నాయకత్వం – మహిళలు -2

30-6-2024 తరుణి పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకులు –

ఈ సమాజం ఎంత అదిమిపెట్టి చూడాలని ప్రయత్నించినా స్త్రీలు తమ శక్తిని యుక్తిని, వ్యక్తిత్వాన్ని సమయస్ఫూర్తిని సందర్భోచితంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు. భారత రాజ్యాంగంలో మహిళల అభ్యున్నతి కోసం ఒక్కో దశాబ్దంలో ఒక్కో రకమైన చట్టాలు వచ్చాయి.సంస్కరణలు చేశారు. అవి అందిపుచ్చుకొని తమంతట తాము విద్య, వైజ్ఞానిక ,సాంకేతిక, సామాజిక రంగాలతో పాటు రాజకీయ రంగం లోనూ ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు. గతవారం 23 జూన్ 2024 నాడు
చట్ట సభలలో నాయకత్వం వహించిన మహిళలు,
The woman power గురించి చెప్పుకున్నాం. పాశ్చాత్య దేశాలలో ను మహిళా నాయకుల ప్రస్తావన , కేంద్ర రాజకీయాల ప్రస్తావన వచ్చింది.
తెలుగు రాష్ట్రాలలోనూ లోక్ సభకు, అసెంబ్లీకి ఎన్నికైన మహిళ రాజకీయ ప్రతినిధుల గురించి విహంగ వీక్షణం చేసినట్లయితే, కొంతనైనా ఈ కాలం అమ్మాయిలకు తెలుస్తుంది.

ఆనాటి స్వాతంత్ర్య పోరాటాలలో ప్రతి పల్లె ప్రతి పట్నం జండాలు ఎత్తుకొని , పోరుబాట పట్టాయి. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలుగు వాళ్లంతా, హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్లంతా ఉత్తర భారత దేశంలో ఎంత ఉధృతంగా పోరాటాలు చేశారో ఇక్కడ వీళ్లు కూడా అంతే శక్తితో ఉద్యమాలు చేసి, దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించిన అనంతరం చట్టసభలలో మహిళలు కొందరు స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ ప్రముఖ నాయకీమణులను ఎట్లా గుర్తు చేసుకున్నామో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలోని మహిళా రాజకీయవేత్తలను గుర్తు చేసుకుందాం.

ఎప్పుడో 1929 లోనే బ్రిటిష్ ఇండియా కాలం లోనే “శారద ఆక్ట్” తీసుకువచ్చారు. శారద ఆక్ట్ అంటే, Child Marriage Restraint Act ! ఆడపిల్ల లకు 18 ఏళ్ల వచ్చాకే పెళ్లి చేయాలనీ, విద్యాహక్కు తప్పనిసరి ఉండాలని ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అయినా కూడా ఎన్నో సంవత్సరాల వరకు చెప్పాలంటే ఎన్నో దశాబ్దాల వరకు స్త్రీలకు ఈ హక్కును అనుభవించే అవకాశం లేకుండా చేసింది ఈ పురుషాధిక్య ప్రపంచం. అయినా సరే నిటారుగా నిలబడి మేము మా సత్తా చూపగలం అన్నారు ఈ మహిళా మణులు. ప్రథమ సార్వత్రిక ఎన్నికల కాలం నుంచే రాజకీయాలలో ఎదిగి చట్టసభలలో సీట్లను సాధించి అటు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎంతోమంది తమ ప్రతిభను చాటుకున్నారు. అయినా కూడా ఈ సమాజంలో ఎంతో తక్కువ శాతం స్త్రీలకు రాజకీయాలలో ఎదిగే అవకాశాలు వస్తున్నాయి. దీనికి ఎన్నో కారణాలు. సాధారణంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లే వాళ్లలో ఉన్న వాళ్ళ పిల్లలలో ఉన్న శక్తిని అంచనా వేయరు దీనికి ఒక చిన్న ఉదాహరణ గా ఓ రెండు సామెతలు చెప్పుకున్నప్పుడు, ” మూడేళ్ల పిల్ల ముంతకాసర” అని ఒక మొరటు సామెత ఉంది. ముంత అంటే కుండ. ఇంట్లో అమ్మాయి పుట్టిందంటే ఒక మూడేళ్లు నిండగానే చిన్న చిన్న పనులలో తల్లికి, తండ్రికి, ఇంట్లో వాళ్ళకు సహాయం చేస్తుందట . ఎంతో సంతోషంతో, ఎంతో మురిపంతో చెప్పుకునే సామెత ఇది.
