మధురమైన రోజు

నేను కొత్తగా సాంఘిక సంక్షేమ ఆర్మీ పోర్సెస్ ప్రిపరేటరీ
మహిళ డిగ్రీ కళాశాలలో భువనగిరి యాదాద్రి జిల్లాలో అడుగుపెట్టిన రోజు
మరపురాని రోజు
మధురమైన రోజు

దేశ రక్షణ లో మేము సైతం అంటున్న ఈ కళాశాలలో చదువుతున్న ఆ అమ్మాయిలను చూసి
నా కళ్ళు నన్నే ప్రశ్నించాయి..

దేశ రక్షణ కై తన మానప్రాణాలు సైతం లెక్కచేయొద్దని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే ఈ శిక్షకులను చూస్తుంటే….

పసి పాప నుండి పండు
ముసలి వరకు ఏడిపించే ఈ మగజాతికి సవాలు విసురుతున్నారు
ఇక్కడ అమ్మాయిలు

ఏడుపు ఎలా? ఉంటుంది అని ప్రశ్నిస్తున్నట్టున్నారు? ఈ కళాశాల అమ్మాయిలు.
పూర్వ చరిత్రను గుర్తు చేసుకుంటున్నారు ఇలా….

ఎవరమ్మా నిన్ను నిన్నుగా చూసిరి ?
ఎవరమ్మా నీకు నిండు గౌరవమిచ్చిరి?

రాజులేలినపుడా?
దేవుడేలినప్పుడా?
రాబందులేలినప్పుడా?

కండ్లకు గంతలు కట్టిన కథలూ
పండువోలే నిన్ను పంచి
అనుభవించిన కథలు
నాటి నుంచి నేటి వరకు
నీకు హక్కులు లేవంటూ
నీలో పిరికితనము నింపిరి

ఈ చరిత్రని తిరగరాయాలని నిర్ణయించుకొనిచదువుకొనుటకు గురుకులాలకు వచ్చిరీ అమ్మాయిలు

 

ఆడ జాతికి అండదండ
అవసరము లేదని
తెలివితేటలకు
ఆడ మగ తేడా లేదని నిరూపించే
ఆడపిల్లలు
శక్తి యుక్తులకు స్త్రీ పురుష భేదం లేదని
ఈ కళాశాల శిక్షకులు ఋజువు చేస్తున్న వైనం

గొప్పవారు ఎవరైనా వారిని మర్చిపోలేరన్నదే నిజం

రక్షణ కవచాలు ఈ అమ్మాయిలు
భక్షించే వాళ్ళ కు ఖడ్గ తేజస్సు లు ఈ అమ్మాయి లు
వీళ్ళ కు నేను గురువు గా ప్రాంగణంలో తొలిసారి అడుగు పెట్టిన రోజు
మరపురాని రోజు
రోజు మధురమైన రోజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

చానమాంబ-ప్రోలమ 

అమెరికా అనుభవాలలో భారతదేశ స్వాతంత్య వేడుకలు.