తెరలు తెరలుగా
పేజీలు తిరుగుతున్నాయి
అవి పుస్తక పేజీలు కాదు
జీవితంలో చూస్తున్న
ఒక్కో బ్రతుకు పేజీలు
వాటి నుండి
పాఠం నేర్చుకోవాలో
వాళ్ళకి పాఠం చెప్పాలో
తెలియని పరిస్థితిలో
తెర మూసుకుపోయి
పేజీలు శూన్యమయ్యాయి
నూతన పేజీతోనైనా
మరకలు లేకుండా
బయలుదేరాను
ముందుకు సాగుదామని
కానీ
బ్రతుకుచిత్రం
శూన్యానికి తావుండదు
మరకలు అంటుతూనే ఉంటాయి
తుడుచుకుంటూ వెళ్ళడం
ఇంకోదినం ఇంకో పేజితో నడవడడమే