తెలుగు భాష గొప్పతనం
ఆహా ఏమని వర్ణించను దాని సౌందర్యం
వెలుగు జిలుగుల భాష
వన్నె చిన్నెల భాష
యాస ప్రాస ల తోటి వెలుగొందు భాష
పలుకు బడుల నుడి కారాల తో
పసందైన భాష
చమ త్కారా లతో చరిత్ర కెక్కిన భాష
అలంకారాలతో అందల మెక్కిన భాష
పర పాలన లో ఒదిగి యుండి
వినయమ్ము ప్రకటించిన భాష
పర భాషా పదాలను తనవిగా నెంచు
విశాల హృదయమున్నాభాష
జగతిలో లేదటంచు కీర్తి పొందిన భాష
అన్న మయ్య త్యాగ య్యల చే
దేవున్నె భువికి రప్పించిన భాష
కృష్ణ దేవ రాయలు చే కీర్తింప బడి
రారాజు వలె నింగి కెగ సిన భాష
అలాంటి భాష పర పాలన లో ప్రాపు కోసం
ప్రాకులాడిన వేళ
కలం పట్టి గళం విప్పి
కాపు గాచిన వైనం
స్మృతి పథం లో నిలుపు కుందాం
తెలుగు భాషా పరి రక్షణ కే పరిశ్రమిద్దాం
అమ్మా నాన్న అంటే మోటు
మమ్మీ డాడీ అంటే నీటు
వెళుతున్నాం రాంగ్ రూట్
పర సంస్కృతి వ్యామోహం లో పడు తున్నాం
మన సంస్కృతి నీ మరుగున పడేస్తున్నాం
ఎవరో ఏదో చేస్తారనే కన్నా
మన మేమీ చేసా మనే ది మిన్న
తెలుగు వాడిగా జీవిద్దాం
తెలుగు వాడి నని గర్విద్దాం