మన మహిళామణులు

ఉంగుటూరు శ్రీలక్ష్మి

ఉంగుటూరు శ్రీలక్ష్మి 9963683437

ఆమె చదివింది ఎసెల్సీ. 1938 లో పుట్టిన ఉంగుటూరు శ్రీలక్ష్మి గారు ఎంతో ఆప్యాయంగా ఓపిక గా తన అనుభవాలను జ్ఞాపకాలను తరుణి తో పంచుకున్నారు.ఆమెకి ఆనాటి సుగుణమణిగారు మొదలు జంధ్యాల గారి దాకా ఎందరితోటో పరిచయాలు వారి ఇంటర్వ్యూ లు నేడు మనందరికీ ముఖ్యం.ఎందుకంటే బాల్యం నుంచి ఇప్పటి దాకా చక్కగా వివరించారు తరుణి కోసం.మరి చదవండి….
తండ్రి ఇంజనీర్ కావడంతో ట్రాన్స్ఫర్స్ అయ్యేవి.అమ్మ తొలి గురువు.పలక బలపం సంగీతం కి ఆది పునాది తల్లి.రాత్రిపూట అమ్మ చెప్పిన కథలు తనకు స్ఫూర్తి ఉత్సాహం ఇచ్చాయి  అన్నారు.1947 లో వైజాగ్ లో ఉన్న కాలంలో సాయంత్రం మొదలు రాత్రి 8దాకా రేడియో వినటం అప్పుడే గాంధీ నెహ్రూ ఇతరదేశనాయకుల పేర్లు వినడం జరిగింది.తల్లిద్వారా దేశ చరిత్ర స్వాతంత్ర్య సమరయోధుల గూర్చి విన్నారామె.రాజమండ్రిలో 6 వక్లాస్ లో పుస్తకం ఎలాపట్టుకోవాలి ఎలా చదవాలి అన్నది నేర్చారు.క్లాస్ లీడర్ గా ఉంటూ బడిలో అన్ని యాక్టివిటీస్ లో పాల్గొన్నారు.ఆటలు తోటపని ఒకటేమిటి అన్నీ తానై ఎదిగారు.15 ఆగస్ట్ రోజు ప్లేగ్రౌండ్ లో పెద్ద ఇండియా మ్యాప్ వేసి ముఖ్యపట్టణాలదగ్గర గుర్తులు పెట్టి బ్యాండ్ వాయిస్తూ క్లాస్ ల దగ్గర ఆగేవారు.బడిలో చదువు తూనే దాదాపు ఆంగ్ల తెలుగు సాహిత్యంని ఔపోసన పట్టారు.ఠాగూర్ అనువాదాలు బాగా చదివారు.1956 లోనే వ్యాసాల…
దుర్గాబాయి దేశ్ముఖ్ గారి సన్నిహితురాలు సుగుణమణిగారితో పరిచయం సోషల్ వర్క్ చేయడానికి పునాది వేసింది.సర్వా శారదగారితో కల్సి ఎన్నో ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సుందర్ నగర్ లో ఓల్డేజ్ హోం కి విస్తృత ప్రచారం కలిగించారు.ఇక రేడియో అనుభవాలు విజయవాడ లో లైవ్ ప్రోగ్రాంలతో ప్రారంభం ఐనాయి.వి.బి.కనకదుర్గ గారు ఎనౌన్స్ మెంట్ ! నాగరత్నమ్మ గారు బాగా ధైర్యం చెప్పారు.విన్న శ్రీ నండూరి సుబ్బారావు గారు ఎన్నో ఎన్నెన్నో కబుర్లు చెప్పారు.ఇకశ్రీ మహీధర రామమోహనరావు గారి తో ఆమె పాల్గొన్న ప్రోగ్రాం మరపురానిది . అలాగే ఉషశ్రీ గారిని కూడా అక్కడే చూశారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లి నపుడు చిక్కటి కాఫీ ఇచ్చి వివరించారుట.భానుమతీ రామకృష్ణ గారిని1997 నుంచి ఇంటర్వ్యూ చేయాలి అనే ఆమె కోరిక 1999 లో తీరింది.భానుమతిగారు ఫోన్ చేసి ” రేపు 9 గంటలకి రండి” అని చెప్పడం పదకొండున్నర దాకా సంభాషణ సాగటం మర్చిపోలేని అనుభూతి.ఆమెకి జాతకాలు చూడటం కూడా వచ్చుట.”మీరు ఇలాగే ప్రోగ్రాం లు ఇస్తారు ఇంకోచోట” అన్న ఆమె వాక్కు నిజమైంది.శ్రీలక్ష్మిగారికి హైదరాబాద్ దూరదర్శన్ నించి పిలుపు వచ్చింది.జంధ్యాలగారి పరిచయం మరో అనుభవం.స్వరాంజలి పేరు తో
కొందరితో కలిసి సంగీత కచేరీలు చేశారు.పుస్తకాలు చదవడం రైటర్స్ వి చదివి అభిప్రాయాలు చెప్పడం ఆమె ఇప్పుడు చేస్తున్న పనులు.

