మన మహిళామణులు

శ్రీమతి గంగరాజు పద్మజ

బాల్యంలోనే సంగీతం సాహిత్యం సేవాభావం ల బీజం పడింది.అదివృక్షంగా ఎదిగింది.కళాంజలి ఫైన్ ఆర్ట్స్ పేరు తో అక్క జానకితో కల్సి ఎన్నో సాహిత్య సాంస్కృతిక ప్రోగ్రాంలు చేసిన ఘనత ఆమెది! గంగరాజు పద్మజ…

గంగరాజు పద్మజ..కళాంజలితో ఆమె సేవలు !

ఆమె రిటైర్ అయిన ప్రభుత్వ బడి అధ్యాపకురాలు.స్వయంకృషితో ప్రైవేట్ గా చదివి తెలుగు హిందీ ఆంగ్లం ఉర్దూ లో ఆరితేరి అనువాదాలు కవితలు పాటలు బుర్రకథలు ఎన్నో ఎన్నెన్నో ఆయా సందర్భాలకు తగినట్లు రాసి ఇంటాబైట మెప్పుపొందారు.కమ్మగా పాడుతారు పిల్లలకి నేర్పి ఎన్నో రేడియో ప్రోగ్రాంలు హిందీ తెలుగు లో ఇప్పించారు. కళాంజలి అనే సంస్థను నెలకొల్పి అక్క జానకితో కల్సి సభలు సమావేశాలు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ నిర్వహించారు.అంధబాలలకు చదువు చెప్పడం వారి పరీక్షలు టైం లో తాను ఆన్సర్స్ రాయడం అదొక రకమైన ఎలాంటి బహుమతులు సన్మానాలు ఆశించని ప్రవృత్తి.గుప్తదానాలు దైవ స్మరణ చేస్తూ అక్షరాంజలి లో కవితలు సప్తపదులు రాస్తున్నారు.స్వంతంగా కవితా సంపుటి కథల సంపుటి ప్రచురణలో నిమగ్నమై ఉన్నారు.ఆశువుగా హిందీ ఆంగ్లం తెలుగు లో ఏపదానికి అర్థం అడిగినా వెంటనే చె…
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నమాట పద్మజ కి వర్తిస్తుంది.రేకుపలక బలపంతోఒకటో క్లాస్ లో చేరిన పద్మజ కి 5గురు అక్కలు ఒక అన్న.వారి పుస్తకాలు ఇతర పుస్తకాలు పేపర్లు చదివి అర్థం చేసుకునే తెలివితేటలు భగవంతుడు ఆమె కి ఇచ్చాడు.డబుల్ ప్రమోషన్స్ తో గవర్నమెంట్ స్కూల్ ఆజంపురా ఛాదర్ఘాట్ లో కాలాడేరాలో 9 దాకా చదివింది.నడిచి బడికి వెళ్ళేదామె.అక్కలతో పాటు హెచ్.ఎస్.సి.పాసవడం ఓవిశేషం.ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ లో కథక్ డాన్స్ పాటలు పాడి బహుమతులు గెలుచుకున్నది.కర్ణాటక సంగీతం గాత్రం వైలెన్ మ్యూజిక్ కాలేజీ లో నేర్చుకున్న ఆమె కాలనీల్లో జరిగే వినాయక చవితి ఉత్సవాలలో ప్రముఖ పాత్ర పోషించింది.వినాయకవిజయం డాన్స్ డ్రామా పాటలు ఇతరులకు నేర్పుతూ వరుసగా ప్రోగ్రాంలు చేసిందామె.తెలుగుమీడియంలో చదివి స్వయంకృషి తో డిగ్రీ పి.జి.చేశారామె.అమ్మనాన్నలు స్ట్రిక్ట్. అందుకే ఇంట్లో ట్యూషన్ చెప్తూ సోషల్ వర్క్ చేస్తూ పరీక్ష ఫీజు తన కష్టార్జితం తోనే చెల్లించింది.దాదాపు అన్ని ట్యుటోరియల్స్ లో ట్యూటర్ గా పనిచేసి ఆర్థికంగా కుటుంబంని ఆదుకుంది ఆమె.


మానాన్న కి 34ఏళ్లకే 6గురు పిల్లలు.36 ఏళ్ల నాన్నకి ఇద్దరు అల్లుళ్ళు.నేనే ఆఖరు దాన్ని.చదువు అంటే ఇష్టం కానీ బైటకాలు పెట్టడానికి ఇష్టపడలేదు నాన్న.కారణం ఆరోజుల్లో మాకుటుంబంలో పెద్ద మనిషి కానంతవరకే బడి . నాదగ్గర రిక్షావాలా పిల్లలు చిన్న చితకా వృత్తిలో ఉన్న వారి పిల్లలు వచ్చే వారు.వారిచేత చదివించమనేవారు నాన్న.రకరకాలభాషల పిల్లలతో ఇతరులు ఆభాషనేర్చుకునేలా ప్రోత్సహించాను.


