నిష్కృతి

కథ

(గత వారం తరువాయి)

ఇంట్లో అడుగు పెడుతూనే మంచి గంధం అగరు బత్తి వాసన.గుమ్మాలకి బంతి పూల తోరణాలు మండువా లోగిలి చక్క గుంజలకి బ్రాస్ తొట్టి లోంచి ఎగబాకిన కాశీరత్నంతీగ పూలతో గుంజలకు ఎఱ్ఱబల్బులు చుట్టినట్లు శోభాయమానంగా ఉంది.

ఉయ్యలబల్ల దాని ప్రక్కనే పాతకాలంనాటి చక్కసోఫాలు. సోఫాల ఎదురుగా నగిషీతో చిన్న రౌండ్ టేబుల్. దానిమీద కంచు చెంబులో నీళ్ళుపోసిమందారాలు గులాబీలు.రజనీ గంధాలుఆకులతో ఎంతోఅందంగా అలంకరింపబడి, మండువా అటుపక్క అరుగు మీద పడక కుర్చీ దాని
పక్కనే గడమంచి మీద ధాన్యపు బస్తాలు,అటు ప్రక్క
సేద్యపు పని ముట్లు.మండూవా లోగిలి లో మూడడుగుల రాధా కృష్ణ విగ్రహం.

“ఎంతో ముచ్చటగా ఉంది” అనుకుంది శా‌రద.

ఒకే ఒక్క చూపుతో ఇల్లంతా ఎక్సరే కళ్ళతో చూసిన విశ్వనాధానికి ముతక వాసన వచ్చింది.

రాకేష్ కి తాతగారిల్లు గుర్తుకొచ్చింది. మావయ్య పిల్లలూ పెదతల్లి పిల్లలతో నాలుగు స్థంభాల ఆట, తాతయ్య వళ్ళో ఉయ్యాలబల్ల మీద పడుకొని నిద్రపోవటం,అమ్మమ్మ వెండిగిన్నెలో అన్నం తినిపించటం.
అలా కలలో తేలియాడుతూ వెళ్ళి ఉయ్యాల బల్ల మీద కూర్చుని కాళ్ళతో ఉయ్యాల ఊపుతూ” అమ్మా ఎన్నాళ్ళయిందో ఉయ్యాల బల్లమీద కూర్చుని” అన్నాడు రాకేష్.
“అవునురా తాతయ్య గుర్తుకొస్తున్నారా!”అంది శారద.
“బాబు! సోఫాలో కూర్చోండి అంటూ మర్యాద చేయబోయాడు వాసుదేవశాస్త్రి.

విశ్వనాధానికి ఆ తల్లి కొడుకుల పధ్ధతి నచ్చలేదు.

శారదకు తన చిన్నతనం గుర్తుకువచ్చి సంబరపడిపోయింది .జానకీ తో స్నేహపూరిత సంభాషణకి దిగింది.
విశ్వనాధానికి ముళ్ళమీద కూర్చున్నట్లుంది.ఊ,ఆ అంటూ పిల్లని చూసామా అంటే చూసా మన్నట్లు ప్రవర్తించాడు.
శారదకు రాకేష్ తరువాత ఆడపిల్ల పుట్టి ఏడాది పెరిగి పోవటంతో శివానిని ముద్దు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ.
మొత్తంమీద పెళ్ళివారు తిరుగు ప్రయాణం కట్టారు.
శారద భర్తకి తెలియకుండా కొన్నచీర బ్లౌజు ,స్వీట్స్, పళ్ళు,విరజాజులు బొట్టుపెట్టి శివానికి ఇచ్చి, “ఎప్పుడొస్తావురా తల్లీ మా ఇంటికి” అంటూ బుగ్గ గిల్లింది.
“ఆంటీ స్వీట్స్ హాట్స్ చాలాబాగున్నాయి.మా అమ్మమ్మ చేసినట్టు” అంటూ జానకికి,వాసుదెదేవశాస్త్రి కి చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం పెట్టాడు.

