తరుణి పాఠకు లకు నమస్కారం
భాస్కర శతకం లోని మరొక పద్యం చూడండి
పలుమరు సజ్జనుండు ప్రియా భాషలే పల్కు కటోర వాక్యములు
పలుక డొకానొకప్పుడ వి పలికిన గీడను కాదు నిక్కమే
చలువకు వచ్చి మీకు డొకజాడను వడగండ్లు రాల్చి నన్
శిలలగు నోటు వేగిరమే శీతల నీరము గాక భాస్కరా
భావం: మంచివాళ్లు ఎప్పుడు కఠినంగా మాట్లాడరు మంచివాళ్లు అంటే ఎక్కడో ఉండరు మన మేలు కోరే వాళ్ళు. అని అర్థం. ఒకవేళ ఎప్పుడైనా కఠినంగా మాట్లాడిన కానీ మనకు మేలు చేస్తాయి. కానీ కీడును చేయవు దీనికి మంచి పోలిక చెప్పారు కవి చూడండి. మేఘుడు చల్లదనాన్ని ఇవ్వడానికి వచ్చి ఒక్కొక్కసారి వడగండ్లను కురిపిస్తాడు అవి రాళ్లు కావు వెంటనే నీరుగా మారిపోతాయి. ఎవరైనా కఠినంగా మాట్లాడగానే వాళ్లు ఎందుకు అలా మాట్లాడారు అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది.
మరొక పద్యం చూద్దాం
చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్నయా
చదువు నిరర్థకము గుణ సంహి తు లెవ్వరు మెచ్చరచ్చటం
బదునుగ మంచి కూర నల పాకము చేసిన నైన నందు నిం
పదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చు నటయ్య భాస్కరా
భావం
ఎంత చదువుకున్న రసజ్ఞత అంటే సారం గ్రహించక పోతే ఆ చదువు వ్యర్థమే అవుతుంది ఎవ్వరు మెచ్చుకోరు దీనికి మంచి ఉదాహరణ చూడండి కూర ఎంత బాగా వం డినను అందులో ఉప్పు లేకపోతే రుచి ఉండదు అలాగే చదువులోని సారం గ్రహించటం కూడా అంత ముఖ్యం అని కవి ఇందులో సూచించారు.