॥॥ నా ప్రశ్నకు బదులేది॥॥

కవిత

మోడువారిననాజీవితంలోకివసంతంలావచ్చావు

నాలోనిస్త్రాణమైన  మనసునుతట్టిలేపావు

నీతో  అడుగులువేయిస్తూనన్నునన్నుగానిలబెట్టావు

నీచేతినిఅందించి  నాలో  ధైర్యాన్నినింపావు

ఇదంతాఏమనుకోను  నువ్వునాపైచూపుతున్న

ప్రేమనుకోనా  లేకజాలిఅనుకోనాఅనినాలో

నేనేమదనపడుతున్నప్పుడు  నీచల్లని

స్పర్శతో  నాకర్థమైందినువ్వుచూపేది

ప్రేమేననిమురిసిపోయానుఎడారిలా

మిగిలిపోతుందనుకున్ననాబ్రతుకుకు

ఆలంబనవునువ్వనిఆనందంతోనన్ను

నేనుమరిచాను  నువ్వులేనినేనులేననుకున్నాను

కానీఅంతలోనేనీలోమార్పు  కారణంతెలియదు

నాకుదూరంగాపరుగెడుతున్నావు  ఇన్నాళ్ళునాపైచూపిన

ప్రేమనిజంకాదంటేనేనుతట్టుకోలేకపోతున్నాను

కలలోకూడానీఎడబాటునుఊహించుకోలేను!చెప్పు

నాపైప్రేమలేకపోతేఇదంతాఎందుకుచేసావుప్రేమంటేకేవలం

మూడునాళ్ళముచ్చటనేనీ అయితేనీప్రేమలోనిజాయితిలేదా

ఒక్కసారి నా కళ్ళల్లో కళ్ళుపెట్టి చూడు నీకు నా బాధతెలుస్తుంది

నా  గుండె లోపలికి వెళ్ళి చూడు నీ కోసం నీ ప్రేమ కోసం

అలమటించే నా గుండె లయ చెబుతుంది నీ గురించి

నీలాంటి మేకవన్నె  పులులుంటారని తెలియక మోసపోయాను

కానీ  నువ్వు చేసిన  గాయం ఎప్పటికైనా నిన్ను దహించకమానదు

నిజం తెలిసిన రోజు   నా ప్రశ్నకు బదులిస్తావా.

Written by Lakshmi Sharma Trigulla

॥॥ రచయిత్రి పరిచయం॥॥

పేరు- లక్ష్మీశర్మ త్రిగుళ్ళ
గృహిణి
భర్త పేరు- మెట్రామ్ శర్మ
(HMT రిటైర్మెంట్ )
ప్రవృత్తి –కథలు కవితలు రచనలు
4/10/2021కిన్నెర ఆర్ట్ ధియేటర్స్ ఆద్వర్యంలో
( మబ్బులు వీడిన ఆకాశం) కథల సంపుటి
మన తెలుగు కథలు డాట్ కామ్ వారి నుండి
(30/10/2022) ఉత్తమ రచయిత్రి బిరుదు
(సందెపొద్దు గూటిలోకి) కథకు (ప్రథమ బహుమతి)
( విశిష్ట బహుమతి) ఉత్తమ కథ బహుమతి ఓకే కథకు మూడు
రావడం
వివిధ పత్రికలలో మరిన్ని కథలు ప్రచురణ జరిగింది
మీ అందరి అభిమానంతో మరిన్ని మంచి కథలు రాయాలన్నదే
నా ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

కలిిసి ఉంటే