ఎవరూచూడకుండా శివాని వైపు తిరిగి కన్ను గీటాడు. శివాని సిగ్గుతో మొగ్గైంది. బుగ్గలు కమలాలే అయ్యాయి.
★★★
ఇంటికి రాంగానే విశ్వనాధం ఉగ్రనరసింహం అయ్యాడు.
“పోయి పోయి ఆ పౌరోహిత్యం కుటుంబం. అది చాలనట్లు వ్యవసాయం.మనవాడి చదువుకి ఆయింటి వాతావరణానికీ ఏమైనా పొత్తు ఉందా?”

ఎంతో నిగ్రహంగా ఉన్న రాకేష్ వ్యవసాయం అంటూ. తండ్రి ఎగతాళి తట్టుకో లేక పోయాడు.దానికి కారణం.మెడికల్ కేంప్స్ కి వెళ్ళినప్పుడల్లా వారి ఆరోగ్యం వ్యవసాయంతో ఎంత క్షీణిస్తోందో అయినా వారు కష్టపడటం వారికోసం కంటే పది మందికి అన్నంపెట్టటానికని తెలిసిన వ్యక్తి.

“ఔను నాన్న గారు!వ్యవసాయమే !వ్యవసామంటే చిన్నచూపు చూస్తున్నారు.మీకసలు వ్యవసాయం అంటే అవగాహన. ఉందా ఉంటే చెప్పండి.

అసలు ఒక ఎకరం అంటే ఎంత స్థలం ఉంటుంది?
పోనీ ఎకరాకు ఎన్ని గుంటలు?
ఎకరాలో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి?
ఇలా పట్టణాళ్ళో ఉండేవాళ్ళకి ఎంతమంది కి తెలుసు?
90%మందికి తెలియదు.తెలుసు కోవాలన్న ఆసక్తి అవసరం లేదనుకుంటారు? ఎందుకంటే పల్లె వదలి పట్నం బాట పట్టడమే కావచ్చు.

బాగా వినండి వ్యవసాయ కుటుంబాల నెలసరి ఆదాయం 20 లేక 15000 ఉంటుందేమో!
ఒక్కొక్క కుటుంబానికి సగటున ఒక లక్ష అప్పే
ఉంటుంది.ఆ అప్పు వ్యవసాయం అవసరాల గురించి చేసినదే.
ఈ అప్పుల్లో దాదాపు 70 శాతం బ్యాంకు లు co-operative societies, ప్రభుత్వం వంటి వ్యవస్థాగత సంస్థలనించీ తీసుకున్నవే.20% అప్పులు వ డ్డీ వ్యపారుల నించీ తీసు కున్న అప్పులు.
దేశంలో పది కోట్ల వ్యవసాయ కుటుంబాలున్నా ప సంవత్సరమంతా కష్టపడి ప్రకృతి వైపరీత్యాలతోను,దళారీలతోనూ అణగారి పోతున్నా వ్యవసాయం వదులు కోవటం లేదు
కాబట్టే మీకంచంలోకి నా కంచం లోకి తినటానికి పట్టెడన్నం వస్తోంది.ఇక పౌరోహిత్యం అని ఎగతాళి చేస్తున్నారు.రేపు నా పెళ్ళి పురోహితుడు లేకుండా చేస్తారా?
మీకిష్టం లేకపోతే నా పెళ్ళి విషయం ఎత్తవద్దు.అంతేకాని పౌరోహిత్యం,వ్యవసాయం,బట్టలునేసేవాళ్ళు అంటూ వృత్తులను హేళన చేయవద్దు.తలక్రిందులు తపస్సు చేసినా ఆవిద్యలు మనం నేర్చుకోలేము వారిని దయుంచి చిన్న చూపు చూడవద్దు.”అంటూ చరచరా బయటకు వెళ్ళాడు.
పసిమిరంగుఛాయ కాస్తా ఎఱ్ఱటి దానిమ్మ పండు
రంగైంది ఉక్రోషంతో.
విశాలమైన ఫాలంఉద్వేగానికి చిహ్నంగా చమటతో తడిసింది.
పెదవులు అసహనానికి చిహ్నంగా అదురుతున్నాయి.
విశాల నేత్రాలు మంకెన పూలయ్యాయి.

