ఎడారి కొలను 

ధారావాహికం – 21వ భాగం

(ఇప్పటివరకు: మైత్రేయి ని బెదిరించటానికి సుబ్బారావు  ఫ్రెండ్ ఎసై యోగరాజ్ తోటి కలిసి మైత్రేయి ని రోజు పొలిసు స్టేషన్ కి తీసుకొచ్చి కూర్చోపెడుతుంటాడు. మూడోరోజు మైత్రేయి ని పోలీసులు తీసుకెళ్లడం టూర్ నుండి వెనక్కి వచ్చిన ప్రసాద్ చూస్తాడు. జూనియర్ రాజ్య లక్ష్మి మహిళా సంఘటన అధ్యక్షురాలు  కాంతమ్మ గారిని   తీసుకొని మైత్రేయి ని తీసుకురావటానికి పొలిసు స్టేషన్ కి వెళుతుంది.)      

కాంతమ్మ గారు ఆవేశంగ బాగా చీవాట్లు పెట్టింది. యోగ రాజ్ చేత క్షమాపణ చెప్పించి పత్రికల దాక ఈ వార్తా పోనీయొద్దని బతిమాలుకుంటాడు సి ఐ గారు. ఎలాటి వార్తలు పత్రికలలో వస్తే పోలీసువాళ్ళ కంటే మైత్రేయి కె మంచిది కాదని అనుకొన్న కాంతమ్మ గారు పత్రిక విలేఖరికి రావద్దని చెప్పి, యోగ రాజ్ మీద యాక్షన్ తీసు కొమ్మని పట్టుబట్టింది. దానికి సి ఐ గారు “తప్పకుండ మేడం, నేను ఈ విషయం  హెడ్ ఆఫీసు కి రాసి యాక్షన్ తీసు కుంటాను,”అని ఆమెను శాంత  పరిచి క్యాబ్ బుక్ చేసి తానే స్వయం గ మైత్రేయి ని ఇంటికి పంపించాడు. రాజ్య లక్ష్మి కాంతమ్మ గారి తో కలిసి వెళ్లి పోయింది.

ఇంతలోకే లోపలకొచ్చిన్న ప్రసాద్ సి ఐ ఆర్డర్స్ విన్న తరువాత తనదగ్గరున్న  వీడియో ఇప్పుడే అవసరం లేదులే అని గమ్ముగా ఆగి పోయాడు. మైత్రేయి ని కాబ్ లో కూర్చోపెట్టగానే    కాంతమ్మ గారి దగ్గరికెళ్లి ఆమెకు  మనస్పూర్తి గ ధన్యవాదాలు తెలుపుకున్నారు మైత్రేయి తరఫున. మైత్రేయి మాత్రం ఎదో మత్తులో ఉన్నట్లు మౌనంగా ఎవ్వరి వంక చూడకుండానే వెళ్లి పోయింది.

“పాపం. బాగా టెన్షన్ లో ఉన్నది. ఈమె ని ఆమె హస్బెండ్ బాగా కొట్టాడు. మా మేడం వసుంధరగారే గృహ హింస చట్టం కింద కేసు పెట్టి ఈమె  తరఫున వకాల్తా పుచుకున్నారు. వీడి లాయరేమో, నా క్లయింటు కావాలని చేయలేదు. ఎదో ఆవేశం లో జరిగి పోయింది. పశ్చాత్తాప పడుతున్నాడు అని కోర్ట్ లో చెబుతున్నాడు,” అంటూ టూకీగా మైత్రేయి కేసు ని వివరించింది రాజ్యలక్ష్మి.

“అలా ఎలా అంటారు. ఒకసారి కొట్టిన, మొదటి సారి కొట్టిన హింస హింసే. అలా అనుకొనే చాల మంది అమ్మాయిలు జీవితాంతం ఆ బాధని భరిస్తుంటారు. న్యాయం కోసం ధైర్యం చేయరు. ఎందుకంటే మన సామాజిక స్థితి కూడా అలాంటిదే, సొంత తల్లి తండ్రులే అండగా నిలబడరు ఇలాటి విషయాలలో. పైపెచ్చు నువ్వాడపిల్లవి, నువ్వే సర్దుకు పోవాలని నూరిపోస్తుంటారు,”అన్నారు కాంతమ్మ గారు.

“అక్షరాలా ! మైత్రేయి విషయం లో అదే జరుగుతున్నది కాంతమ్మ గారు. అందుకనే ఏదయినా ఎమర్జెన్సీ అయితే మిమ్మల్ని కలవమని నాకు ముందే వసుంధర మేడం చెప్పారు. అందుకనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది,”అంటూ మాట్లాడింది రాజ్యలక్ష్మి.

