Olympics – Vinesh Phogat ఏ దృష్టి తో చూడాలి

11-8-2024 తరుణి పత్రిక సంపాదకీయం

చిన్నప్పుడు ఆటలలో ” నీ నేలంత తొక్కి తొక్కి పాడుచేస్తున్నా” అంటూ ప్రత్యర్థి ఏరియా ఉన్న డబ్బాలో కి వెళ్లి కాళ్లతో నేలను గట్టిగట్టిగా తొక్కే వాళ్ళం. ఇదో ఆట .అదో సరదా. అయితే ఆటలు సరదా కోసం ఆడేవి , పోటీలతోనూ సరదాగా ఆడేవి. ఉంటాయి. ఈ ఆటల్లో నూ గెలుపు ఓటములు ఉంటాయి.
అటువంటిది ఒలంపిక్స్ వంటి క్రీడల్లో పోటీ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రపంచం మొత్తం నుండి అన్ని దేశాలు పాల్గొంటాయి. పతకాల కోసం పోటీలు. మన వినేష్ ఫాగట్ ఒలంపిక్స్ క్రీడాకారిణి. భారత దేశంనుండి తొలి భారత మహిళా రెజ్లర్ గా తన సత్తా చాటిన క్రీడాకారిణి.
ఉక్రెయిన్ దేశ క్రీడాకారిణి ఒక్సానా లేవాచ్ పైన గెలిచి రజత పథకాన్ని అందుకున్న వినేష్ మరో క్రీడాకారిణి సారాహిల్డ్ బ్రాంట్ ఫైనల్ పోటీలో పాల్గొనాలి. ప్రత్యర్థిని ఎంతో వ్యూహాత్మకంగా దెబ్బకొట్టే నైపుణ్యంతో వినేష్ అందరినీ ఆకట్టుకున్నది.
అయితే అనుకున్నది ఒక్కటే అయింది ఇంకొకటి. ఫైనల్స్ లో ఆడి తప్పకుండా భారతదేశానికి గోల్డ్ మెడల్ సాధిస్తుంది అనుకున్నారు. కానీ ఒలంపిక్స్ నియమాలకు అనుగుణంగా శారీరక బరువు లేదు ఉండాల్సిన దానికన్నా 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నది అని ఆమెను పోటీలో పాల్గొననీయలేదు.
ఈ కారణం రెండు రకాల సందేశాలనిస్తున్నది. ఒకటి 100 గ్రాములు ఒక గొప్ప సంఖ్య అవుతుందా బరువు విషయంలో అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నియమం నియమమే అని అందరూ ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది. 50 కిలోల విభాగంలో మొదటి రౌండులో వినేష్ తన ప్రత్యర్థి జపాన్ క్రీడాకారిణి సుసాకితో పోటీలో దిగింది. తను బౌట్ లో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో రెస్లర్ వినేష్ ఎందరో యువ క్రీడాకారులకు ఆదర్శప్రాయంగా నిలిచింది.
అయితే నియమం ఉన్నప్పుడు ఒక గ్రామైనా, 100 గ్రాములైనా, ఒక కిలో అయినా నియమ విరుద్ధంగా ఉంటే ఒప్పుకోరు అని తెలిసి ఉన్నప్పుడు క్రీడాకారులే జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఉంటుంది అనేది ఒక వాదన! ఇదే ఒక పెద్ద సందేశం.!! ఇక రెండో సందేశం క్రీడాకారుల బాధ్యత ఎంత ఉంటుందో నిర్వాహకుల బాధ్యత కూడా అంతే ఉంటుంది ఏ విమర్శకు తావీయని నిర్ణయాలు నిర్వాహకులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది మరొక సందేశం.
ఈ సంవత్సరం 20 24 ఒలంపిక్స్ వేదిక పారిస్ నగరం.
100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్న కారణాన ఆటలో సస్పెన్షన్ ఇవ్వడంతో వినేష్ పోటీలో పాల్గొనలేకపోయింది. ఆమె తరపున న్యాయస్థానానికి అంటే సిఐఎస్ కు భారత ఒలంపిక్ సంఘం సవాల్ చేసింది . మన దేశ లాయర్లే కాకుండా ఫ్రెంచ్ లాయర్లు సహాయం చేశారు. తీర్పు వాయిదా పడింది. గతంలో జపాన్ రెజ్లర్ క్రీడాకారుడికి ఈ అనుభవమే ఎదురయింది. 50 గ్రాములు బరువు ఎక్కువ ఉన్నాడన్న కారణంతో అతనిపై వేటు వేశారు. ఆహారము ఆందోళనలు క్రీడాకారులను చుట్టుముట్టుకుంటాయి. నిర్దేశిత బరువు , లెక్కలు ఎక్కడికి వెళ్తాయి? ఒలంపిక్స్ సందర్భాన్ని చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. ఏదేమైనా భారతదేశానికి కీర్తిని సంపాదించి పెట్టిన రెజ్లర్ వినేష్ ఫాగట్ కీర్తి ఎప్పుడూ వన్నె తగ్గదు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత వైపే చూస్తున్నది. నియమాలా? క్రీడాకారుల శ్రమనా ?ఏది గెలుస్తుందో చూడాలి. ఇవన్నీ అయోమయాలకు గురిచేసినా, సత్యం ఏదో తెలిసి ఉండీ, న్యాయం ఎటువైపు నిలుస్తుందో ఎదురు చూడాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పద్యం

రాయల కవియిత్రి రాణి ఒడువ తిరుమలాంబ