★★★

తను మాత్రం చిట్టి తల్లి పెళ్లి గురించి ఎన్నికలలు
కన్నాడుఅనుకున్నాడువాసుదేవశాస్త్రి..భగవంతుని దయవల్ల మంచి సంబంధం వచ్చింది.పాపం విశ్వనాధం అడిగినదాన్లో తనకు తప్పేమీ కనిపించలేదు. రాకేష్ శివానిల జోడీ ఊహించుకొని మురిసి పోని రోజులేదు వాసుదేవశాస్త్రి జానకిలు.
దరిద్రుడు తలకడిగితే వడగళ్ళ వాన అన్నట్టు వడగళ్ళవాన, అకాల వర్షంతో పంట నాశనమవటం తన దురదృష్టం
★★★

నెమ్మదిగా లేచి కండువా బుజం మీద వేసుకొని “నాన్నా శేఖర్ రా”అలా బయటకువెళ్ళొద్దామని పంచాయితీ వైపు అడుగు వేసాడు వాసుదేవశాస్త్రి.అరుగు మీద పెద్దలతో తను 3ఎకరాలు అమ్మదలచు కున్నట్లు తెలిపాడు.”ఏ‌రా వాసూ నీకేమైనా మతి పోయిందా!అంతఘంచి పొలం అమ్మితే మళ్ళీ కొన గలవా! అంటూ రాఘవరావు వాసుదేవశాస్త్రి ప్రాణమిత్రుడు కోప.పడ్డాడు.వాసుదేవశాస్త్రి తన గోడు రాఘవరావుతో పంచుకొని కొంత సేద తీరాడు.
కొంతసేపు ఆలోచించి”ఒరే వాసు నాకైతే ఈ సేద్యంచేసే శక్తి లేదు కానీ నేనే నీదగ్గర పొలం కొంటాను అదీ నీ తృప్తి కోసం.నీకు పైకం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి కొనుక్కో. నేను ముదుపు పెట్తా నువ్వే సేద్యం చేసుకో !లాభం కానీ నష్టం కాని చెరిసగం. ఏమంటావు?స్నేహితుడిగా ఇంతకంటే ఏమీ చేయలేను.అదీ సమయానికి మావాడు అమెరికానించీ పంపిన డబ్బులు బ్యాంకు లో సమయానికి ఉన్నాయి. శివాని నాకూ కూతురులాంటిది.”అన్నాడు.
“స‌రే “అని అమ్మకం వ్యవహారమంతా శేఖర్ ఎదురుగానే జరిగింది .
మొట్టమొదటి సారి తండ్రి మీద జాలి అక్కమీద ఎక్కడ లేని కసి ఏర్పడింది శేఖర్హ కి పొలం అమ్మటానికి అక్కే కారణమని.
★★★