అలా పద్మజ టైప్ షార్ట్ హ్యాండ్ క్లాసులు హిందీ పరీక్షసెంటర్ నడిపారు.కరోనా టైం లో మూతబడింది.ప్రైవేట్ గా తెలుగు ఎం.ఎ.హిందీ ఎం.ఎ.సాహిత్యరత్న ఆర్కియాలజీ లో పి.జి.చేసి సారస్వత పరిషత్తు లో తెలుగు పండిట్ ట్రైనింగ్ తెలుగు గ్రేడ్ 2టీచర్ గా ఛాదర్ఘాట్ ఓల్డ్ గర్ల్స్ హైస్కూల్ లో చేసి స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అయ్యారు.ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఉత్తమ అధ్యాపకులు గా ప్రశంసలు పొందారు.ఆ రోజుల్లో మలకపేట లో ముస్లిం బాలికలు యువతులు ఈమె దగ్గర చదువుకునే వారు.వారి ఇల్లు హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నం గా భాసించింది.బి.ఇడి.చేశారు.తండ్రి రైల్వేలో ఆపై ఆర్టీసీ ఉద్యోగి కావటంతో తండ్రి తల్లి ఈమెను తీసుకుని సంపూర్ణ భారత్ యాత్ర చేశారు.అప్పుడేమహారాష్ట్రలోని వరౌరాలో బాబా ఆమ్టే కుటుంబాన్ని కలిశారు.పద్మజ సేవాభావం ఆసక్తి గమనించి ” మాతో ఇక్కడే ఉండిపో” అన్నదా కుటుంబం.కానీ అమ్మ నాన్న బాధ్యత ఆర్థిక ఇబ్బందులతో పాటు అక్క అవివాహిత జానకి కంటిచూపు సమస్య… పద్మజ ను బాధించటంతో ఆమె నిరాకరించింది.కన్నవారి తోడబుట్టిన వారి మంచి చెడులు ఆమె పైనే బడ్డాయి.ధైర్యంగా ఓర్పుతో ఆమె కుటుంబ భారాన్ని మోస్తూ కథలు కవితలు వ్యాసాలు రాస్తూ బాధల్ని మర్చిపోయేది.దానికితోడు దైవ భక్తి రోజూ అందరు దేవుళ్ళ స్తోత్రాలు చదవటం ఆయారోజుల్లో శ్రద్ధగా పూజాపునస్కారాల్లో టి.వి.తో కాలక్షేపం చేసే ఆమెకు అమ్మానాన్న మరణం నెత్తిన పిడుగు పడినట్లు అనిపించింది.కానీ అవివాహితులుగా జానకీ పద్మజ అంధులకి దివ్యాంగులకి సాయం చేస్తూ కళాంజలి హిందీ సెంటర్ నడిపారు.ఈసోదరీమణులగూర్చి నది మాసపత్రిక ఆంధ్ర ప్రభ ఆంధ్ర భూమి వార్త లో పరిచయాలు ప్రచురింపబడ్డాయి.వనితా టి.వి.లో జానకి ఈమెను కంటిచూపు సమస్య గురించి పరిచయం చేశారు.

అక్క జానకితో… సభ్యులు తయారు చేసిన వస్తువులతో గంగరాజు పద్మజ

అక్క జానకి కాన్సర్ తో చనిపోటంతో పద్మజ ఒంటరిగా మిగిలారు.కానీ సరళస్వభావం మాట మంచి తనంతో అందరూ ఆమెకు కావాల్సిన సాయం చేస్తారు.అక్కల అన్న పిల్లలు ఆమె కి అండదండలు గా నిలుస్తారు.ఆమె ఒక మాట చెప్పారు” మాఅమ్మ ఆడపిల్ల కి చదువు ఉద్యోగం ఉండాలి.తనకాళ్ళమీద తాను నిలబడాలి” అని నాకు అండగా నిలిచింది.నాన్నకి ఎందుకో అంతగా ఇష్టం లేదు.ఇంకో ముఖ్య విషయం ఏమంటే హిందీ ఉత్తమ పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఎక్కువ మార్కులు పొందిన పద్మజ పేరు పేపర్ లో రావడం చుట్టు ప్రక్కల వారు అభినందించటం తాను మర్చిపోలేని అనుభవం అనుభూతి అంటారు ఆమె.ఆమెపుట్టినరోజున మాత్రం నాన్న గారు స్వీట్ కొత్త డ్రెస్ బహూకరించటం రెండు నెలలు ముందు నుండే “10 అక్టోబర్ నీ పుట్టినరోజు తల్లీ!” అని పదేపదే గుర్తు చేయడం తాను మరువలేని విషయం అని పద్మజ చెప్పారు.జీవితంలో నలుగురికీ సహాయపడుతూ సాహిత్య సేవ దైవ స్మరణ తో ప్రశాంతంగా ఉండాలి అనేది ఆమె కోరిక ఆశయం.ఆమె కి ఎన్నో ఆటుపోట్లు.కానీ భలే జ్ఞాపకశక్తి! బంధువులు స్నేహితుల పుట్టిన తేదీ తిధివార నక్షత్రం తో సహాతమ పెద్ద కుటుంబం లో ని తాతముత్తాతల ముచ్చట్లు తాను చదివిన పుస్తకాలు అందులో రచయితల కొటేషన్స్ భావాలు వివరించడంలో దిట్ట! ఇలాంటి ఆమె జీవితం స్ఫూర్తి దాయకం కదూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిష్కృతి

” నేటి భారతీయమ్”