“పర్లేదమ్మ. మరీ కేసు ఎవరి దగ్గరి కొచ్చింది,”సాలోచన గ అడిగింది

“జస్టీస్ జయమ్మ గారి దగ్గరకే వచ్చింది,”అంది

“అలాగా,”అంటూ తలూపారు కాంతమ్మ గారు. “పద రాజ్యలక్ష్మి నిన్ను ఇంటిదగ్గర దింపుతాను,”  అన్నారావిడ.

సుమంత్ వస్తున్నా నని ఫోన్ చేసాడు మేడం, అతని తో ఆఫీసు కి వెళతాను,” అన్నది

“వసుంధర ఇప్పుడు లండన్ లో ఉంది కదా ! తనకీ విషయాలేవీ చెప్పద్దు. అవసరమయితే నాకు ఫోన్ చెయ్యి,”అని చెప్పి ఆమె కార్ దగ్గరికెళ్ళగానే, డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు.

ఆమె కార్ లో కూర్చుంది. ప్రసాద్ ని చూసి చేయి ఊపింది. కార్ వెళ్లి పోయింది.

“మీరు చాలా  త్వరగా ఈ సమస్యను కొలిక్కి తెచ్చారండి. కొన్ని  రోజులనుండి మైత్రేయి గారు టార్చర్ అనిభవిస్తున్నారు,”అన్నాడు ప్రసాద్. ఇలా వాళ్ళు మాట్లాడుకునే సమయం లోనే సుమంత్ తన బైక్ మీద అక్కడకి చేరు కున్నాడు.

“హాయ్, నేను సుమంత్, రాజ్య లక్ష్మి గారు చెప్పేఉంటారు,”అంటూ తనని పారేసాడు కి పరిచయం చేసు కున్నాడు.

“ఓహ్! నైస్ మీటింగ్ యూ !”అంటూ కరచాలనం చేసాడు.

“అసలీ సుబ్బారావు ని ఊరికే వదలకూడాదండి. వాడికి మంచి  గుణ పాఠం చెప్పాలి. మన చేతికొక ఆధారం దొరకాలి నాయాల, వాడి తోటి ఆడుకొను, ఏమంటావు బ్రో!”అంటూ  నవ్వాడు.

“ఆధారం దొరుకుతుంది సుమంత్ , అప్పుడు  వాడి పని పడదాం,”అంటూ వంతపాడాడు ప్రసాద్. రాజ్య లక్ష్మిని బైక్ మీద ఎక్కించుకొని వెళ్ళిపోయాడు సుమంత్. ప్రసాద్ కూడా  ఇల్లు చేరుకున్నాడు. మైత్రేయి  తలుపు వేసిఉంది.   ఇప్పుడామెను పలక రించటం అంత  మంచిది కాదు అనుకొని రూమ్ లోకి వెళ్లి పోయాడు.

తలుపు లేసుకున్న తరువాత ఆ వీడియో చూడడం మొదలెట్టాడు ఇంకోసారి వివరంగా.

“సుబ్బారావు విలాసంగా కాలుపుకుంటూ నారింజ పండు ఒలుచుకొని తింటున్నాడు ఆసుపత్రి బెడ్ మీద, పక్కనే ఉన్న అక్కమ్మ తో ,”చూడు అక్కమ్మ , మీ అమ్మ గారికి చెప్పు బుద్ధిగా  నాతొ కాంప్రమైస్ అవమని. మొండికేసిందనుకో,  ఇలా ప్రతి రోజు పొలిసు స్టేషన్ చుట్టూ తిప్పిస్తాను. ఆ యసై నా కు బాగా కావాల్సిన వాడు.”

“ బాబు మీమ్మల్నెవరో కొట్టారంట. అది మైత్రేయమ్మే కొట్టించిందని  మీ అమ్మ గారు  సెప్పారంట, ఎటా  విషయం ,” అంటూ అడుగుతున్నది.

“అదా  అక్కమ్మ, ఎవరు కొడితే ఏమిటి, దెబ్బలయితే తగిలాయి కదా. ఈ దెబ్బలే నా భార్యని నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాయి.   ఆమెను నా మాట విని కోర్ట్ లో కూడా నాకు అనుకూలంగా మాట్లాడమని నా మాటగా చెప్పు. అప్పుడు ఇలాటి సమస్యలేవీ రాకుండా నేను చూసుకుంట,”అంటూ చెప్పుకు పోయాడు. ఇలా అతను  చెబుతున్నదంతా, అక్కమ్మ పక్కనే నుంచొని ఉన్న పోరడు వీడియో తీసి , ప్రసాద్ కి చేరేశాడు.

ఆ వీడియో నే అందరి ముందు అవసర మయితే ఉపయోగించుకోవాలనుకున్నాడు. ప్రసాద్.

(ఇంకా ఉన్నది)   

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

క్యాన్సర్ పోరాట యోధులు

నువ్వు నేర్పిన విద్యయే