విశ్వనాధం గారు కోరినట్లుగా పెళ్ళి అంగరంగ వైభవంగా కానిచ్చాడు వాసుదేవశాస్త్రి. పెళ్ళిసందడంతా అయిపోయింది. పడక కుర్చీలో పడుకొని వాసుదేవశాస్త్రి కి ఏం జరిగింది? ఏంచేసాను?
12ఏళ్ళ పసి వాడిని ఎలా పైకి తేవాలి?అనే ఆలోచన కృంగదీసింది.
★★★
అంతలోనే శివాని పెళ్ళైన మొదటి దీపావళి పండుగ రానే చ్చింది జానకి హడావుడి ఇంతా అంతా కాదు.
“ఏమండీ అమ్మాయికి పట్టుచీర కొనాలండీ.అల్లుడికి బ్రాసిలెట్ తీసుకుందామండీ”ఏమంటారు అంది జానకి.
“ఏమంటాను జానకి నాకు మాత్రం ముద్దు మురిపం జరపాలని ఉండదా!కానీ 70,000పలుకుతోంది బంగారం అంటూ నసిగాడు.
“ఏమండీ నాకు మాత్రం పరిస్థితి తెలిదా!అందుకే ఈ గాజు తీసికెళ్ళి మన ఆచారి దగ్గర చెరిపించి బ్రాసిలెట్ చేయమనండి.”అంటూ చేతి గాజు తీసి భర్త చేతిలో పెట్టింది.
అప్పుడే ఆటల నించీ వచ్చిన శేఖర్ తల్లి గాజు తీసి ఇవ్వడం తల్లి మాట్లాడిన మాటలూ అక్క శివాని మీద ద్వేషం ద్విగణీకృతం చేసింది.

. కానీ ఆ ద్వేషం ఎక్కువ కాలం నిలవలా.అక్కా బావ రాకతో శేఖర్ మొహం మతాబులా వెలిగింది. శేఖర్ కి బావ అంటే చాలా ఇష్టం.ఎప్పుడూ తను ఏంచదవాలి?ఎలా చదవాలి అంటూ సలహాలివ్వటంఎన్నో తెలియనివిషయాలు
తెలియచెప్పటంతో అక్కతో దూరం పెరిగి బావకి దగ్గిరయ్యాడు.
ఎప్పటిలాగే వాసుదేవశాస్త్రి మతాబులు,టపాకాయలు తెచ్చా రు. అయితే అప్పుచేసి.జానకమ్మ కూతురు కి ఇష్టమని బొబ్బట్లు చక్కిలాలు ,జున్ను చేసింది.
టపాకాయలు ఎప్పుడూ అక్కా తమ్ముడుపోటీపడి కాల్చే వాళ్ళు.తమ్ముడు ఎక్కడ చేయి కాల్చుకుంటాడో అని చాలా జాగ్రత్తలు తీసుకునేది శివాని.
“అమ్మా! తమ్ముడెందుకు అదోలా ఉన్నాడు? నన్ను తప్పించుకు తిరుగుతున్నాడు? ఒక్కసారైనా అక్కా అని పిలవ లేదు.”అడిగింది తల్లిని శివాని.
“ఏం లేదు లే! నువ్వు ఇలా వాడికి కొత్తగా కనపడుతున్నావు.అదీకాక వాడిని వదిలి వెళ్ళావనో అలకై ఉండ వచ్చు.నువ్వే దగ్గరకి తీసుకో!నీ పెళ్ళైనప్పటినించీ వాడు వంటరి వాడయ్యాడు.”అంటూ సమర్ధించింది జానకమ్మ.

సాయంత్రం టపాకాయలు కాల్చడానికి రాకేష్ ఇష్ట పడక సున్నితంగా తిరస్ఠరించాడు తనకి పొల్యూషన్ పడదని.భర్త కాల్చక పోవడంతో శివాని కూడా ఏదో శాస్త్రానికన్నట్లు కాల్చి ఊరుకుంది.

