

“అమ్మ . నువ్వే చెప్పావు కదా నాన్న నీ మేదెప్పుడు చేయెత్తలేదని. కానీ చాలా సార్లు నిన్ను చులకన చేసి మాట్లాడేవారు, అంతే  కాదు మా విషయం లో ఏ  నిర్ణయమయిన ఆయనే తీసు కొనే వాడు. నిన్నెప్పుడయినా అడిగే వాడ? లేదు కదా?” అంది. “

“ అలా అంటావేంటీ . ఆయనకి అన్ని తెలుసు. నన్నెందుకు అడగాలి. నాకేమి కావాలో కూడా అయన ముందే కనిపెట్టేస్తారు. నేను ఆడకుండానే నాకు తెచ్చి పెట్టిస్తారు. అంత  కంటే ఇంకేం కావలి చెప్పు, మీ నడమంత్రపు చదువులతో భర్త ని గౌరవించడం పోయి, పైగా తిరగ బడి కొట్టడం కూడా. నా దగ్గర మాట్లాడమాకు నీ తలతిక్కసిధాంతాలు, నా దృష్టిలో పెళ్లయిన ఆడపిల్ల మొగుడి అడుగు జాడల్లో ఉంటేనే కుటుంబం నడుస్తుంది, రెండు జోడెద్దులు బండి లాగి నట్లు,” అంది.

“అవునమ్మా నువ్వు సరిగా చెప్పావు. జోడెద్దులు లాగా సంసారమనే బండిని నడపాలని , కానీ ఒక ఎద్దుని వెనక్కి తోసేస్తూ , లేక పొతే కుటుంబ భారమంతా ఒక ఎద్దు మీదనే వేసి, బండి ని లాగా మంటే అక్కడ సమతుల్యత ఎలా వస్తుంది. ఇద్దరు సమానమయిన బలం తో బండి ని లాగి నప్పుడే కదా సవ్యం గ నడిచేది, జీవిత మయిన , బండి  అయినా,  . ఆ లాగుడులో భార్య  కేవలం బండి లాగడా నికి సహకరించే ఒక ఎద్దు లాగే చుస్తే , ఇక ఆ ఇల్లాలికి విలువేముంది.  అమ్మ ,  నువ్వు చక్కగా ఆలోచించగలవు. నీ కూతురు విషయం లో ఎం జరిగిందో. తాను అలాటి నిర్ణయం ఎందుకు తీసు కుందో?  కాస్త నువ్వా భార్య భర్త అన్న చట్రం నుండి బయటికి వచ్చి . ఒక్క  మాములు స్త్రీ లాగా, ఒక వ్యక్తి లాగ ఆలోచించిచూడు ,  నేను ఇటు వంటి నిర్ణయం ఏ  పరిస్థితుల్లో తీసు కున్నానో నీకే అర్ధమవుతుంది,” అంటూ కళ్ళు తుడుచు కుంటూ తన గది  లోకి వెళ్లి పోయింది

అలా వెళ్లి పోతున్న కూతురి వంక జాలిగా చూస్తుండి  పోయింది.

సాయంత్రం నాలుగింటికల్లా టీ పెట్టి కప్పుల్లో పోసుకొని ముందుగా మైత్రేయి దగ్గర కొచ్చి, “ మైత్రేయి టీ తాగమ్మ,” అంటూ లేపింది. ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళను చూస్తూ ,”ఎంటే  అలా అయి పోయావు. అంతలా ఏడవడానికి నేను నిన్నే మన్నాను ,” అంటూ బాగా గబరాటయింది ఆమె. “ఉండు మీ నాన్నకు క్కూడా టీ ఇచ్చేసి వస్తాను,” అని వేళ్ళ బోయింది

.“ అమ్మ , నాన్న టీ  కప్ నాకివ్వు, నాది కూడా . నేనెళ్ళి ఇస్తాను. నీకేదయినా పనుంటే చూసుకొని రా,” అని చెప్పి భాగ్యమ్మ చేతిలో ఉన్న ట్రే తీసుకొని  పరంధామయ్య గారి గది  లోకి వెళ్ళింది మైత్రేయి.

(ఇంకాఉంది)                                 

  

               

 

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాధ్యత The responsibility

‘మాటల చెట్టు’ – పుస్తకసమీక్ష