మధురవాణి తంజావురును పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థానములోని విదుషీమణులలో ఒకరు. ఈమెకు ‘శుకవాణి‘ అనే మొదటి పేరు ఉందని చెబుతారు. సంస్కృతంలో సుందరాకాండ వరకు రామాయణాన్ని రచించింది. ఇది సంపూర్ణముగా లభించలేదు. 1500 శ్లోకములుగల 14 సర్గల గ్రంథము మాత్రమే లభించాయి. రామాయణ సారా కావ్య తిలకము 9 సర్గాంత గద్యలలో “మధురైక ధురంధరాంద్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా” అని ఈమె చెప్పుకున్నది. ఈమె అరఘడియలో వంద శ్లోకాలు చెప్పగలదు అని, ఆరు భాషలలో కవిత్వం చెప్పగలదు అని, చిత్ర కవిత్వం ఆమెకు తెలుసునని ఆమెకు ఉన్న బిరుదులను బట్టి తెలుస్తుంది. అంత బహుముఖ ప్రజ్ఞాశాలి కనకనే రఘునాథ నాయకునిచే కనకాభిషేకం పోందటం అతిశయోక్తి కాదు. అంతేగాక సరస్వతీ మహల్ ని పండితవాగ్వాదంలో గెలిచి మధురనుండి తంజావూరు తెప్పించిన వీణా విద్వాంసురాలు మధురవాణి అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఆరోజుల్లో (1581–1614) వరకూ రాజ్యాన్ని పరిపాలించిన ఆంధ్ర రాజులైన అచ్యుతప్ప నాయకుల వారి ఆస్థానంలో వారి ఆదరాభి మానాన్ని పొంది నాట్యకళా సాంప్రదాయలను అభివృద్ధి పరిచారు. తంజావూరు సరస్వతీ మహల్ కవులతోనూ, గాయకులతోనూ, కళాకారులతోనూ అద్వితీయంగా వెలుగొందింది. తంజావూరు రాజుల్లో అచ్యుతప్ప నాయకుని మరణానంతరం రాజ్య పారిపాలనకు వచ్చిన రఘునాథరాయలు, విజయరాఘవ రాయలు కాలంలో కూడ ఈ భాగవతాలు ఆదరించ బడ్డాయి.
సరస్వతీ మహల్ తంజావూరు
సుందరకాండములోని కొన్ని ఘట్టాలు – 1800 కాలం నాటి చిత్రం – ఇందులో సాగర లంఘనం, సీతా దర్శనం, లంకా దహనం చిత్రీకరింపబడినాయి
మధురవాణి కవి, పండితురాలని, తంజావూరు నాయక్ రాజు రఘునాథ నాయక్ (1600-34) పాలనలో తంజావూరులో నివసించారని చారిత్రక ఆధారాలున్నాయని తెలుస్తుంది. ఆమె తెనుగించిన రఘునాథ రామాయణ కావ్యం సంస్కృత అనువాదానికి విస్తృతంగా ప్రసిద్ధి చెందింది. “ఆమె మూడు భాషలలో కవిత్వం కంపోజ్ చేయగలరని అష్టావధానంలో దిట్టయని సాహితీ పరిశోధకులు విశ్లేషించారు.
మధురవాణి ప్రధాన రచనలు: రామాయణ కావ్యతిలకము(సంస్కృత) కుమారసంభవం (సంస్కృత) నైషదం(సంస్కృత చంపూకావ్యం)