ఇదే తల్లిదండ్రులు ఇంటి వాళ్ళు పురుషుల విషయానికి వస్తే, అబ్బాయిలు గా ఉన్నప్పుడు అనను ఇటువంటి సామెతను
” ముప్పై ఏళ్ల కొడుకు ముంత పట్టుకుంటే మురిసిపోయిందట తల్లి” అంటారు. ఎంత ఆశ్చర్యం! నమ్మశక్యంగా లేదు కదూ!! అబ్బాయిలైతే 30 ఏళ్ళు వచ్చాక పనిచేస్తుంటే తండ్రికి ఆసరాగా ఉంటే తల్లి మురిసిపోయింది అంటారు . ఈ వ్యత్యాసం ఇళ్లల్లోనే కన్న తల్లిదండ్రులే చూపించి పెంచినటువంటి సమాజం ఈ సమాజం. ఇది అమ్మాయి పని ఇది అబ్బాయి పని అని భేదాలు చేసి చూపించడమే కాకుండా అమ్మాయిని ఆరు బయట ఆడుకొని ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఆంక్షలు ఆంక్షలు. ఆంక్షలు మధ్య పెరిగిన ఆడపిల్లలు స్వేచ్ఛ లేక సమానత్వం లేదు అని గ్రహించలేక ఎదురు తిరగలేక ఎన్నో కష్టాలు పడి చదువు నేర్చుకున్నారు ఆ కాలంలో. కాలక్రమేణ పరిస్థితుల మెరుగై పాఠశాలలు ఎక్కువై ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకునే రోజులు వచ్చిన తర్వాత విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెరిగిన తర్వాత మెరుగైంది ఆడవాళ్ళ పరిస్థితి.
కానీ రాజకీయాలలో మాత్రం తగినంత శాతం ఆడవాళ్ళకి స్థానం ఇవ్వడం లేదు అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి కష్టమైనటువంటి సమయంలో గెలుపు ఓ ఆశ్చర్యమే! గెలిచిన వాళ్ళందరికీ మంత్రిత్వ శాఖలు ఇవ్వడం అనేది ఎక్కడుంది?
తెలంగాణలో చాకలి ఐలమ్మ స్ఫూర్తి ప్రదాతగా పోరాటాలలో నిలిచిన చరిత్ర ఓవైపున,
ఆనాటి ఆంధ్ర మహాసభ ఆవిర్భవించినప్పటి నుండి మొదలుకుంటే ఎన్నో ఉద్యమాలకు చేయూతనిచ్చారు స్త్రీలు . వాళ్లలోని దేశభక్తి త్యాగనిరతి సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటివి. ఝాన్సీ లక్ష్మీబాయి నుండి మొదలుకుంటే సరోజినీ నాయుడు , అని బిసెంట్, బసంతి దేవి, కస్తూరిబా గాంధీ ,సుజాత కృప లానీ, లక్ష్మీ సెహగల్,సావిత్రిబాయి పూలే, కమలాదేవి చటోపాధ్యాయ, అరుణ అసఫ్ అలీ, దుర్గాబాయి దేశ్ముఖ్ ఇలా ఎందరో పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్లు, పేర్లు తెలియని మహిళలు ఉన్నారు.
