ఓ యువత ఏది నీ దారి
ఏమవుతుంది నీ భావి జీవితం
దేశ భవితవ్యాన్ని నిర్ణయించే అధికారివి నీవు
అసాంఘిక శక్తులను అంత మొందించే ఆయుధానివినీవు
నీ కన్న కలలు కల్ల లవుతాయని రోధిస్తున్నావా
సమస్యలు చూసి పారి పోవాల నుకున్నావా
నిరాశ నిస్పృహ లను వదలి
ఏకాగ్రచిత్తంతో
అలుపెరుగని అడుగు ముందుకు వేయి
ఆటుపోట్లను అధిగ మించు
లక్ష్యం సాధించే దాక వేసారక వెను దిరుగక
నీ ముందున్న సవాళ్లను ఎదుర్కొని గమ్యం చేరు
గొప్ప వాళ్ళ చరిత్ర లను ఆదర్శం గా ఎంచుకో
నీ భవిత ను బాధ్యతా యుతంగా మలచుకో
పాశ్చాత్య సంప్రదాయాల
ఫ్యాషన్ ముసుగులో
అజ్ఞానాంధ కారంలో మ్రగ్గుతూ
వింత పోకడ లను ప్రదర్శిస్తూ
చిత్ర విచిత్రవస్త్ర ధారణతో
భారతీయ సంప్రదాయానికి కళంకం తేవద్దు
ఊహలలో తేలిపోతూ నిన్ను నువ్వు మరవకు
వాస్తవాన్ని గమనించు
అందని వాటికి అర్రులు చాస్తూ
కాల యాపన చేయక
బాధ్యత లను గుర్తించు
ఆధునికత పేరుతో
విచ్చల విడిగా తిరుగుతూ
దుర్వ్య సనాలకు లోను గాక
సత్ప్రవర్తన అల వరచుకో
రెండు తరాల వారధి వి నీవు
దేశాన్ని నడిపించే సారధి వి నీవు
నీ విజ్ఞా నాన్నంతా విదేశాలకు తాకట్టు పెట్టక
నీ శక్తి యుక్తులతో నవ సమాజానికి నాంది పలుకు