మన మహిళామణులు -కానూరి రమా మురళి రాజేశ్వరి

నా పేరు కానూరి రమా మురళి రాజేశ్వరి.నేను 1966లో తణుకులో జన్మించాను.ఇంటర్ వరకు చదివాను. భాస్కర వెంకట రత్నం,బంధకవి సీతారామ వేంకట కృష్ణారావు తల్లిదండ్రులు.భర్త పేరు కానూరి బదరీనాథ్.నా చిన్ననాటనే తల్లి చనిపోయారు.యాభై సంవత్సరాల వయస్సులో నేను డి.టి.పి.మా బాబు డా.కానూరి బాబు నాగేశ్వరరావు అండతో నేర్చుకున్నాను.నా భర్త కానూరి బదరీనాథ్ కవి, రచయిత ,విమర్శకుడు చారిత్రక పరిశోధకుడు గా ఎన్నో పుస్తకాలు రచించారు. నా ఏకైక కుమారుడు డా‌.బాబునాగేశ్వరరావున్యూరో కార్టియాలజీ విభాగం లో అమెరికా లో రిసెర్చ్ సైంటిస్ట్ గా ఉన్నాడు.నా కోడలు డా.లక్ష్మి కెమిస్ట్రీ డాక్టరేట్ చేసింది.నా భర్త వ్రాసిన ఆరు పుస్తకాలకు నేనే డి.టి.పి.చేసాను.మరెన్నో పుస్తకాలకి డి.టి.పి చేస్తున్నాను.సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతూ, సామాజిక చైతన్యం లో భాగస్వామిని అవుతున్నా.’తారకపురి ఆన్ లైన్ పేపరు’ కి నేను విలేకరి గా ఉన్నాను.తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో ‘గ్రామసీమ’ అనే పత్రిక కి నేను సబ్ ఎడిటర్ పని చేస్తున్నాను.నా భర్త బదరీనాథ్ సమున్నత శిఖరాలను అధిరోహించడం లో నాది క్రియాత్మక పాత్ర అని చెప్పగలను.మేం ఇప్పుడు తణుకు దగ్గర వేల్పూరు నివాసం ఉంటున్నాం.
: తణుకు లో ప్రసిద్ధ రచయిత జర్నలిస్ట్ శ్రీ బద్రీనాథ్ గారు.భర్త అండదండలతో రాజేశ్వరి గారు డి.టి.పి.నేర్చుకుని అర్ధాంగి అనే పదానికి సార్ధకత చేకూరుస్తున్నారు.8688320173.తనని గూర్చి క్లుప్తంగా తెలిపారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నా ఇల్లు

రమక్కతో ముచ్చట్లు – గిది మీకు తెలుసా?