చాలా మతాబులూ టపాకాయలూ మిగిలి పోవటంతో నాగులచవితి వరకూ రోజూ కాల్చవచ్చని
సంబరపడ్డాడు శేఖర్.
కానీ చాలా కొద్ది టపాకాయలుంచి అన్నీ ఒక బేగ్ లో సర్దింది శివాని.
“వెళ్ళొస్తా అమ్మా! వెళ్ళొస్తా నాన్నా!” అంటూ తల్లి పేక్ చేసి ఇచ్చిన తినుబండారాలన్నీ కారులో పెట్టుకుంది శివాని.శేఖర్ బాగా చదువుకో .మళ్ళీ
వీలైనప్పుడు వస్తాంలే.” అంటూతమ్ముడికి ముద్దు పెట్టి కారెక్కింది శివాని..
“వస్తాం !మావయ్యా!అత్తయ్యా!” అంటూ శలవు తీసుకున్నాడు రాకేష్
శేఖర్ చిన్ని మనస్సు ఇతమిథ్థం అని తెలుసుకోలేని సంఘర్షణకి లోనైంది.ఏదో నిస్సహాయత అక్కమీద ఒకవైపు ప్రేమ ఇంకొకవైపు తాము ఆర్ధికంగా ఇబ్బంది పడటానికి అక్కే కారణమని కోపం.
★★★
కాలచక్రం ఆగకుండా పరుగెడుతూనే ఉంది.ఐదేళ్ళు చకచకా గడిచాయి శేఖర్ టెన్త్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు.ఇంటర్ స్టేట్ థర్డ్ ర్యాంకులో ఉత్తీర్ణుడయ్యాడు.
నెక్స్ట్ ఏమిటి అన్న ప్రశ్న తలెత్తింది.
“నాన్నా! మన ఆర్ధిక పరిస్థితిని బట్టి నా చదువు నిర్ణయించుకో దలచు కున్నా.మిగిలిన కాస్తపొలం అమ్మినా నా చదువుకి సరిపోదు. మిమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేయలేను. నేను కంప్యూటర్ ,ఎకనామిక్స్ తీసుకుని అక్క చదివిన కాలేజీలో చేరతాను.”అన్నాడు శేఖర్.
“ఒరే పిచ్చి సన్నాసి!అక్క నీచదువు గురించి ఎనిమిది లక్షలు డిపాజిట్ చేసిందిరా.పొలం కూడా అక్కబావ తిరిగి కొన్నారు.అక్క బావ నువ్వు ఏ యూనవర్సిటీలో చదివితే ఆక్కడ.నిన్ను చదివించే బాధ్యత తీసుకున్నారు. అక్క కూడా పి. హెచ్.డి పూర్తి చేసింది. గవర్నమెంటు కాలేజీలో లెక్చరర్ గా చేస్తోంది. నువ్వు అక్క విషయం ఆసక్తి కనపరచక పోగా చిరాకు పడటం, అది వచ్చినప్పుడు స్టడీ అవర్స్సకి నువ్వు వెళ్ళిపోవటం నువ్వు నుకున్నట్లు గ్రహించలేనంత అమాయకులం కాదు మేము. నీప్రవర్తనకి అక్క ఎక్కడ బాధ పడుతుందో అని. మేము దానిని అనునయించి నిన్ను మందలిద్దామంటే వద్దని అడ్డుపడింది అక్క.
“అమ్మా,నాన్నా !మీరు ఏవిధమైన మందలింపులు చేయవద్దు. వాడు చదువులో పట్టుదలతో ఉన్నాడు.వాడు టీన్ ఏజ్ లో ఉన్నాడు.ఇమోషన్స్ అలానే ఉంటాయి.వాడే నెమ్మదిగా రియలైజ్ అవుతాడు.ఇప్పుడు ఏం మాట్లాడినా డిస్ట్రబ్ అవుతాడంటూ మా నోరు నొక్కేసింది.ఇప్పుడుకూడా చెప్పకపోతే తల్లిగా.నేను.దోషినవుతాను.ఇన్నేళ్ళు నీ చదువుకి అక్కా బావలు బాధ్యత తీసుకున్నారు.” అంటూ పాస్ బుక్ చూపించిందిజానకి.