పుట్టినరోజు:21-8-1938
చదువు. :ఎస్.ఎస్.ఎల్.సి.
కుటుంబం:
తండ్రి:మందపాటి. బ్రహ్మానందరావు.
తల్లి: సంపూర్ణ కమలం

భర్త: వి.వి.సుబ్బారావు.
రిటైర్డ్ పోష్టల్ ఇన్స్ పెక్టర్
కుమారులు: రాథాకృష్ణ, శ్రీనివాస్.
కుమార్తెలు: సీత, పద్మ, శైలజ.
నారచనావ్యాసంగం:
1) 1956 నుండి వ్యాసాలకు,
1976నుండి కథలకు,శ్రీ కారంచుట్టాను.
2) 200కుపైగాకథలు, వేఇపైగా వ్యాసాలు వ్రాశాను.
3)1976 నుండి,1989వరకు విజయవాడ ఆలిండియా రేడియోలో, లైవ్ లో కథలు చదివాను,చర్చలలో పాల్గొన్నాను.
1989నుండి 2007దాకా, హైదరాబాద్ ఆలిండియా రేడియోలో కథలు చదివాను.
4)దిన,వార,పక్ష,మాస పత్రిక లన్నిటిలోను,నావ్యాసాలు,కథలూ
ప్రచురితాలు.
5)కాలమిస్ట్ గా”ఆంథ్రప్రభ “లో2000నుండి, నాలుగు సంవత్సరాలు వ్రాశాను.
6)ఉమెన్స్ ఎరా,వారితెలుగుప్రచురణ, “గృహశోభ ” లోపడిన నాకథలు,
వ్యాసాలుఅనువదించి,వారి ఇతర భాషా పత్రిక లలో ప్రచురించారు..

7)ప్రముఖుల ఇంటర్వ్యూ లను
“రచన” మాసపత్రిక లోప్రచురించారు.
వాటిలో, సిరివెన్నెల, జంథ్యాల ఇంటర్వ్యూ లను, ఆస్ట్రేలియా తెలుగు పత్రిక “వాహిని”లోప్రచురించారు.
8) ఆ ఇంటర్వ్యూ లన్ని ఎమెస్కోవారు సాహితీప్రచురణలలో,”విరించినై ” పుస్తకం గా వేశారు.
9)నేనుఒక వ్యాససంపుటి, నాలుగుకథల పుస్తకాలు ప్రచురించాను
ప్రస్తుతం “ఏడువారాల నగలు”
పేరుతోనావ్యాసాలను, సాహితీవారు ప్రచురిస్తున్నారు.
)”లే ఖిని” రచయిత్రులసంస్థలో
12సంవత్సరాలు జాయింట్ సెక్రెటరీ గా పనిచేశాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నువ్వు నేర్పిన విద్యయే

పద్యాలు