మన మహిళామణులు – శ్రీమతి శైలజ

పులి కడుపున పులి బిడ్డ ఆమె! అచట పుట్టిన చిగురు గొమ్మయినచేవ! తల్లి తండ్రులకు మెట్టినింటికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న ఉత్తమ అధ్యాపకులు శైలజ గారు.బాలాపూర్ లోని ఎడిఫై వరల్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆమె తండ్రి సుప్రసిద్ధ అష్టావధాని బహు గ్రంథకర్త డాక్టర్ రేవూరుఅనంతపద్మనాభరావుగారు.తల్లి ఆధ్యాత్మిక రచయిత్రి శోభా దేవి.వారి తొలి నోముపంట శైలజ.23 ఆగస్టు 1971 లో బిట్రగుంటలో మాతామహుల ఇంటి పుట్టిన శైలజ కడప విద్యామందిర్ లో విద్యార్ధిగా ఆపై తండ్రి బదిలీల తో విజయవాడ హైదరాబాద్ ఢిల్లీ లో చదివారు.దానికి కారణం తండ్రి ఆకాశవాణి ఉద్యోగి ఉద్యోగి కావటమే . రెండేళ్లకోసారి బదిలీలు ! ఢిల్లీ ఆంధ్రా స్కూల్లో 12వక్లాస్ పాసై రాంజన్ కాలేజీ లో బి.ఎస్సీ.చదువుతున్నప్పుడు తండ్రి కి అనంతపురం ట్రాన్స్ఫర్ ఐంది.అక్కడ ప్రభుత్వ కాలేజీలో బి.ఎస్సీ చదివారు.ఢిల్లీలో హిందీ సబ్జెక్టు.కానీఅనంతపురంలో తెలుగు! శ్రీకృష్ణ దేవరాయవిశ్వవిద్యాలయం వారు బోర్డు ఆఫ్ స్టడీస్ లో ప్రత్యేక మీటింగ్ జరిపి శైలజకి ప్రత్యేక తెలుగు పరీక్ష నిర్వహించారు.లెక్కల్లో 300/300 సాధించిన ఆమె పెళ్లి 1991లోబళ్లారికి చెందిన ఇంజనీర్ రవిచంద్ర తో జరిగింది.ఇక్కడ మరపురాని సంఘటనలు అనూహ్యంగా చోటు చేసుకున్నాయి.

 
ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో మే 21న తెలుగు ప్రాంతాల్లో కర్ఫ్యూ రైళ్లు నడవనిస్థితి.
కావలి నుండి నాదస్వర బృందం రాలేకపోయింది.కడపనుంచి మాత్రం ఆర్డర్ ఇచ్చిన మంగళసూత్రాలు అనంతపురంలో మా చేతికి అందాయి.పెళ్ళి మండపాలు అందుబాటులో లేక ఆకాశవాణి క్వార్టర్స్ లోనే పెళ్లి బాగా జరిగింది.మగపెళ్లివారు బళ్లారి నుంచి 23సాయంత్రం వచ్చేశారు.ఇక పెళ్లి ఐనాక కుండపోత వర్షం! ఇవి మరుపురాని ఘట్టాలు.
శైలజ ఎం.ఎస్సీ మాథ్స్ ఫస్ట్ క్లాస్ లో పాసవడం బి.ఇడి.మ్యూజిక్ డిప్లొమా చేశారు.భర్తకు మంచిర్యాల లో జాబ్! తొలి సంతానం తో అక్కడకు వెళ్ళిన ఆమె ఆపై టీచర్ గా కర్ణాటక ఆంధ్ర తెలంగాణా ల్లో వివిధ విద్యాలయాల్లో పనిచేసి ప్రస్తుతం ఎడిఫైవరల్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ గా సేవలందిస్తున్నారు.ఆమె భర్త వెస్ట్ ఆఫ్రికన్ రాజధాని బుర్కినోపానో లో డైమండ్ సిమెంట్స్ లో డైరెక్టర్ జనరల్ గా చేశారు.శైలజ దంపతులకు జయంత్ వసంత్ ఇద్దరు కుమారులు.కోడలు సాక్షి.అంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు.

 
శైలజ కర్ణాటక సంగీతంని పాకాల సావిత్రి దేవి దర్భముళ్ల శేషగిరిరావు గార్ల దగ్గర నేర్చుకున్నారు.సులభతరగణితంపై ఈమె రేడియో ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.CBSE పాఠ్య ప్రణాళిక తయారీలో విప్రో సంస్థ వారి ప్రతిభా పురస్కారం పొందారు.అనంత IAS అకాడమీ డైరెక్టర్ గా అంతర్జాలంలో కరోనా కాలంలో శిక్షణ ఇచ్చారు.పాట్నాలోని డి.వై.పటేల్ కాలేజీ వారి నాలెడ్జ్ ఎక్జిబిషన్ లో 2021 లో విశిష్ట పురస్కారం పొందారు.రోజూ మాతాజీ నిర్మలా దేవి సహజయోగాభ్యాసం ఉదయం 5_6 టైం లో చేస్తారు. బెంగళూరు లో ఎలైట్ వరల్డ్ రికార్డు యోగా లో ప్రపంచ రికార్డు క్రీడా డ్రిల్లు లో లక్షమంది పాల్గొన్నారు.నిర్వాహకురాలిగా ప్రశంసలు పొందారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“కుజదోషం”- కథ

వినాయక చవితి నానీలు