తమ్ముడి రిజల్ట్స్ వచ్చాయని తెలిసి తమ్ముడితో గడుపుదామని వంటరిగా వచ్చింది శివాని..
తల్లి చెప్పిన మాటలు, చూపించిన పాస్ బుక్ చూసిన శేఖర్ పశ్చాత్తాపానికి లోనయ్యాడు.
ఎప్పుడూ అక్కని వాటేసుకొని పడుకొనే చిన్నారి శేఖర్ మళ్లీ మేల్కొన్నాడు.
ఆరోజు రాత్రి పసి పిల్లాడిలా అక్కని వాటేసుకొని “నన్ను క్షమించు అక్కా……నిన్ను అపార్ధం చేసుకున్నా. నా పాపానికి నిష్కృతి లేదంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు.
అంతలోనే హఠాత్తుగా “నావంతు టపాకాయలు ఎందుకు తీసికెళ్ళావు?”అంటూ తనకిష్టమైన అక్కబుగ్గల్ని లాగుతూ అడిగాడు.

“ఎందుకంటే ఆరోజు నాన్న ద గ్గర కూర్చుందామని వెళ్ళా.!ఆయన చేతికి ఉండే వెంకటేశ్వరస్వామి
ఉంగరం లేదు.అడిగితే మాట నాన్చారు.గుచ్చి గుచ్చి అడిగి తే అదికుదవ పెట్టి టపాకాయలు తెచ్చానన్నారు.అందుకే మారువాడీకి ఇచ్చే సి నాన్న ఉంగరం తెచ్చా”అంది శివాని.
“అయినాయా నీసందేహాలు” అంటూ శేఖర్ జుట్టు చిందరవందరచేసింది శివాని.
” ఒరేయ్! నువ్వు మీబావకంటే స్మార్టగా అవుతున్నావురా!”అంది అక్కున చేర్చకుంటూ శివాని.పాల ఇన్నాళ్ళ అక్కమీద కోపం హుష్ కాకి అయింది శేఖర్ కి.
“పిల్లలూ లైట్లాపి పొడుకుంటారా!అర్ధ రాత్రి అయింది .రేపు బావ,వాళ్ళ అమ్మా నాన్న వస్తున్నా‌రు. తొందరగాలేచి పాలు తేవాలి శేఖర్.”అంటూ హెచ్చరించింది జానకి.

★★★
తెల్లారి ఎనిమిది గంటలకల్లా విశ్వనాధంగా‌రు, శారద రాకేష్ లు వచ్చారు.
“ఏమోయ్ శేఖర్ స్టేట్ ర్యాంక్ కొట్టేసేవ్!”అంటూ అభినందనలు తెలిపి స్టార్ చాక్లెట్ ఇచ్చారు విశ్వనాధం.
మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ మండువా లోగిలిలో కూర్చున్నారు.
“నెక్స్ట్ ఏంచేద్దామనుకుంటున్నావు అమర్! ఏదైనా నీకిష్టమైన కోర్స్ ఇష్టంతో చదువు. ఎవ‌రి కోరిక తీర్చడానికి కాదు .నీకోరిక తీర్చు కోడానికి చదువు నీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది.”అన్నాడు రాకేష్.
“బావగారు కాంపిటీటివ్ ఎక్జామ్స్ రాసాను.సెలెక్ట అవుతానని కాన్ఫిడెన్స్ ఉంది.కానీ నాకు ఈ ఐ.ఐ.టి ఇంజినీరింగ్ డాక్టరు అవాలని లేదు. నా aim Indian agricultural scientist అవ్వాలని ఉంది దానికి తగ్గ కోర్సులు చదవదలచుకున్నా.మంందుగా B Sc agriculture, తరువాత post graduation PhD చేయాలి. IARI నా aim.”అంటూ విశ్వనాధం గారి వైపు తిరిగి “ఏమంటారు అంకల్ నా ఛాయస్ అన్నాడు కన్ను గీటుతూ.
” నాకు కూతురు లేదయ్యా లేక పోతే కుండ మార్పిడి చేసేవాడిని.” అంటూ మనస్పూర్తిగా నవ్వారు విశ్వనాధం ఆయనతో అందరూ జతకలిసారు.
. సమాప్తం

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పద్యం

“నేటి భారతీయమ్” (కాలమ్)