ముందుగా తరుణి పాఠకులకు శ్రోతలకు నా నమస్కారములు గత కొన్నివారముగా శేషప్ప కవి రచించిన”నారాయణ శతకం” నుండి పద్యాలను, భావాలనూ తెలుసుకుంటున్నాం.ఈ వారం మరొక పద్యం చూడండి .
పసరంబు పం జై న పసుల కాపరి తప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు
భార్య గయ్యా ళ్ళైన ప్రాణనాధుని తప్పు
తనయుడు దుష్టైన తండ్రి తప్పు
సైన్యంబు చెదిరిన సైన్యనాధుని తప్పు
కూతురు చెడుదైన మాత తప్పు
అశ్వ o బు చెడుదైన నారోహకుని తప్పు
హస్తి దుష్టైన హస్తివకుని తప్పు
ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చి
నటుల మెలగదు రివు డి య వనిజనులు
భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస
దుష్ట సంహార నరసింహ దురితదూర!
ఇప్పుడు భావం చూడండి
పశువులు తప్పిపోతే పశువుల కాపరుని తప్పు . ప్రజలు దుర్మార్గులు అయితే పరిపాలించే రాజూదే తప్పు. భార్య గయ్యాళ్ళి లాగా ప్రవర్తిస్తే భర్త దే తప్పు. కుమారుడు చెడిపోతే తండ్రిది తప్పు. సైన్యం చెదిరిపోతే సైన్యాధిపతిది తప్పు .కూతురు చెడిపోతే తల్లిదండ్రు లేదే తప్పు. గుర్రం సరిగా నడవకపోతే ఆరోహకుని దే అంటే అశ్వాన్ని నడిపే వాడి తప్పు. హస్తి, అంటే ఏనుగు చెడుగా ప్రవర్తిస్తే హస్తివకుని ది తప్పు. తప్పులు తెలుసుకోకుండా, ఈ భూమి మీద మనుషులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు . అంటే అర్థం, వీటన్నిటిని కాపాడడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత ఉంది కాబట్టి తప్పు ను వాళ్ళపై , వాటిపై తోసేసెయ్యడానికి లేదు అని కవి సూచిస్తున్నాడు.