మన మహిళామణులు

శ్రీమతి కె.ఎ.ఎల్.సత్యవతి

జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొని రచయిత్రి గా శ్రీమతి కె.ఎ.ఎల్.సత్యవతిగారు

సత్యవతి గారి బాల్యం ఆనందాల హరివిల్లు.అమ్మనాన్నలు కృష్ణ వేణి కుంచె సీతారాం మోహన్ రావు గార్లు.ఆమె మతాంతర వివాహం ని ప్రోత్సాహించిన మహామనీషులు.తాతగారు చనిపోటంతో తండ్రి తన తల్లి ఇద్దరు చెల్లెళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు బాధ్యత తీసుకుని సెంట్రల్ ఎక్సైజ్ శాఖ లో చేరారు.అమ్మనాన్నలకి 5గురు సంతానం లో సత్యవతి పెద్ద కూతురు.కాకినాడలో పుట్టిన ఈమె1965 లో హెచ్.ఎస్.సి.పాసైనారు.క్లాస్లో 3 గ్గురు అమ్మాయిలు మిగతా వారంతా బాయ్స్.ఆమెకు ఆటలు సాంస్కృతిక ప్రోగ్రాంలలో బోలెడన్ని ప్రైజులు.డిక్షనరీ చూడటం అలవడింది.అప్పట్లో తండ్రి ఉద్యోగరీత్యా అలంపూర్ లో ఉన్నారు.కాలేజ్ లేదు.తండ్రిద్వారా సాహిత్యంపై అభిరుచి కల్గింది.చందమామ బాలమిత్ర మొదలైన పుస్తకాలు చదివిన సత్యవతి ఆరాత్రి ఇంట్లో అందరికీ హావభావాలతో కథలు ఆసక్తి కరంగా చెప్పేవారు.హైదరాబాద్ లో కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లో చదివారు.కల్చరల్ సెక్రటరీ గా మిమిక్రీ మోనోయాక్షన్ తో బహుమతులు పొందటం అందమైన అనుభవం.
ఆమె తన ప్రేమ కథను ఇలా పంచుకున్నారు “8వక్లాస్ లో నా క్లాస్మేట్ ఖాజా మొయినుద్దీన్ తో సన్నిహితంగా మెలగటం అది క్రమంగా మేఘసందేశం పంపేదాకా వచ్చింది.అలంపూర్ లో చిగురించింది.కానీ మానాన్న ఓషరతు పెట్టారు ” ఎవరికాళ్ళమీద వారు నిలబడే దాకా ఆచితూచి హద్దుల్లో ఉండమని.నేను హైదరాబాద్ లో పాలిటెక్నిక్ ఆయన సిటీ కాలేజ్ లో ఇంటర్ చదివి ఎ.పి.పి.ఎస్.సి.పాసై కొత్త గూడెం లో జాబ్ లో చేరారు.ప్రతినెలా హైదరాబాద్ వచ్చి మా అమ్మ ను బ్రతిమాలేవారు.మామామగారు కూడా అంగీకరించారు.1970లో ఆయన సాక్షి సంతకం పెట్టడంతో రిజిష్టర్ ఆఫీస్ లో మా పెళ్లి ఐంది.మా అత్త గారి ఇంట్లో అంతా ఇప్పటికీ ప్రేమ గా చూస్తారు.నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు.టైప్ షార్ట్ హ్యాండ్ పాసై ఇంట్లో కూచున్నా.


1970 నుంచి మహబూబ్నగర్ లో స్థిరపడ్డాం.మాబాబుకి 4వ ఏట మావారి ఆఫీస్ లో టైపిస్ట్ గా చేరాను.ఆపై కలెక్టర్ ఆఫీసులో ఎల్.డి.సి.గాచేశాను.ఆతర్వాత అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ లో చేరి 2008 లో రిటైర్ అయ్యాను.రూల్స్ అతిక్రమించకుండా నీతి నిజాయితీ నిబద్ధత తో మంచి పేరు పొందాను.”దైవం కి కన్ను కుట్టింది.మంచి ప్లేయర్ ఐన ఆమె భర్తకు అనారోగ్యం ఒక కాలుని మోకాలు దాకా తీసేయడం గొప్ప విషాదం.ప్రతివారం బస్లో హైదరాబాద్ నిమ్స్ కి చెకప్ కి తెచ్చేవారు సత్యవతి‌ ఆదర్శ సతి.కొడుకు వేరే రాష్ట్రం లో చదువు కుంటున్నాడు.అలాంటి విషాద స్థితిలో 1990_92 మధ్య స్వాతి సచిత్ర వారపత్రిక లో బాపూ బొమ్మ కు కథరాయమని భర్త వెంట పడి ప్రోత్సాహించిన ఫలితంగా ఆమె 29కథలు బహుమతులు పొందటం విశేషం.2013లో పెద్ద తమ్ముడి పట్టుదలతో బాపూ బొమ్మ లు చెప్పిన కథలు పుస్తకం గా రావడం ఇంకో మలుపు.భర్త మరణంతో కుంగిపోయినా కథలు రాయడం తగ్గించినా దుఃఖాన్ని హృదయం లోనే పదిలపర్చుకుని సాగుతున్నారు.ఆంధ్రభూమి వారపత్రికలో కోయిలా కూఇలా అనే శీర్షిక కి కవితలు రాయసాగారు.పెన్షనర్స్ యూనియన్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఈమె 15 ఆగస్టు 26జనవరి 2 జూన్ కి కవితలు తప్పక చదువుతారు.కవిబృందంతో కల్సి చండీగఢ్ భువనేశ్వర్ తిరువనంతపురం గుల్బర్గా మొదలైన ప్రాంతాల్లో పర్యటించారు.ఇక పొందిన పురస్కారాలు ఇవి
1994 లో గురజాడ సాహితీ విశాఖ పట్నం వారి కథలు పోటీలో ఫస్ట్ ప్రైజ్ విశ్వసాహితీ‌అంతర్జాతీయ కవితలపోటీలో బూర్గుల రామకృష్ణారావు పురస్కారం దేవులపల్లి వారి పురస్కారం 2013 లో విశాలాక్షి మాసపత్రిక కథలు పోటీలో ప్రత్యేక బహుమతి వేదగిరి కమ్యూనికేషన్స్ వారి కథల్లో 2 వబహుమతి 2022లో అక్షర యాన్ వారి షష్ఠిపూర్తి కలాల కి వందనం లో సన్మానం మహిళా స్త్రీ శక్తి పురస్కారం ఎన్నో మరపురాని అనుభూతిని అందించాయి.

సమాజహితం మానవత్వం పెంచేలా సమస్యా పరిష్కారం చూపేలా రచనలు ఉండాలి.పెళ్లివిషయంలో ఆచితూచి హద్దుల్లో వ్యవహరించాలి.పుట్టింటి అత్తింటి సపోర్ట్ ముఖ్యం.కో ఆపరేషన్ కోఆర్డినేషన్ ఎక్కడా తగ్గకుండా పట్టుపట్టాలో తెల్సి ఉండాలి అనేది ఆమె సందేశం.రోజూ స్నేహితులతో సత్కాలక్షేపం ఫోన్ లో కబుర్లు చెబుతూ తాను కాలక్షేపం చేస్తున్నారు.ఆమెకు స్ఫూర్తి ప్రదాత భర్త ప్రోత్సాహంతో చిన్న కథలు నించి వారపత్రికల స్థాయికి ఎదిగిన ఆమె కలం నుంచి రచనలు రావాలని తరుణి కోరిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

॥॥ నా ప్రశ్నకు బదులేది॥॥