మానవ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అయినా కూడా పురుషులకు ఏమో ప్రత్యేకంగా చట్టాలనే అక్కర్లేదు స్త్రీలకు చట్టాలు తప్పనిసరి ప్రత్యేకంగా చేయవలసిన ఆగత్యం ఏర్పడింది. వరకట్ట నిషేధం కోసం చట్టం తీసుకురావాలి డొమెస్టిక్ వైలెన్స్ మీద చట్టాలు కావాలి. గృహహింస చేయవద్దు అనడానికి గృహింసలు వద్దు అని చట్టం కావాలి . ఇలా చట్టాలు తీసుకువస్తే కూడా అవి అమలు జరపడంలో న్యాయము ఉండదు జాప్యం చేస్తుంటారు వీటి వలన దోషులకు అలసత్వం దోషులెవరు ఏదో గ్రహాంతర వాసులు వచ్చి చేస్తున్నారా కాదు మనతో పాటు మన చుట్టుపక్కల మన ఇళ్లల్లో ఉన్న మగవాళ్లే వీళ్లకు తెలియని తనంతోనో కచ్చా గుణంతోనూ ఆడవాళ్ళు కూడా కొందరు మద్దతు ఇస్తూ ఉంటారు ఇలా ఆడవాళ్లు మగవాళ్లకు ఆడవాళ్ళపై హింస చేయడానికి మద్దతు ఇవ్వడం వెనక పితృస్వామ్యం వ్యవస్థ అనేది బలీయమైనటువంటి ముద్ర పడవేసింది.
యూరోపియన్ దేశాలలో స్త్రీల కొరకని ఎన్నో గొప్ప నిర్ణయాలు ఉన్నాయి అక్కడ మహిళాధిక్య సమాజమే ఎందుకంటే ఆస్తి కూతురుకు కొడుకుకు సమాన హక్కుని ఇవ్వాలి అని ముందు నుంచి ఉన్నది. దగ్గర సమాన హక్కు లేదు ఉన్న ఇవ్వనివ్వరు ద్వేషాలు పెంచుకుంటారు. 1984లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత స్త్రీలకు వారసత్వ సమాన హక్కు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టంగా తీసుకువచ్చారు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే పరిపాలన వ్యవస్థలో స్త్రీలు ఉన్నట్టయితే ఇటువంటి మంచి విషయాలను ప్రజలందరికీ చేరువలోకి తీసుకువచ్చేందుకు ముందు పరసలో నిలుస్తారు కదా” ఎహే నీకెందుకు రాజకీయాలు” అని పక్కన పడేస్తే ఎలా? అయినా కానీ మన తెలుగు రాష్ట్రాలలో అక్కడక్కడ తళుక్కుమంటూ కొందరు మహిళా రాజకీయ దురంధరులు ఉన్నారు.
కొందరి పేర్లను స్పృశించుకుందాం. ఆనాడు సరోజినీ నాయుడు నుంచి మొదలుకుంటే , శక్తివంతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జయలలిత, మమతా బెనర్జీ ,మాయావతి వంటి వారు ఉంటే,ఉమెన్ బిల్ కోసం పట్టుబట్టిన సోనియా గాంధీ ఈనాడు , ఆనాడు సుష్మా స్వరాజ్ వంటి వాళ్లు ఆదర్శ మహిళలు. మమతా బెనర్జీ, ఈశ్వరి బాయి, టీఎన్ సదాలక్ష్మి, ఆరుట్ల కమల దేవి, లక్ష్మీకాంతమ్మ, రోడా. హెచ్. మిస్త్రి, సరోజినీ పుల్లారెడ్డి, ఉమా భారతి ,ఉమా మాధవరెడ్డి, టి. మణెమ్మ ,సంగం లక్ష్మీబాయి, మోటూరి ఉదయం, మల్లు స్వరాజ్యం గీతారెడ్డి, నన్నపనేని రాజకుమారి, టి. కల్పనా దేవి, రేణుక చౌదరి, పురంధేశ్వరి, డీకే అరుణ, జయసుధ, కొండా సురేఖ, గుండు సుధారాణి, సీతక్క, రోజా ,పద్మాదేవేందర్ రెడ్డి సురభి వాణిదేవి, సునీతా మహేందర్ రెడ్డి ,గొంగిడి సునీత, మామిడాల యశస్విని రెడ్డి కడియం కావ్య, మాలోత్ కవిత, మంగలపూడి అనిత వంటి మహిళా నాయకుల పేర్లు చెప్పుకోవచ్చు.
