యోగా ! Yoga Day

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా

యోగా ప్రాముఖ్యత ను చెప్తూ ముఖ్యమైన విషయాలు చిన్న చిన్న ఉదాహరణ లతో అందరికీ అర్థమయ్యేలా ప్రతి వారం తరుణి పత్రిక పాఠకుల కోసం ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రముఖ రచయిత్రి, సామాజిక వేత్త లక్కరాజు నిర్మల గారు రాస్తారు . ఆత్మీయ నిర్మలగా ప్రసిద్ధి చెందిన నిర్మలగారు అమెరికా లోని డల్లాస్ లో ప్రస్తుతం మన భారతీయులకు ప్రతి రోజూ యోగాసనాలను అభ్యాసం చేయిస్తూ, నేర్పిస్తున్నారు . లక్కరాజు నిర్మల గారు చాలా ఏళ్ళ దాదాపు ముప్పై ఏళ్ల పాటు మెంటల్లీ డిసబెలిటీ పిల్లల కోసం స్కూల్ నడిపారు. రెడ్ క్రాస్ సొసైటీలో , ఓల్డేజ్ సొసైటీ లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు నిర్మలగారు .                                                                                        – సంపాదకులు

యోగ అంటే కలయిక . ఎవరితో కలయిక ? విశ్వంతో కలయిక ! మన శరీరంలో పంచభూతాలు , పంచేంద్రియాలు ఉన్నాయి . మన మూలాధారము భూమి. మన చేతి వేళ్లలో ఉంగరపు వేలు ను భూమి అంటారు. మన శరీరంలో ఉన్న ఎముకలు(బొక్కలు )గోళ్ళు,వెంట్రుకలు, భూతత్వానికి సంబంధించినవి. మన మూలాధారం గణపతి కి సంకేతం అంటారు.
మనం నివసించే భూమి పై మనము కాళ్లు ఆనించటం లేదీమధ్య కాలంలో! అంటే చెప్పులు వేసుకుని నడుస్తున్నాం. రోజు కనీసం 10 నిమిషాలు చెప్పులు లేకుండా భూమిపై నడవాలి. అలా నడవడం లేదు కాబట్టే నడుము నొప్పులు కాళ్ల నొప్పులు వస్తున్నాయి . ఇప్పుడు మీ , మన శరీరానికి నిరంతరము కలయిక కలవాలి టచ్ కావాలి అప్పుడు భూతత్వం మన శరీరంలో మూలాధారాన్ని శుద్ధి , ప్యూరిఫై చేస్తుంది. అప్పుడు మన నిత్యజీవితం సాఫీగా ఉంటుంది. కాబట్టి యోగ అంటే కలయిక. భూమిపై కనీసం పది నిమిషాలు మట్టిలో కాళ్లు పెట్టాలి. భూతత్వాన్ని స్వీకరిస్తున్నాను అని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేయాలి ! ఇది ఒక యోగము !!


అంతేకాదు నేల మీద వజ్రాసనంలో కూర్చుని గాలి పీల్చుకొని వదలాలి. మూలాధారం యొక్క బీజాక్షరము “లం”!బీజాక్షరాన్ని తలుచుకొని గాలి పీల్చుకొని వదలాలి. ఇది యోగాలో మూలాధార ప్రక్షాళన
యోగా అంటే కలయిక ! కలియిక ఎలా ? మన శరీరంలో పంచభూతాలు ఈ విశ్వంలో ఉన్న పంచభూతాలతో కలయిక ! ఇది ఎలా జరుగుతుంది ? మన శ్వాస ద్వారా అంటే యోగా చేసేటప్పుడు గాలి తీసుకోవడం వదిలిపెట్టడం చాలా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మనం జీవిస్తున్న దే ప్రాణ వాయువు వల్ల!
గాలి తీసుకున్నప్పుడు పొట్ట నిండుగా ఉంటుంది. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలికి పోవాలి. కానీ దీనికి వ్యతిరేకంగా జరుగుతోంది దీనిని సరిదిద్దుకోవాలి. అదే యోగ!

అమెరికాలో టెక్సాస్ లోని డాలస్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తూ చాలా రెస్ట్లెస్ గా ఉన్న అమ్మాయిలు మెడిటేషన్ నేర్పమని రిక్వెస్ట్ చేశారు పిల్లలు అటు ఉద్యోగము ఇటు ఇంటి పని అలసిపోతున్నవారు ఏదో ఒక శాంతి కావాలని వారు కోరడం దానితో కొందరు అమ్మలు పిల్లల దగ్గరికి రావడం వారికి ఒక వ్యాపకం కావాలని నన్ను కోరడం అందరికీ మెడిటేషన్ నేర్పించడం జరిగింది 11 రోజులు ఆధ్యాత్మిక ప్రవచనంతో మెడిటేషన్ నేర్పించడం జరిగింది
నిండు పౌర్ణమి రోజున 6 బయట కూర్చుని చంద్రుడు వచ్చాక చంద్రుని చూస్తూ లలితా సహస్రనామ పారాయణం చేయడం మన ఆనవాయితీ. చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు కాబట్టి మనసు తొందరగా నూ… శాంతంగాను ఉంటుంది. అందుకని ఆరోజు మెడిటేషన్ చేయడం ఒక మధురమైన అనుభూతి ని కలిగిస్తుంది. టెక్సాస్ లోని డాలర్స్ లో 21-6- 2024న సామూహికంగా అందరితో మెడిటేషన్ చేయించడం జరిగింది. ఎంతో మధురమైన అనుభూతికి లోనయ్యామని పలువురు భారతీయులు అన్నారు” అని చెప్పిన లక్కరాజు నిర్మల గారి కి మనం అభినందనలు తెలియజేద్దాం.
వీలైన వాళ్ళు వీలున్నంతవరకు మనం కూడా యోగా చేద్దాం.

Written by Lakkaraju Nirmala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శతక పద్యాలు. జీవన మార్గ సూచికలు

మహిళామకుటం మల్లాది సుబ్బమ్మ