జీవితానుభవంలో
అనేక సందర్భాలు
సందర్భాల వెనుక
ప్రత్యక్ష పరోక్ష సంఘటనలు
సంఘటనల వెనుక
కష్టనష్టాల సంఘర్షణ
సంఘర్షణల వెనుక
భావోద్వేగాల ప్రకటన
ప్రకటనల వెనుక
అహంకార,మమకారాల జ్వలనం
సందర్భమేదైనా
క్రమానుగతం !
వాస్తవ సందర్భాలకు
వక్రీకరణ భాష్యాలు చెప్పుకుంటే
శాంతి, సౌఖ్యాలు ఆవిష్కరించలేం !
అనుక్షణం
ఆత్మవంచన చేసుకుంటూ
ఉదాసీనతో ఉండిపోతే
గెలుపు మలుపు
తిరగలేం
సంఘర్షణ సంఘటల్ని
అనుకూల పరిస్థితులుగా
మలచుకుంటేనే
జీవిత సమస్యలు పరిష్కరించగలం !
ఆత్మవిశ్వాసం ప్రోదిచేసుకొని
ధైర్యం ఊపిరిలూదితేనే
జీవితాన్ని జయించగలం!