నా ట్రైన్ కథ

కథ

          హరిణి పోటు

నేను ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కోసం బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్ళటానికి గరిబ్ రధ్ ట్రైన్ బుక్ చేసుకున్నాను.
నేను వెళ్ళవలసిన రోజు రానే వచ్చింది,ఇక  నా ఇద్దరు పిల్లలని వదిలేసి బయలు దేరాను.నేను ఉండే జేపీ నగర్ నుండి యశ్వంతపూర్ వెళ్ళటానికి ఒక గంట సమయం,అది మెట్రో రైలు లో,ఒక్కదాన్ని వెళ్ళలేక మా పతిని బతిమిలాడి నన్ను దింపటానికి ఒప్పించాను.తను వచ్చి నన్ను ట్రైన్ ఎక్కించి వెళ్ళిపోయారు.
నాకు సైడ్ లోయర్ బెర్త్ మీద ఉన్న ప్రేమతో , నాకు కేటాయించిన సీట్ లో కూర్చున్న……ఇంతలో నా ఎదురుగా ఒక అబ్బాయి వచ్చి కూర్చున్నాడు,తన లగేజ్ అంతా కింద పెట్టి బయటకి వెళ్ళిపోయాడు…ఇంతలో ట్రైన్ మూవ్ అవడం తను నా ముందు మళ్ళీ కూర్చోవటం….తను తెచ్చుకున్న స్నాక్స్ తిస్కుకొని తన సీట్ అప్పర్ బెర్త్ లోకి వెళ్ళిపోయాడు, మా ఎదురుగా ఉన్న ఒక అంకుల్ ట్రైన్ అంతా తనది అన్నట్టుగా గట్టి గట్టిగా మాట్లాడు తున్నారు.చాలా చిరాకు వేసింది. గరీభ్ రధ్ ట్రైన్ లో బ్లాంకెట్స్ ఇస్తారు అని నాకు తెలుసు ఒకప్పుడు….కానీ ఈ కరోనా పుణ్యమా అని ట్రైన్ ఎక్కటం ఆపేసిన నాకు బ్లాంకెట్స్
ఇవ్వట్లేదు అని నాకు తెలీదు, ఏసీ ఫుల్ గా పెట్టిన వారికి నా నమస్కారాలు…..చలికి తట్టుకోలేక నేను తీస్కొని వెళ్లిన  నా స్కార్ఫ్ తో మేనేజ్ చేస్తూ కూర్చున్నా…..

ఇంతలో పైన నుండి కిందకు దిగి వచ్చి ఆ అబ్బాయి నా ఎదురుగా కూర్చున్నాడు ,నేను తనని బ్లాంకెట్స్
ఇస్తున్నారా అక్కడ అని అడిగాను. తను బ్లాంకెట్స్ ఇవ్వట్లేదు కాదా అని చెప్పటం తో నాకు చచ్చినంత పని అయింది.ఇక నేను ఆ చలికి బ్రహ్మానందం గారిల ఫ్రీజ్ ఐపోతానేమో అని అనుకుంటూ,ఇక ఆ అబ్బాయితో కాసేపు మాటలు కలిపాను, తను బెంగళూరు నుండి గుంతకల్ పని మీద వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి, తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో వర్క్ చేస్తున్నాను అని,వాళ్ళ బాబాయ్ రైల్వేస్ లో చేస్తారు అని అలా వాళ్ళ సంగతులు చెప్తూ వచ్చాడు.కొంచం సేపు చలి మేనేజ్ అయింది మాటలతో….తను దిగవలసిన ప్లేస్ దగ్గరికి వస్తుంది అని చెప్తూ,తన దగ్గర ఒక కొత్త బ్లాంకెట్ ఉంది తీసుకుంటారా అని అడిగాడు,నేను మొహమాటంతో వద్దు అని అన్నాను.తను తిస్కొండి పర్లేదు,ఈ ట్రైన్ లో ఫుల్ ఏసీ ఆన్లో ఉంది మీరు మేనేజ్ చేయలేరు హైదరాబాద్ వెళ్లేవరకు అని చెప్పి తన బ్లాంకెట్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు.ఆ టైమ్ లో తను నాకు ఒక దేవుడు లాగా అనిపించి,తనకి థాంక్స్ చెప్పి,కొంచెం కుదుటపడ్డాను.ఆ బ్లాంకెట్ నన్ను చలి నుండి రక్షించింది.
seriously some small things make big difference.
నేను ఏమి చెప్పాలని అనుకుంటున్నాను అంటే,
ప్రస్తుతం సమాజంలో యువత ఇతరులను పట్టించుకోవడమే మానేశారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఇలా తయారవుతున్నారు అనిపించేది. కానీ మనకు అక్కడక్కడ ఈ కథలో ఉన్నటువంటి అబ్బాయిలు లాంటి వాళ్ళు తారసపడుతుంటారు. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు సమాజం పట్ల సమాజంలోని వ్యక్తుల పట్ల బాధ్యత కలిగి ఉండే వాళ్ళు కూడ ఉన్నారని అనిపిస్తుంది.
తల్లిదండ్రులను మర్చిపోయే యువకులు ఉన్న రోజుల్లో ఒక అబ్బాయి ముందుకు వచ్చి సహాయం చేశాడంటే మదర్ తెరిసా గుర్తుకొస్తుంది ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న, ఒక మంచి యువత భారతదేశ నిర్మాణానికి పునాది.నాకు ఎందుకు అని అనుకునే చాలా మందికి,మీరు చేసే చిన్న హెల్ప్,ఎదుటివారికి చాలా ఉపయోగపడుతుంది.

మీ
AnuKarthi

Written by Harini Potu

పేరు: హరిణి పోటు
కలం పేరు: అనుకార్తి
వృత్తి: ప్రైవేట్ టీచర్
ఊరు: ఖమ్మం, తెలంగాణ.
ఫోన్ నంబర్: 9663039933

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తిరగబడితే!

ఆకాశవాణి తో మన అనుబంధం