తిరగబడితే!

కవిత

గడ్డం సులోచన 7702891559.

నీ హేళన
చూపులవాడిలో
కరిగి కరిగి
నిర్మలమయ్యా
వన్నె తేలిన
బంగారమై

నీ చేష్టల సుడిగుండంలో స్థిరంగా ఉన్నా చలించిన గిరి శిఖరమై

నేలకేసి కొడితే నింగిదాక ఎగురుతా చుక్కల్లే మెరుస్తా!

ప్రజ్వరిల్లే అగ్నిశిఖను నేనైతే,
ప్రచండ ప్రభంజనం
నేనయితే,
నీవెక్కడ..!?

ఆభిజాత్యం!
అహంకారం!
అధికారం!
ఇంకా ఎన్నాళ్ళు?
యుగాలు మారినా
మారని భావజాలం!
అణకువ నేర్చుకో!
ఆదరంగా ఉండు
ఒకే ఒక్క సారి
నే తిరగబడితే..?
నీ గుండె దడదడ లాడుతుంది.
జాలితో వదిలేస్తుంటా..

చేవ లేక కాదు
చేత కాక కాదు
నా విలువను శక్తిని ,
నేనే దాచుకుంటూ,
సంప్రదాయమని చల్లగా ఒదిగి ఉన్నా
తరతరాల వారసత్వానికి తలవంచి ఉన్నా!

ఎదుగు ,ఒదుగు,
గెలువు ,మారు,
లేకుంటే…!?
భావమే తిరగబడు తుంది..
కాలమే ప్రశ్నిస్తుంది.

Written by G. Sulochana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గర్ల్ ఫ్రెండ్

నా ట్రైన్ కథ