దారంతో ఎన్నో బంధనాలు ఏర్పడతాయి…..
గుమ్మానికి మామిడి ఆకుల తోరణం ఒక బంధం….
చేతికి కట్టుకునే పూజా కంకణాలు ఒక బంధం…
వివాహానికి మూడు ముళ్ళు ఒక బంధం…
రక్షక కట్టుకునే తావేదు ఒక బంధం ….
అలాంటిదే మరొక భరోసా ఇచ్చే బంధం రక్షాబంధన్..
నీ తోడు నేనున్నానని తెలిపే బంధం
సోదరి సోదరుడు కట్టేది క్షేమం కోరే బంధం,….
మిత్రుడు మిత్రుడికి… నీ తోడు నేనున్నా ననే కట్టే స్నేహబంధం…..
శత్రువులను మిత్రులుగా… చేసేది రక్షాబంధన్..
ప్రియమైన వారందరిని ఒకటిగా చేస్తే….అనురాగబంధం రక్షాబంధన్….
. వీటన్నిటిలో అంతర్లీనంగా దాగి ఉన్న దారం
యోగక్షేమాలు పెంచే కోశాగారం……ౠ
ఆ బంధనంలో ఉన్నవి వట్టి దారపు పోగు కాకూడదు….
బంధాలను స్థిరంగా నిలపడానికి…… కలగలుపుకుని వేసే పీఠముడులు కావాలి…..