డెల్లా గాడ్ ఫ్రే అని ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ పోస్టులో 1994 నుండి 2004 వరకు రాజకీయ నాయకురాలిగా చట్టసభలలో పనిచేసిన మహిళా మణి.
వరకట్న నిషేధం చట్టం వస్తే ఏం లాభం? బాహాటంగా చేయకుండా లోపాయికారంగా లోపల లోపల గుంభనంగా కట్నాలను లాగుతున్నారు. వరకట్నాలు తీసుకొనే రూపాలు మారుతున్నాయి. కానీ, పరిస్థితులు మారలేదు. ఇక డొమెస్టిక్ వైలెన్స్ బిల్ అంటే గృహహింస రద్దు చట్టం వచ్చింది. కానీ, ఇది కూడా అంతే. విద్యా హక్కు కొంతలో కొంత న్యాయాన్ని సాధించింది. ఈ జ్ఞానంతో సమాజంలో ఎప్పుడూ ఎవరో ఒకరు తోడు వస్తేనే బ్రతకగలం అని భావం నుండి కాస్త ధైర్యంగా కాస్త ఆలోచనత్మకంగా ముందుకు సాగితే మరింత ఫలితాలు సాధించవచ్చు .భావిభారత పౌరులుగా అమ్మాయిలు తలెత్తుకు తిరుగవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు 50% హక్కులు పొందడం కాదు ఇచ్చిన 33వ శాతం బిల్లును ఆమోదింపబడింది .దానికి న్యాయం చేస్తూ రాజకీయాలలో చురుకుగా పాల్గొనాలి మహిళలు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలి అంటే దానికి తగిన విధంగా చదువు ఉండాలి డిగ్రీలు ఉండాలి ప్రపంచ జ్ఞానం ఉండాలి. ముఖ్యంగా ప్రపంచ దేశాల చరిత్ర తెలుసుకోవాలి స్వాతంత్ర్య పోరాటాల చరిత్ర తెలుసుకోవాలి దేశ ఆర్థిక సాంఘిక సామాజిక పరిస్థితులలోని మూలాలను తెలుసుకోవాలి అప్పుడే రాజకీయాల్లోకి దిగాలి. అంగ బలం,అర్థ బలం ఉండాలి.” ఈసురోమని మనుషులుంటే దేశమే గతి పాటుపడునోయ్? ” కవి మాట సత్యం. బుద్ధి బలం, బుజ బలం సంపాదించుకోవాలి.
యువత ముందుకు రావాలి .కాలేజీ చదువులతో పాటు రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి .వివిధ పత్రికలలో వస్తున్నట్టు వంటి సంపాదకీయాలను చదవాలి .ఈ అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రజల మధ్య కాస్తనైనా తిరగాలి. ప్రజా పోరాటాల విశిష్టత తెలుసుకోవాలి ప్రజా బలాన్ని సంపాదించుకోవాలి . ఒక్కసారిగా ఊడిపడరు. రాజకీయ నాయకులు క్రమంగా చదువుకున్న దశ నుంచి మొదలుకుంటే ఉద్యోగ దశ నుంచి మొదలుకుంటే రాజకీయాల్లో అడుగు పెట్టే వరకు కొంతైనా పరిణత స్థితి రావాలి. వస్తుందని ఆశిద్దాం. రావాలని కోరుకుందాం.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పద్య పఠనం

అపురూప చిత్రాలు