ముందుగా తరుణి పాఠకులకు శ్రోతలకు నా నమస్కారములు. గత నాలుగు వారములు గా భాస్కర శతకములోని కొన్ని పద్యాలు తెలుసు కొనే ప్రయత్నం చేస్తున్నాం అందులోభాగంగా ఈ వారం శేషప్ప కవి రచించిన నరసింహ శతకం లోని ఈ పద్యం చూడండి
తల్లి గర్భం నుండి ధనం తేడెవడు
వెళ్లిపోయే డి నాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్న మే కానీ
మెరుగు బంగారం బుమ్రింగబోడు
విత్తమార్జన చేసి విర్ర వీగు టే కానీ
కూడబెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమిలో పెట్టి
దాన ధర్మం లేక దాచి దాచి
తుదకు దొంగలకితత్తు రో దొరల కవునో
తేనె జుంటి గలియవా తిరువరులకు
భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస
దుష్టసంహార నరసింహ దురిత దూర
ఇప్పుడు భావం చూడండి
మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకు రాలేదు. వెళ్లేటప్పుడు వెంట తీసుకు పోలేము. లక్షాధికారైన ఉప్పుతో కూడిన ఆహారం తీసుకుంటాడు బంగారాన్ని తినలేడు కదా. ఇంత సంపాదించాం అంత సంపాదించాం అని పొంగిపోవడమే కానీ కూడా పెట్టిన సొమ్ము తినలేడు తేనెను బాటసారిలకు ఇచ్చినట్లుగా చివరకు సంపాదించిన ధనం దొంగలకు అవుతుందో దొరలకి అవుతుందో కదా.