మంగు కృష్ణకుమారితో ముఖాముఖి

– మాలాకుమారి

నాపేరు కమల పరచ. మా ఏమండీగారు మేజర్. ప్రభాత్ కుమార్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. మాలా కుమార్ అనే పేరుతో నేను నా ఆర్మీ, సివిల్, అమెరికా అనుభవాలతో, నేను చూసిన,విన్న సంఘటనలలలో ఆసక్తి కలిగించి వాటి తో, వివాదాస్పదము కాని కథలు రాస్తుంటాను. ఇంకా విహంగ అంతర్జాల పత్రికకు నాలుగు సంవత్సరాలు పుస్తక సమీక్షలు వ్రాసాను. విహంగ కోసం రచయతలతో ముఖాముఖి నిర్వహించాను. నా రచనలు వివిధ ప్రింటెడ్, అంతర్జాల పత్రికలలో ప్రచురించబడ్డాయి.
నాకు “ప్రభాతకమలం” అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రభాతకమలం జూన్ 2020 లో మొదలుపెట్టాను. నా ఛానల్ లో ప్రతి ఆదివారం, గురువారం నా రచనలను, నేను వివిధ రంగాల వారితో చేసిన ముఖాముఖిని, లలిత గీతాలను, దేవాలయాల గురించి, సామ్రదాయాల గురించి, కొండకచో వంటలు, వేరే రచయతల రచనలను నా స్వరములో కానీ, ఆయా రచయితల స్వరం లో కానీ వినిపిస్తూ ఉంటాను. నా శ్రోతలు ప్రభాతకమలం లో తరువాత ఏమి వస్తుందాని ఆసక్తితో ఎదురుచూస్తుంటామని అంటారు. ఇదీ క్లుప్తంగా నా గురించి, ప్రభాతకమలం గురించిన పరిచయం.
నా రచనలను, నా టాక్ షో వీడియోలను తరుణి లో ప్రచురించి ప్రొత్సహిస్తున్న కొండపల్లి నీహారిణిగారికి ధన్యవాదములు.

నా పేరు మంగు కృష్ణకుమారి. పుట్టింది ఒరిస్సాలో. కానీ పెరిగిందీ, చదువుకున్నది ఉద్యోగం చేసింది అంతా విశాఖపట్నమే. నేవల్ బేస్ లో ముఫైఏడేళ్ళు ఉద్యోగం చేసి ఆఫీసు సూపరింటెండెంట్ గా రిటైర్ అయేను. చిన్నప్పటినించీ సాహిత్యం చదవడం అంటే చాలా ఇష్టం ‌ రచనలు చేయడం రిటైర్ అయిన తరవాతే మొదలుపెట్టేను. నన్ను గుర్తించి, నాతో ఇంటర్వ్యూ చేసిన కమలా పరచాగారికి నా ధన్యవాదాలు.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాన్నల పండుగ సందర్భంగా

శతక పద్యాలు. జీవన మా ర్గ సూచికలు.