నేరమూ – శిక్ష – The Court

16-6-2024 తరుణి పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక సంపాదకులు

ఈ లోకంలో మనుషులు ఉన్నతంగా, గొప్ప గా ఉండాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు .కానీ సహజంగా వాళ్ళలోపల ఉన్న గుణ దోషాలు వాళ్లను తప్పుదారి పట్టిస్తూ ఉంటాయి.
కానీ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పనిసరి వేయాలి అనే విధానం కఠినంగా పాటించినప్పుడే నేరాలు తగ్గుతాయి. నేరం చేసిన వాళ్లని అరెస్టు చేసి జైల్లో పెట్టేది బంధించి జరిమానా కట్టించుకుని కొన్నాళ్ల శిక్ష తర్వాత వదిలి వేస్తూ ఉంటారు వీళ్ళు బయటికి వచ్చి మళ్ళీ మామూలు మనుషులు అవుతారా నిజంగా మంచివాళ్ళు గా అవుతారా? ఇవి అందర్నీ తొలచి వేసే ప్రశ్నలు. నిజాయితీ అనేది టార్చ్ లైట్ వేసినా కానరాని పరిస్థితుల్లో సభ్య సమాజం పడిపోయింది. అవినీతి బాగా ప్రబలిపోయినటువంటి రోజులు.

దీనికి అంతటికి కారణం ముందు నుంచి స్త్రీల పట్ల చులకన భావం.పితృ స్వామ్య వ్యవస్థ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఆడవాళ్ళపై అధికారం చెలాయించడం ఎక్కువైపోయింది. మూలాలలోకి వెళ్లి దీనికి కారణాలేంటి అని ఇప్పుడు చర్చించడం కంటే, జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చేద్దాము అని ఆలోచించాలి. కనీసం ముందు తరాల వాళ్లకైనా మంచి సమాజాన్ని అందించాలి. వాడు మగాడు వాడికి ఏంటి? ఈ డైలాగ్ ఎప్పుడైతే తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు తగ్గించుకుంటారో, ఆడపిల్లలు మగపిల్లలు సమానమే నని అలవర్చుకుంటారో అప్పుడు కొంతలో కొంత మార్పు వస్తుంది.
దీనికన్నా ముఖ్యంగా తాగుడు మద్యపానం సేవించడం,సిగరెట్లు కాల్చడం మత్తుమందులు, డ్రగ్స్ సేవించడం, జూదం ఆడడం వంటి వ్యసనాలపై గట్టినిఘా ఉండాలి, నియంత్రించాలి, దొరికితే పెద్ద శిక్షలు వేయాలి. అప్పుడే సమాజం కాస్త మంచిగా మారి పట్టాల మీదకి ఎక్కిన రైలు బండిలా తయారు అవుతుంది.

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి. అమెరికా దేశంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే చాలా నా చాలా ఎక్కువ మోతాదులో ఫీజ్ పడుతుంది . అంతేకాదు ఇన్ని టికెట్స్, ఫైన్సు ఇంత లోపల పడ్డాయి అంటే వాళ్లకుండే లైసెన్స్ రద్దు చేయడం వంటివి చాలా కఠినంగా అమలు చేస్తారు.ఈ టిక్కెట్ కట్టడానికి భయపడి వాళ్ళు పెట్టిన నిబంధనలకు భయపడి డ్రైవర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఈ మధ్యకాలంలో మనదేశంలో కూడా ముఖ్య పట్టణాలలో కూడళ్ళ మధ్యన ట్రాఫిక్ లైట్ పెట్టి కెమెరాలు అరేంజ్ చేయడం వలన, రూల్స్ ను అతిక్రమించి వెళ్లే వాళ్లను దొరకబట్టి డైరెక్టుగా చాలానా కప్పించేటట్టుగా చేస్తున్నారు. అందుకే కొంతలో కొంత నిబంధనలను పాటిస్తున్నారు. దీన్నిబట్టి మనకు ఏం అర్థమవుతుంది? శిక్షలు ఉన్నాయి అంటే నేరం చేయడానికి భయపడతారు. ఉదాహరణ ని న్యాయ శాస్త్రంలోనూ ఇటువంటి అత్యాచారాలకు పాల్పడే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తే తప్పకుండా తగ్గుతారు. సరే, కౌన్సిలింగ్ ఇప్పించడం, చట్టాలను కచ్చింగా అమలుపరచాలి.

అయితే న్యాయస్థానంలో శిక్షలు అనేవి వేరు గా ఉంటాయి పరిహారాలు అనేవి వేరుగా ఉంటాయి. ఈ రెండు ఎప్పుడూ ఒకటి కావు. ఏదో కొంత compensation, పరిహారం ఇచ్చారు కాబట్టి ఇక శిక్షను తక్కువ వెయ్యొచ్చు అనే పద్ధతి న్యాయస్థానంలో ఉండదు. ఎందుకంటే ధనవంతులు శిక్షణ నుండి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి.
ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి ప్రకారం నేరాలు ఎవరు చేసినా శిక్షలు విధించాల్సిందే. మన భారతీయ శిక్షా స్మృతిలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశంలో నైనా న్యాయస్థానాలు ఉంటాయి. శిక్షలు విధిస్తుంటారు.
అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ,ఆస్ట్రేలియా, ఫిలిపైన్స్, మలేషియా, సింగపూర్,జర్మనీ దక్షిణాఫ్రికా ఇలా దేశాలలో ఉక్కు దేశంలో కొరకమైన శిక్షలు ఉన్నాయి. ఆడపిల్లలపై అత్యాచారం ఒక విధంగా పిల్లలపై అత్యాచారం ఒక విధంగా తీసుకున్నప్పుడూ, మైనర్ పై అత్యాచారం మేజర్ పై అత్యాచారం అనేవాటిపై వివిధ రకాల శిక్షలు ఉన్నాయి.

నేరం చేసిన తర్వాత శిక్ష అనుభవించేప్పుడు ఆత్మావలోకనం చేసుకునేలా నాలుగు మంచి మాటలు చెప్పే విధానమే అవసరం·అసలు తాను చేసింది పెద్ద నేరం కాదని అనుకునేప్పుడు కఠిన కారాగార శిక్ష వేయాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నాన్న… నాన్నే

నాన్న